హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోడీ పక్కకు పెట్టారు..మంత్రి రోజా సంచలన కామెంట్స్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోడీ పక్కకు పెట్టారు..మంత్రి రోజా సంచలన కామెంట్స్

PC: Twitter

PC: Twitter

దారం తెగిపోయిన గాలిపటం ఎటు వెళ్తుందో తెలియదు అన్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో ఎవరికీ తెలియదని ఏపీ పర్యాటక శాఖా మంత్రి, సినీ నటి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.  చిత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోజుకో పార్టీతో కలుస్తున్న పవన్ ను ప్రధాని మోడీ కూడా పక్కకు పెట్టారని అన్నారు. రేండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

దారం తెగిపోయిన గాలిపటం ఎటు వెళ్తుందో తెలియదు అన్నట్టు జనసేన  (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో ఎవరికీ తెలియదని ఏపీ పర్యాటక శాఖా మంత్రి, సినీ నటి ఆర్కే రోజా (Rk Roja) సంచలన వ్యాఖ్యలు చేశారు.  చిత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోజుకో పార్టీతో కలుస్తున్న పవన్ (Pawan Kalyan) ను ప్రధాని మోడీ (Pm modi) కూడా పక్కకు పెట్టారని అన్నారు. రేండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. పవన్ (Pawan Kalyan) కు ప్రజలపై, రాష్ట్రంపై ప్రేమ లేదని ఇటువంటి వారితో ఉపయోగం ఏమి లేదని ప్రధాని మోడీ (Pm modi) కి అర్ధం అయిందన్నారు. అయితే ప్రజలు పవన్  (Pawan Kalyan) ను అప్పుడో మరిచిపోయారు కానీ మీడియా (Media)నే పవన్  (Pawan Kalyan) ను హైలైట్ చేస్తుందన్నారు.

Janasena: వైసీపీని కిందకు ఈడుస్తాం..మేము అధికారంలోకి వస్తాం..పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఇక నేను కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేశాననడం అవాస్తవం అని, కిరణ్ రాయల్ తో ఫోన్ మాట్లాడిన అని అనడం పచ్చి అబద్దమని రోజా (Rk Roja) కొట్టిపడేశారు. రాయల్ అనే పేరును కిరణ్ బ్రతుకు దెరువు కోసమే పెట్టుకున్నారని విమర్శించారు. కిరణ్ రాయల్ జనసేన (Janasena) పార్టీని ఉపయోగించుకుంటున్నారని, కానీ జనసేన (Janasena)కు అతని వల్ల లాభం లేదన్నారు. కిరణ్ రాయల్ ఏవో ప్రూఫ్ లు ఉన్నాయని చేబుతున్నారు వాటిని చూపించాలని రోజా (Rk Roja) అన్నారు. తాను ప్రజలకు సేవ చేసందుకు రాజకీయాల్లోకి వచ్చానని. సీఎం జగన్ ఆశిస్సులతో ప్రజల ఆశిర్వాదంతో తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఏపీఐఐసీ చైర్మన్ గా, మంత్రిగా ప్రజలకు సేవ అందిస్తున్నానని తెలిపారు. ఒక లీడర్ గా, అక్కగా ప్రజలకు సేవ చేస్తూ తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామని రోజా (Rk Roja) తెలిపారు.

ఆరోపణలు అందుకే..

తనపై ఆరోపణలు చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ పబ్లిసిటీ వస్తుందనే వారు మీడియా ముందుకు వచ్చి రోజా (Rk Roja)ను తిడుతున్నారని పేర్కొన్నారు. తాను తప్పు చేసి ఉంటే అవినీతికి పాల్పడి ఉంటే ఏ శిక్ష అయిన అనుభవించేందుకు సిద్ధమని రోజా (Rk Roja) తెలిపారు.

First published:

Tags: Ap, AP News, Minister Roja, Powe star pawan kalyan

ఉత్తమ కథలు