Mega Plan: మొన్న విశాఖ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది అన్నది ఇప్పటికీ రహస్యమే.. రెండు పార్టీల నేతలు అధికారికంగా దీనిపై నోరు మెదపడం లేదు.. జనేసన కీలక నేత నాదెండ్ల మనోహర్ అయితే.. ప్రధానితో జరిగిన సమావేశాన్ని బహిరంగ పరచం అన్నారు కూడా.. దీంతో ఆ భేటీపై ఎవరికి వచ్చింది వారు మాట్లాడుకుంటున్నారు. అయితే విశాఖ రాజకీయ, మీడియా వర్గాల్లో మాత్రం ఓ చర్చ జోరుగా సాగుతోంది. పవన్ ముందు ప్రధాని రెండు ఆప్షన్లు పెట్టారని.. మొదటిది బీజేపీలో జనసేనను విలీనం చేయడం.. లేదా రెండో మెగాస్టార్ చిరంజీవిని జనసేనతో కలిపి.. ఎన్నికల రంగంలోకి దింపడం.. ఈ రెండిటిలో ఏ ఆప్షన్ ఎంచుకున్నా.. బీజేపీ పూర్తి సహకారం ఉంటుందని.. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారని ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలు చూస్తే ఆ మాట వస్తవమే అనిపిస్తోంది.
మొన్నటి వరకు ఏపీ సీఎం జగన్ కు కాస్త సన్నిహింగా కనిపించిన మెగా స్టార్ చిరంజీవి.. రాజకీయంగా పవన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేసే వారు కాదు. కానీ ఇప్పుడు పొలిటికల్ పంచ్ లు పేలుస్తున్నారు. రాజకీయాల్ని జస్ట్ అలా టచ్ చేసి వదిలేస్తూ… ఫ్యాన్స్‌లోనే కాదు… ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌ని కూడా అలర్ట్ చేస్తున్నారు. అన్నయ్య మనసులో ఏదో ఉంది అనే చర్చకు తెరలేపుతున్నారు.
లేటెస్ట్గా ఆయన చేసిన కామెంట్.. రాజకీయాల్లో చర్చగా మారింది. తనకైతే కుదరలేదు.. కానీ తమ్ముడు మాత్రం తేల్చేస్తాడు… అనుకున్నది సాధిస్తాడు.. అంటూ మెగా అన్నయ్య ఇచ్చిన స్టేట్ మెంట్ జనసైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఇదీ చదవండి : సరికొత్త ఎన్నికల నినాదాన్ని తెరపైకి తెచ్చిన సీఎం జగన్.. వర్కౌట్ అయ్యేనా..?
అయితే మెగాస్టార్ ను మొదటి నుంచి పార్టీలోకి రావాలని కమల నాథులు ఆహ్వానిస్తూనే ఉన్నారు. కానీ ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నారు. అయితే పవన్, చిరంజీవి కలిసి ఎన్నికల రంగంలోకి దిగితే కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందని.. టీడీపీ మద్దతు లేకుండానే.. బీజేపీ , జనసేన కూటమి మంచి ఓట్లు సాధించే అవకాశం ఉంటుంది అన్నది బీజేపీ పెద్దలు లెక్కగా కనిపిస్తోంది. అదే మాట.. ఇటీవల పవన్ కు ప్రధాని మోదీ చెప్పినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : ఏపీని మళ్లీ భయపెడుతున్న వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఈదురు గాలులు.. భారీ వర్షాలు!
ఆ తరువాత నుంచే పవన్ తీరు కూడా మారింది. అప్పటి వరకు వైసీపీ విముక్త ఏపీకి అన్ని పార్టీలు కలిసి రావాలి అన పిలు ఇఛ్చిన పవన్.. ఇప్పుటు ఒక్క ఛాన్స్ అంటూ స్వరం మార్చారు.. కేవలం ఆయన స్వరం మారడమే కాదు.. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి సైతం.. పవన్ త్వరలోనే సీఎం అవ్వడం ఖాయమంటూ జోస్యం చెబుతున్నారు. ఈ మెగా అన్నదమ్ముల తాజా వ్యాఖ్యలు చూస్తుంటే.. వచ్చే ఎన్నికల నాటికి.. ఇద్దరూ కలిసి బీజేపీతో కలిసి పని చేయడానికి సిద్ధపడే ఉన్నారని జనసేన వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.. అయితే ఎన్నికలకు ముందే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, Megastar Chiranjeevi, Pawan kalyan, Pm modi