AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోనే ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ (YCP), టీడీపీ (TDP) లు అభ్యర్థులను సైతం 50 శాతానికిపైగా ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చనే ఫీలింగ్ లోనే అంతా ఉన్నారు. ఇటీవల ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు (Sidiri Appala Raju) సైతం అదే మాట చెప్పారు.. జగన్ మాత్రం ప్రతి సమావేశంలో మరో ఏడాదిన్నరలోపే ఎన్నికలు అని చెబుతున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ముందస్తు ఎన్నికలు తప్పవని నేతలకు పదే పదే చెబుతున్నారు. ఏపీలో పార్టీ నేతలు అంతా ముందస్తు ఎన్నికలు తప్పవని ఫీలింగ్ లో ఉన్నారు. అయితే ప్రధాని మోదీ (Prime Minister Modi) అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జీ 20 సన్నాహక సమావేశానికి ఇటు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. అటు ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరితో విడివిడిగా ప్రధాని కాసేపు ఏకంతంగా మాట్లాడారు. అయితే ఇద్దరి నేతలతో మోదీ ఏం మాట్లాడారు అన్నదానిపై ఎవరూ అధికారికంగా ప్రకటించకపోయినా..? ఢిల్లీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఓ ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో ఉన్నట్టు.. మోదీకి జగన్ చెప్పినట్టు ఓ ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు మోదీ నో చెప్పారని.. షెడ్యూల్ ప్రకారం వెళ్లడమే మంచిందని.. ముందస్తు ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే షర్మిల విషయంలో మోదీని జగన్ ప్రశ్నించారని.. ఆమెను అంత అన్యాయంగా కారులోనే ఉంచి అరెస్ట్ చేస్తే.. ఎందుకు స్పందించలేదని.. జగన్ ను మోదీ ప్రశ్నించారని ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమీ జరగలేదని వైసీపీ నేతలు క్లారిటీ ఇస్తున్నారు.. మూడో వ్యక్తి లేని సమయంలో మీకు ఆ విషయం ఎలా తెలిసింది అంటూ విజయసాయి రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోనూ ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు.. వారిద్దరి మధ్య సరదా సంభాషణే జరిగిందనే ప్రచారం ఉంది. బరువు బాగా తగ్గారని మోదీ ప్రశ్నిస్తే.. చంద్రబాబు కూడా.. ప్రధానికి అదే మాట చెప్పారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే కాకుండా.. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అపాయింట్ మెంట్ ఇవ్వాలని చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది. అయితే అందుకు సమాధానంగా మోదీ.. గుజరాత్ ఎన్నికల ఫలితాల తరువాత ఓ సారి సమావేశం అవుదామని చెప్పినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : కాణిపాకం ఆలయంలో ప్రక్షాళన జరిగే అవకాశం ఉందా? ఉన్నతాధికారులు కఠినంగా ఉంటే ఏం జరుగుతుంది?
ఇప్పుడు మరో అంశం కూడా వెలుగులోకి వస్తోంది. ఇటీవల విశాఖలో పవన్ కళ్యాణ్ తో సమావేశమైన ప్రధాని మోదీ ఏం మాట్లాడారు అనేదానిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.. కానీ మోదీ ఆరోజే పవన్ కు రోడ్ మ్యాప్ ఇచ్చారని.. జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని.. కేవలం క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడంపైనే ఫోకస్ చేయండని.. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని.. ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు.. తెలుగు దేశం పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం పెరిగితే అప్పుడు.. పొత్తుల గురించి ఆలోచిద్దాం.. అప్పటి వరకు మీ పార్టీ పటిష్టతపైనే ఫోకస్ చేయండి అని చెప్పినట్టు జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Chandrababu Naidu, Pawan kalyan, Pm modi