president of India: భారత దేశంలో ప్రతి మహిళకూ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (President of India) ఆదర్శనీయులు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కొనియాడారు. మహిళా సాధికారతకు మీరు ప్రతిబింబమని ఆయన పశంసలు కురిపించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ద్రౌపతి ముర్ము ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పర్యటించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా (Krishna District) పెనమలూరు మండలం పోరంకిలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకి రాష్ట్ర ప్రభుత్వం తరపున పౌరసన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్.జగన్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు. ఇవాళ చాలా గొప్ప రోజు అని. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతి పదవిని చేపట్టం అన్నది ఈ దేశంలోనే ప్రతి ఒక్కరికీ కూడా గర్వకారణం అన్నారు. రాష్ట్రపతిగా తొలిసారిగా మన రాష్ట్రానికి వచ్చిన ముర్ముని గౌరవించడం మనందరి బాధ్యతగా భావించి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అన్నారు.
ఒక సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, అణగారిన వర్గాల కోసం అచంచలమైన కృషి చేసిన వ్యక్తిగా అన్నింటికంటే మించి ఒక గొప్ప మహిళగా ద్రౌపతి ముర్ముగారి ఉదాత్తమైన జీవితం ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శనీయం అని కొనియాడారు. రాజ్యాంగ పరంగా నిర్ధేశించిన అర్హతలు ఉన్న ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా ఈ దేశంలో ఎంతటి స్థానానికైనా చేరుకోగలరు అన్నదానికి ద్రౌపతి ముర్ముగారు ఒక గొప్ప ఉదాహరణగా దేశచరిత్రలో ఎప్పటికీ నిల్చిపోతారని గుర్తు చేశారు.
మేడమ్ జీవితంలో మీరు పడ్డ కష్టాలను చిరునవ్వుతోనే స్వీకరించి, సంకల్పంతో మీరు ముందుకు సాగిన తీరు ఈ దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఆదర్శనీయంగా నిలుస్తుందన్నారు జగన్.. ఒడిషాలో అత్యంత వెనుకబడి మయూరుభంజ్ ప్రాంతంలోని సంతాలీ గిరిజన కుటుంబంలో జన్మించిన మీరు ప్రాధమిక విద్యను కూడా పూర్తి చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారని.. అయితే చదువుకోవాలి, చదువు మాత్రమే జీవితాలను మారుస్తుందని గట్టిగా విశ్వసించిన మీరు భువనేశ్వర్ వెళ్లి అక్కడే బీఏ పూర్తి చేశారని.. మీ గ్రామానికి సంబంధించినంతవరకు కాలేజీ వరకు వెళ్లి డిగ్రీ పట్టా పొందిన తొలి మహిళ మీరు కావడం అప్పట్లో ఓ విశేషం అని ఆమె గురించి పొగడ్తలు కురిపించారు జగన్.
ఇదీ చదవండి : రాష్ట్రానికి ఇదేం కర్మ.. రెండు పార్టీల నినాదం అదే.. పేలుతున్న మాటల తూటాలు
తరువాత విశాఖపట్నం చేరుకొని.. ఇక్కడ ఆర్.కె. బీచ్ లో నిర్వహించిన నౌకాదళ దినోత్సవంలో పాల్గొన్నారు. జిల్లాలో కార్యక్రమాలు ముగించుకొని ఐఎఎస్ డేగ విమానాశ్రయానికి చేరుకొని రాత్రి 7.42 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి బయలుదేరి వెళ్ళారు. అయితే రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గౌరవార్ధం రాజ్భవన్లో గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారిక విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ విందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ మోహన్ రెడ్డి, వైయస్ భారతి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి,ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Indian Navy, President of India, Visakhapatnam