హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

power Cuts: ఏపీలో తీరని విద్యుత్ కష్టాలు.. మరికొన్ని రోజులు సమస్యలు తప్పవన్న మంత్రి..? ఎప్పటి వరకు అంటే..?

power Cuts: ఏపీలో తీరని విద్యుత్ కష్టాలు.. మరికొన్ని రోజులు సమస్యలు తప్పవన్న మంత్రి..? ఎప్పటి వరకు అంటే..?

ఏపీలో విద్యుత్ సమస్యలు ఎప్పటి వరకు అంటే?

ఏపీలో విద్యుత్ సమస్యలు ఎప్పటి వరకు అంటే?

power Cuts in AP: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సమస్యలు ఇప్పట్లో తప్పేలా లేవు. అప్రకటిత విద్యుత్ కోతలు, పవర్ హాలిడేలాకు శుభంకార్డు పడేలా లేదు.. దీనిపై విద్యుత్ శాఖ మంత్రే క్లారిటీ ఇచ్చారు. ఏపీలో విద్యుత్ సమస్యకు కారణం ఏంటో కూడా వివరించారు. మంత్రి పెద్ది రెడ్డి ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...

Why Power Cuts in Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్రకటిత విద్యుత్  కోతలకు ఇప్పట్లో.. బ్రేక్ పడేలా కనిపించడం లేదు.  మాడు పగిలే ఎండలతో.. బయటకు వెళ్లలేక.. వేసవి తాపంతో ఇంట్లో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు.  ముఖ్యంగా విద్యార్థులకు (Students) ఇది పరీక్ష కాలం.. ఇలాంటి సమయంలో విద్యుత్ సమస్యలు వేదిస్తున్నాయి.  వర్క్ ఫ్రం హోం (Work from home) చేసే ఉద్యోగులకు నరకం కనిపిస్తోంది. గంటల తరబడి విద్యుత్ కోతలతో (Power Cuts) అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి.  గత ఐదేళ్లు విద్యుత్ కోతలు లేకపోవడంతో.. ఇన్వర్టర్ లు, జనరేటర్లను పెద్దగా నమ్ముకోలేదు. కానీ ఇప్పుడు గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపేస్తుండడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అసలు విద్యుత్ ఎందుకు పోతోందో..? ఎప్పుడు పోతోంది..ఎప్పుడు వస్తోంది అన్నదానిపై క్లారిటీ ఉండడం లేదు.  ఇక పరిశ్రమలకు పవర్ హాలిడేతో కార్మికులకు అవస్థలు తప్పడం లేదు. అయితే ఈ పరిస్థితి ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా లేదు. దీనిపై మంత్రే స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

ఏపీలో ప్రస్తుత విద్యుత్ రంగంలో నెలకొన్న సమస్యలపై విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యకు ప్రధాన కారణం.. బొగ్గు కొరత వల్ల దేశంలోని అనేక రాష్ట్రాలు విద్యుత్ సమస్యలతో సతమతం అవుతున్నాయన్నారు. ఏపీలో విద్యుత్ సమస్యలకు కూడా దేశంలోని బొగ్గు కొరత కారణమన్నారు. అటు కరోనా సంక్షోభం, భారీ వర్షాలు బొగ్గు ఉత్పాదనను ప్రభావితం చేశాయన్నారు. దీనికి తోడుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం కూడా బొగ్గు లభ్యతపై పడిందని వివరించారు.

ఇదీ చదవండి : ఈ అమ్మాయిల ఇంగ్లీష్ కు మంచు లక్ష్మి ఫిదా అవ్వాల్సిందే.. ఫారెన్ లాంగ్వేజ్ అదుర్స్

అలాగే విద్యుత్ కొరత ఏర్పడటంతో బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఏర్పడిందన్నారు మంత్రి. విద్యుత్ కొనుగోలు చేసేందుకు అనేక రాష్ట్రాలు బారులు తీరుతుండటంతో విద్యుత్ ధర అమాంతం పెరిగిపోయిందన్నారు. చాలా రాష్ట్రాల బాటలోనే ఏపీలోనూ విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : సిల్వర్ స్క్రీన్ పై చంద్రబాబు దత్తపుత్రుడి సినిమా.. హీరోయిన్లు ఎంతమంది అంటే..?

నిబంధనల ప్రకారం థర్మల్ ప్లాంట్‌లో 24 రోజులకు సరిపడా నిల్వలు ఉంచుకోవాలని.. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. అనేక రాష్ట్రాల్లోని థర్మల్ ప్లాంట్లలో చూస్తే రెండు నుంచి ఐదు రోజులకు సరిపోయే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీలో విద్యుత్ కొరతను తాము అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మే తొలివారం నాటికి ఏపీలో విద్యుత్ సమస్యలు చక్కబడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Peddireddy Ramachandra Reddy, Power cuts, Power problems

ఉత్తమ కథలు