హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Power Problems: మూడో రోజు తప్పని అవస్థలు.. అప్రకటిత కోతలతో అల్లాడుతున్న జనం.. సామాధానం చెప్పని అధికారులు.

Power Problems: మూడో రోజు తప్పని అవస్థలు.. అప్రకటిత కోతలతో అల్లాడుతున్న జనం.. సామాధానం చెప్పని అధికారులు.

విద్యుత్ కోతలు

విద్యుత్ కోతలు

Power Problems: కరెంటు ఎందుకు పోతుందో తెలీదు..? ఎప్పుడు పోతుందో తెలీదు.. ఫోన్ చేస్తే కరంటు కోతలు కాదు.. అంటారు విద్యుత్ సిబ్బంది.. కానీ సడెన్ గా విద్యుత్ సరఫరా అగిపోతుంది. గంటల గంటలు ఎదురు చూసినా తిరిగి కరెంటు రాదు.. గత మూడు రోజులుగా ఏపీలో పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అర్థరాత్రి అపరాత్రి అని తేడాలేకుండా కోతలు ఆవేదనకు గురి చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఇంకా చదవండి ...

Power Problems: ఓ వైపు మాడు పగిలే ఎండ.. ఫ్యాన్ లు వేసుకున్నా.. కూలర్లు పెట్టుకున్నా ఉక్కపోత తప్పడం లేదు. ఇలాంటి సమయంలో అప్రకటిత కరెంటు కోతలు (Power cuts).. కంటి నిండా ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. గతంలో కంటే దారుణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఐదారేళ్లు వెనక్కు చూసుకుంటే.. కరెంటు కోతలు ఉన్నా.. ముందుగానే ప్రకటించేవారు ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపేసేవారు. దీంతో మిగిలిన సమయంలో పనులు పెట్టుకునే వీలు ఉండేది.. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో  అప్రకటిత కరెంటు కోతలతో ప్రజలు విల్లవిల్లాడుతున్నారు. ఎండాకాలంలో ఓ వైపు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతుంటే.. రాత్రివేళ గంటల తరబడి కరెంటు తీసేస్తుండటంతో జనాలు అల్లాడిపోతున్నారు. అది కూడా ఒక సమయం అంటూ ఉండడం లేదు.. ఒక్కసారి కరెంటు పోతు గంటలు గంటలు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఎందుకు కరెంటు పోయింది.. ఎప్పుడు వస్తుంది అని స్థానిక అధికారులను అడిగి సరైన సమాధానం రావడం లేదు.. పవర్ లోడ్ అని సింపుల్ గా చేతులెత్తేస్తున్నారు. తమ చేతుల్లో ఏం లేదని చెబుతూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో అసలు కరెంటు వస్తుందో రాదో తెలియక.. వచ్చినా ఎంత సేపు ఉంచుతారో తెలియక ఏపీలో పలు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే పగలంతా కరెంటు ఉండడం లేదు.. రాత్రి పూట కూడా కోతలు తప్పడం లేదంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదంటున్నారు. అయితే ఈ రాత్రిళ్లు విద్యుత్ కోతల ప్రభావం ఆస్పత్రులపైనా పడుతోంది.

ఒకవైపు దోమలు... మరో వైపు ఉక్కపోత! కరెంటు కోతలతో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలోని రోగులు, వారి బంధువులు నరకం చూడాల్సి వస్తోంది. జనరేటర్‌ కూడా లేకపోవడంతో రోగులు రాత్రిళ్లు నానా అవస్థలు పడుతున్నారు. సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో భోజనాలు చేస్తున్నారు. చంటిబిడ్డల తల్లులు పిల్లలకు విసనకర్రలతో విసురుతూనే ఉన్నారు. దాదాపు మారుమూల ప్రాంతాల్లోనూ, ఏజెన్సీకి దగ్గరా ఉన్న అన్ని ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రాత్రి పూట కరెంటు కోతలు ఉండడంతో.. రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. పగలు కరెంటు తీసినా కనీసం రాత్రి పూట అయినా విద్యుత్ సరఫరా ఉండేలా చేయండి అని స్థానిక అధికారులను రోగుల బంధువులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి : విమానంలో విందు భోజనం.. టికెట్ కొనకుండానే లంచ్ లేదా డిన్నర్ చేయొచ్చు.. ఎక్కడో తెలుసా?

అనకాపల్లి జిల్లాలో జరిగిన ఓ సంఘటనే ఏపీలో కరెంటు కష్టాలకు నిదర్శనం.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి బంధువులు, బాలింతలు, గర్భిణులు విలవిల్లాడారు. జనరేటర్‌ ఉన్నా అది పనిచేయలేదు. ముఖ్యమైన విభాగాల్లో ఇన్వర్టర్లు రెండు గంటలు పనిచేశాక మొరాయించాయి. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలుకావడంతో టార్చిలైట్ల వెలుగులో వైద్యులు ప్రసవం చేయాల్సి వచ్చింది.

ఇదీ చదవండి : ఈ చలివేంద్రాలు చాలా ప్రత్యేకం.. మనుషులకు మాత్రం కాదు..

లోడు ఎక్కువ అవుతుండడంతో జనరేటర్లు పనిచేయడం లేదని సంబంధిత సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక సమయంలో కరెంటు కోతల వల్ల.. ఈ సారి లోడు ఎక్కువైంది అంటున్నారు. బాగుచేసినా కాసేపటికే అవే మళ్లీ మూలన పడుతున్నాయి. దీంతో రాత్రి వేళ కరెంటు పోతే ఇబ్బంది అవుతుందని రోగుల బంధువుల్లో కొందరు బ్యాటరీతో పనిచేసే టేబుల్‌ ఫ్యాన్లను కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. విద్యుత్ సమస్య కారణంగా మంచి నీటి సరఫరా కూడా సరిగ్గా ఉండడం లేదు.

ఇదీ చదవండి : కేబినెట్ భేటీ తరువాత ఆ మంత్రుల ప్రత్యేక సమావేశంపై ఉత్కంట.. దేవుడి దయ ఉంటే అంటూ బొత్స సంచలన వ్యాఖ్యలు మంత్రి బొత్స సత్యనారాయణ

తాజా పరిస్థితులపై విపక్షాలన్నీ ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఓ వైపు విద్యుత్ ఛార్జీల బాదుడు.. ఇప్పుడు ఈ కరెంటు కోతలు అంటూ మండిపడుతున్నాయి. ఇక రైతులు అయితే.. అధికారులకు మోర పెట్టుకుంటున్నారు. కనీసం ఆరు గంటలైనే విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని కోరుతున్నారు. మీకు చేతులెత్తి మొక్కుతాం! నిరంతరాయంగా ఆరుగంటలు ఇవ్వండి’’ అని పలు జిల్లాల్లో రైతులు అధికారులను వేడుకుంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Power cuts, Power problems