హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: ఏపీలో మరోసారి పోస్టర్ల రచ్చ.. అలాంటి రాతలు అవసరమా..? రాజకీయ వర్గాల్లో చర్చ

AP Politics: ఏపీలో మరోసారి పోస్టర్ల రచ్చ.. అలాంటి రాతలు అవసరమా..? రాజకీయ వర్గాల్లో చర్చ

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. పార్టీల మధ్య సిద్ధాంతపరమైన విమర్శలు పోయాయి. వ్యక్తిగత ఆరోపణలు కూడా దాటిపోయాయి. వ్యక్తిగత దూషణలను దాటి కుటుంబాలను రోడ్డుమీదకు లాగే పరిస్థితులు వచ్చాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Anna Raghu, Sr. Correspondent, News18, Amaravati

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. పార్టీల మధ్య సిద్ధాంతపరమైన విమర్శలు పోయాయి. వ్యక్తిగత ఆరోపణలు కూడా దాటిపోయాయి. వ్యక్తిగత దూషణలను దాటి కుటుంబాలను రోడ్డుమీదకు లాగే పరిస్థితులు వచ్చాయి. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడంతో రాజకీయం వేడెక్కింది. అంతేకాదు ఈ వ్యవహారంపై మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా యుద్ధం కూడా కొనసాగుతోంది. చంద్రబాబు గతంలో ఎన్టీఆర్ పై చేసిన విమర్శలు, ఆరోపణలను ఇప్పుడు వైసీపీ వైరల్ చేస్తోంది. ఆ వ్యవహరాన్నే ఆయుధంగా చేసుకొని విమర్శలు గుప్పి్స్తోంది. ఇప్పుడదే పోస్టర్ల రూపంలో ప్రత్యక్షమవుతోంది.

  గతంలో టీడీపీని ఎన్టీఆర్ వద్దనుండి లాక్కున్నపుడు వైస్రాయ్ కుట్ర సమయంలో ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్‌ కి చంద్రబాబు  ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో “వుయ్ డోన్ట్ నీడ్ ఎన్టీఆర్..” అంటూ చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు విజయవాడలో కనిపించాయి . ఈ పోస్టర్లు బాబు అన్న మాటలే కాబట్టి అధికారపక్షం అనటంలో తప్పు లేదని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.

  ఇది చదవండి: ఎన్టీఆర్‌పై హీటెక్కిన ఏపీ రాజకీయం.. బాబును వెంటాడుతున్న గతం.. విజయవాడలో వెలసిన పోస్టర్లు..

  ఐతే తాజాగా విజయవాడలో పలు చోట్ల వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కొంతమంది ఓ అడుగు ముందుసేకి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా పోస్టర్లు అంటించారు. గతంలో ఇదే వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఇప్పుడు వెలసిన పోస్టర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సహజమేకానీ ఇలా నాయకుల కుటుంబ సభ్యులను రోడ్డుపైకి లాగడం సరైంది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  ఇది చదవండి: అబ్బాయి నీరు.. బాబాయ్ ఫైర్.. ఎన్టీఆర్, బాలయ్య ట్వీట్ల వెనుక లెక్క ఏంటి..?

  ప్రస్తుత రాజకీయాల్లో సహనం, నైతిక విలువలు లేవని సీనియర్ రాజకీయ నాయకులంటున్నారు. ఎవరు ఏ పార్టీకి చెందిన నేతల కుటుంబాలను అలా విమర్శించకూడదని.. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ల గురించి హద్దులు దాటి రాయడం, ప్రచారం చేయడం తగదని సూచిస్తున్నారు. నాయకులు అనుసరించే పద్దతులను కార్యకర్తలు అనుసరిస్తే రాజకీయాల్లో అనైతికత పెరిగే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు

  ఇది చదవండి: ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడంలో తప్పులేదు.. ఎన్టీఆర్‌పై జగన్‌కు గౌరవం ఉందన్న లక్ష్మీపార్వతి

  దీనిపై సీనియర్ జర్నలిస్ట్ దారా గోపీ స్పందిస్తూ.., “ఈ తీరు ఆరోగ్యకరంగా లేదు. మహిళలను, పిల్లలను, వృద్ధులను, నిస్సహాయులను  టార్గెట్ చేయడం వీరుల లక్షణం కాదు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, లేదా అభిమానులు హద్దులు దాటుతున్నారు.  ఈ తరహా ప్రచారం ఎవరు మొదలు పెట్టినా, ఎవరు కొనసాగిస్తున్నా దాన్ని ప్రజలు అంగీకరించరు. ఇంతకు ముందు ఓసారి ఇలాగే ఓ హెచ్చరిక చేస్తే నాపైకి కూడా దాడికి వచ్చారు. అయినా సరే మళ్ళీ చెప్తున్నా, ఈ పద్దతి మంచిది కాదు.  రెండు పార్టీల నేతలు తమ కార్యకర్తలను కాస్త అదుపులో పెట్టుకోవాలి. లేదంటే రాజకీయ నాయకులను పెళ్ళాం, పిల్లలువదిలేసి పోతారు. మీ చెత్త రాజకీయాలకు వాళ్ళెందుకు టార్గెట్ కావాలి? “ అని అన్నారు.

  మరి బెజవాడలో వైరల్ అవుతున్న పోస్టర్లు వైసీపీ పనా..? లేక టీడీపీలోని మరో వర్గం పనా..? లేక మరెవరైనా అలా చేశారా అనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, TDP