హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఎన్టీఆర్‌పై హీటెక్కిన ఏపీ రాజకీయం.. బాబును వెంటాడుతున్న గతం.. విజయవాడలో వెలసిన పోస్టర్లు..

ఎన్టీఆర్‌పై హీటెక్కిన ఏపీ రాజకీయం.. బాబును వెంటాడుతున్న గతం.. విజయవాడలో వెలసిన పోస్టర్లు..

విజయవాడలో చంద్రబాబుపై పోస్టర్లు

విజయవాడలో చంద్రబాబుపై పోస్టర్లు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)‌ లో పేర్ల రగడ పతాకస్థాయిలో కొనసాగుతుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును (NTR Health University) వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ (YSR Health University) గా పేరు మార్చటంతో మొదలైన ఈ రగడ ఆరోపణలు ప్రత్యారోపణలతో హీటెక్కింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)‌ లో పేర్ల రగడ పతాకస్థాయిలో కొనసాగుతుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును (NTR Health University) వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ (YSR Health University) గా పేరు మార్చటంతో మొదలైన ఈ రగడ ఆరోపణలు ప్రత్యారోపణలతో హీటెక్కింది. అంతేకాదు ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ట్వీట్ల యుద్ధం కూడా కొనసాగుతుంది. రోజు రోజుకు వివాదం ముదురుతోంది. ఇప్పుడు ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి.. నందమూరి అభిమానులు.. టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయేలా చేస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ.. వైఎస్ఆర్ యూనివర్శిటీగా పేరు మార్చడంపై.. అందరూ స్పందించినా.. అందరికీ చూపు నందమూరి కుటుంబంపైనే ఉంటుంది. ఊహించినట్టే ఆ కుంటుంబం నుంచి యాక్టివ్ గా ఉండేవారంతా స్పందించారు.

  ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna), కుమార్తె పురందేశ్వరి (Puradeswari), మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram). ఇతర కుటుంబ సభ్యులు సైతం తమదైన స్టైల్లో స్పందించారు. ఐతే అధికార పక్షంలోని నాయకులూ కూడా వీరికి అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

  ఇది చదవండి: అబ్బాయి నీరు.. బాబాయ్ ఫైర్.. ఎన్టీఆర్, బాలయ్య ట్వీట్ల వెనుక లెక్క ఏంటి..?

  వివాదం ఇంత పీక్స్ లో ఉన్నప్పుడు చంద్రబాబును గతం వెంటాడుతోంది. అదే అధికార పార్టీ చేతిలో ఆయుధమై కూర్చుంది. ఇప్పుడదే పోస్టర్ల రూపంలో ప్రత్యక్షమవుతోంది. గతంలో టీడీపీని ఎన్టీఆర్ వద్దనుండి లాక్కున్నపుడు వైస్రాయ్ కుట్ర సమయంలో ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్‌ కి చంద్రబాబు  ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో “వుయ్ డోన్ట్ నీడ్ ఎన్టీఆర్..” అంటూ చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు విజయవాడలో కనిపిస్తున్నాయి.

  ఇది చదవండి: ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడంలో తప్పులేదు.. ఎన్టీఆర్‌పై జగన్‌కు గౌరవం ఉందన్న లక్ష్మీపార్వతి

  అసలే దసరా నవరాత్రులు కావటంతో విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవటానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వస్తారు. వారందరికీ బాబు టీడీపీని ఎన్టీఆర్ వద్ద నుండి ఎలా లాక్కున్నాడో తెలిసేలా ఉన్న ఈ దినపత్రిక కథనాన్ని పోస్టర్ల రూపంలో అంటించారు.

  అసలు ఈ పోస్టర్లను ఎవరు అతికించారనే దానిపై చర్చ రాజకీయ వర్గాలలో తీవ్రంగా నడుస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరును తెలుగు తమ్ముళ్లు తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల కామెంట్స్ కు నిరసనగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే ఇలా చేస్తున్నారా..? లేక తమ చర్యను సమర్ధించుకునేందుకు వైసీపీ కార్యకర్తలు పోస్టర్ పాలిటిక్స్ కి తెరలేపారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఈ పోస్టర్లు సరైన సమయంలో చంద్రబాబును టార్గెట్ చేశాయనడంలో సందేహం లేదు. అంతేకాదు ఎన్టీఆర్ పేరెత్తేముందు ఈ పోస్టర్లకు చంద్రబాబు సమాధానం చెప్పితీరాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తు్న్నాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Chandrababu Naidu

  ఉత్తమ కథలు