హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: అన్న క్యాంటీన్లపై ముదురుతున్న రాజకీయం..! ఇంత పొలిటికల్ గేమ్ అవసరమా..?

AP Politics: అన్న క్యాంటీన్లపై ముదురుతున్న రాజకీయం..! ఇంత పొలిటికల్ గేమ్ అవసరమా..?

సీఎం జగన్, చంద్రబాబు (ఫైల్)

సీఎం జగన్, చంద్రబాబు (ఫైల్)

వైసీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అన్న క్యాంటీన్లను కొనసాగించాలనే డిమాండ్ గట్టిగానే వినిపించింది. ఐతే ప్రతిపక్ష ముద్ర ఏమాత్రం సహించలేని అధికార వైకాపా అప్పటి టీడీపీ హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను రాజన్న క్యాంటీన్‌గా పేరు మార్చి కొనసాగించాలని ఆలోచన చేసింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Andhra Pradesh, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati


  గత ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ (NTR) పేరు మీద అన్న క్యాంటీన్ల (Anna canteens) ను ప్రారంభించి ప్రతిరోజు అనేక వేలమందికి అన్నం అందించేవారు. దీని కోసం అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వైసీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వాటిని కొనసాగించాలనే డిమాండ్ గట్టిగానే వినిపించింది. ఐతే ప్రతిపక్ష ముద్ర ఏమాత్రం సహించలేని అధికార వైకాపా అప్పటి టీడీపీ హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను రాజన్న క్యాంటీన్‌గా పేరు మార్చి కొనసాగించాలని ఆలోచన చేసింది. అనుకున్నదే తడవుగా రాష్ట్రంలో మూతపడిన అన్న క్యాంటీన్లకు రంగులు మార్చి కొన్నాళ్ళ తరువాత తెరస్తామంటూ కాలం వెళ్ళదీశారు.


  ఆ తరువాత కొన్నాళ్ళకు రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని సాకుగా చూపించి అన్న క్యాంటీన్‌ల ఊసే లేకుండా చేశారు. అన్న క్యాంటీన్‌లు ప్రారంభించాలని ప్రతిపక్షాలు ఎంతగా గగ్గోలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక లాభం లేదనుకున్న ప్రతిపక్ష టీడీపీ తన సొంత నిధులతో అన్న క్యాంటీన్‌లను నడపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు పేదలకు పట్టెడన్న పెట్టడం చేతగాని ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం ఉద్దరిస్తుందంటూ విమర్శలు కురిపించాయి.


  ఇది చదవండి: బాబాయ్‌ వర్సెస్‌ అబ్బాయ్‌..! నెల్లూరు వైఎస్సార్‌సీపీలో మళ్లీ రాజుకున్న వర్గపోరు..!


  అన్న క్యాంటీన్‌లను మొదట మంగళగిరిలో ప్రారంభించాలని ప్రయత్నించగా అక్కడ అధికార పార్టీ నేతలు పోలీసులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అనంతరం కుప్పంలో ప్రారంభించబోగా అక్కడి వైసీపీ శ్రేణులు విధ్వంసాన్నే సృష్టించాయి. కుప్పంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించటానికి వచ్చిన ప్రతిపక్షనేత చంద్రబాబుపై దాడికి యత్నించేంతవరకు వెళ్లింది. వైసీపీ నేతల్లా తామేమి దోచుకోవటానికి దాచుకోవడానికి అన్న క్యాంటీన్‌లు నడపదలుచుకోలేదని, ప్రభుత్వం తీరు చూస్తుంటే అమ్మ పెట్టా పెట్టదు అడుక్కుతిన్నివ్వదు అన్న చందంగా ఉందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.


  ఇది చదవండి: త్వరలో నారా లోకేష్ పాదయాత్ర..! డేట్ కూడా ఫిక్స్..? అదే నినాదంతో ముందుకు..!


  గతంలో మంగళగిరిలో రాజన్న క్యాంటీన్ పేరుతో అక్కడి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నదానం కార్యక్రమాన్ని చేపడితే పార్టీలకు అతీతంగా ప్రజలకు మేలుజరగాలని తాము అడ్డుకోలేదనే విషయం వైసీపీ నేతలు మర్చిపోయారా..? అని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అన్న క్యాంటీన్‌లు అడ్డుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులు అనవసర రాజకీయాలు చేస్తు పేదల కడుపుకొడుతోందని, తాము ప్రజలకు చేస్తున్న మంచిని చూసి ఓర్చుకోలేక పోతోందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.  ఐదు రూపాయలకే భోజనం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ప్రభుత్వం మూసివేయడం సంగతి పక్కనబెడితే.. టీడీపీ తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన క్యాంటీన్లను కూడా అడ్డుకోవడంపై ప్రజల్లోనూ ఒకింత అసహనం వ్యక్తమవుతోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, TDP, Ysrcp

  ఉత్తమ కథలు