విజయవాడ (Andhra Pradesh) గ్యాంగ్ రేప్ పై ఏపీ రాజకీయాలు ఇంకా వేడెక్కుతూనే ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రిలో బాధితురాలి పరామర్శ సందర్భంగా రేగిన రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) స్పందించారు. టీడీపీ (TDP) తీరుపై ఆమె మండిపడ్డారు. టీడీపీ నేత బొండా ఉమాపై తీవ్రస్థాయిలో ఆరోపలు చేశారు. బోండా లాంటి ఆకు రౌడీల పట్ల మహిళా కమిషన్ సుప్రీం అని ఆమె స్పష్టం చేశారు. మహిళా కమిషన్ కన్నీరు పెట్టుకోవడానికి లేదని., కన్నీరు తుడవడానికి ఉందని బోండాలాంటి వారికి కన్నీరు పెట్టించడానికి ఉందంటూ హెచ్చరించారు. చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ తూతూ మంత్రంగా ఉందని.. ఆయనకు కనీస మానత్వం లేదని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.
చంద్రబాబు (Chandrababu) పరామర్శకు రాలేదన్న వాసిరెడ్డి పద్మ.. ఆస్పత్రిలో ఆ అరుపులు ఏంటీ..? ఆ కేకలు ఏంటీ..? అని ప్రశ్నించారు. బాధితురాలికి ధైర్యం ఇవ్వకపోతే మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేనేం చేయాలి..? అని నిలదీశారు. బాబు అండ్ బ్యాచ్ చేసిన పనికి సమన్లు ఇవ్వకపోతే..చప్పట్లు కొడతారా..? అని ఆమె అన్నారు. చంద్రబాబు , బోండా ఉమా సమన్లు తీసుకుని మహిళా కమిషన్‌కు సమాధానం చెప్పాల్సిందేని స్పష్టం చేశారు. చంద్రబాబు మానవత్వంలేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ఇదిలా ఉంటే గ్యాంగ్ రేప్ ఇష్యూలో ప్రభుత్వంపై బొండా ఉమా ఫైరయ్యారు. ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారం జరగడం అనేది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారాయన. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటే ప్రభుత్వం ఉలికిపడి నిద్ర లేచిందని.., చంద్రబాబు గారు వస్తున్నారు అని మహిళ కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ వచ్చారని ఆరోపించారు. బాధిత కుటుంబానికి అండగా వైసీపీ ఉండక పోవడం సిగు మాలిన చర్యని మండిపడ్డారు.
తాడేపల్లి సూచనలనే వాసిరెడ్డి పద్మ పాటిస్తున్నారన్నారు. నోటీస్ లో రెండు తేదీలు ఇచ్చారని.., చదువుకున్నా గుడ్డిగా సంతకాలు పెడుతున్నారా..? అని బొండా ఉమా ఎద్దేవా చేశారు. హోం మంత్రి కూడా కనీస సమాచారం లేకుండా మాట్లాడుతున్నారని.. పక్కనున్న మంత్రుల దగ్గర విషయాలు తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారన్నారు. 30 గంటలు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం జరిగితే నా మ్ కే వస్త్ చర్యలు తీసుకున్నారని బొండా ఉమా ఆరోపించారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటే ఏమనుకోవాలన్నారు. ప్రతిరోజూ వేల మంది ప్రజలు వచ్చే హాస్పటల్ ఘటన జరిగితే ఎలాంటి భద్రత ఉందో అర్ధమవుతుందని బొండా ఉమా అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bonda uma, Vijayawada, Ysrcp