Home /News /andhra-pradesh /

AP POLITICS POLITICAL WAR BETWEEN TELUGU DESAM PARTY AND YSRCP LEADERS READY TO DIRECT ATTACK ON ZOOM MEETINGS NGS GNT

YCP VS TDP: ఢీ అంటే ఢీ అనడమే..? ఎదురు దాడి తప్పదని వైసీపీ వార్నింగ్.. మరి టీడీపీ వ్యూహం ఏంటి..?

నారా లోకేష్ జూమ్ మీటింగ్ లో వల్లభనేని వంశీ

నారా లోకేష్ జూమ్ మీటింగ్ లో వల్లభనేని వంశీ

YCP VS TDP: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. అధికార -ప్రధాన ప్రతిపక్షం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇప్పటికే వరకు కేవలం విమర్శలకు, ప్రతివిమర్శలకు మాత్రమే పరిమితమైన నేతలు.. ఇప్పుడు ఎదురుదాడి తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా జూమ్ మీటింగ్ ఉదంతమే ఉదహరణ.. అయితే ఇది అంత కాదు.. ఆరంభమే అంటున్నారు వైసీపీ నేతలు.. మరి టీడీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందో చూడాలి.

ఇంకా చదవండి ...
  YCP VS TDP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ఊహించని పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ (YCP) ఎదురుదాడే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దీంతో ఎలాంటి కౌంటర్ తో ముందుకు వెళ్లాలని తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ (Nara Lokesh) నిర్వ‌హించిన జూమ్ మీటింగ్‌లోకి వ‌ల్ల‌భ‌నేని వంశీ (Vallabaneni Vamsi) , కొడాలి నాని (Kodali Nani) ప్ర‌వేశించ‌డంతో లోకేష్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే అలా నారా లోకేష్ వెళ్లిపోవ‌డాన్ని టీడీపీ లో ఓ వర్గం దీన్ని ప‌రాభావంగా భావిస్తోంది. గట్టిగా కౌంటర్ ఇచ్చి ఉండాల్సింది అంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇలా జూమ్ కాన్ఫ‌రెన్స్ లో చొర‌బ‌డ‌టం అనేది ఇంత‌టితో ఆగిపోయేది కాద‌ని, కేవ‌లం ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని హెచ్చరిస్తోంది.

  ఇకపై జూమ్ కాన్ఫ‌రెన్స్ ల పేరుతో టీడీపీ నేత‌లు వైసీపీపై త‌ప్పుడు ప్ర‌చారం చేప‌డుతున్నార‌ని భావిస్తే.. దాన్ని స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టాల‌ని నిర్ణ‌యించింది. అందులో భాగ‌మే వంశీ, కొడాలి నాని ఎంటర్ అయ్యారని ఆ పార్టీ కీలక నేతలు చెబుతున్నమాట. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జూమ్ కాన్ఫ‌రెన్స్ ల్లోకి వైసీపీ ముఖ్య‌నాయ‌కులు వెళ్ల‌బోతున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డే స్పష్టం చేశారు.. అయితే ఇది కేవలం జూమ్ సమావేశాలకు మాత్రమే పరిమితం అవుతుందా..? లేక టీడీపీ నేతలు నిర్వహించే సభలు.. సమావేశాల్లోనూ ఇలాంటి చర్యలకు పాల్పడతారా అన్నది చూడాల్సి ఉంది..  మరోవైపు త‌ప్పుడు  ఐడీల‌తో కొడాలి నాని, వంశీలు జూమ్ మీటింగ్ లోకి రావ‌డంపై తెలుగుదేశం పార్టీ నేత వ‌ర్ల రామ‌య్య పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. విజ‌య‌సాయిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. విద్యార్థులు ఫెయిల‌వ‌డం అనేది ప్ర‌భుత్వం చేతిలో లేద‌ని, క‌రోనా, ఇత‌ర కార‌ణాల‌వ‌ల్ల ఫెయిలై ఉంటార‌న్నారు. తాను కూడా ఇంట‌ర్ ఫెయిల‌య్యాన‌న్నారు. విద్య‌కు సంబంధించి తెలుగుదేశం పార్టీ దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని, దాన్ని తాము చాలా సీరియ‌స్ గా తీసుకున్నామ‌న్నారు.

  ఇదీ చదవండి : మంగళగిరిలో టీడీపీదే విజయం.. పంతం నెగ్గించుకున్న నారా లోకేష్.. ఏం జరిగిందంటే..?

  అయితే గ‌తంలోలాగా ఇకపై తెలుగుదేశం పార్టీ జూమ్ మీటింగ్ లు నిర్వ‌హిస్తే చెల్ల‌వ‌ని తాము చొర‌బ‌డి వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తామ‌ని వైసీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ వార్నింగ్ హాట్ టాపిక్ అవుతోంది. కేవలం జూమ్ మీటింగ్ లకే కాకుండా.. త్వరలో టీడీపీ నేతలు చేపడుతున్న సభలు.. కార్యక్రమాలకు సైతం వైసీపీ అడ్డంకులు కలిగించే అవకాశం లేకపోలేదని తెలుగు దేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ అలా తమ మీటింగ్ ల్లోకి ఎంటర్ అయ్యి.. రచ్చ రచ్చ చేస్తే పరిస్థితి ఏంటని లెక్కలు వేసుకుంటున్నారు.

  ఇదీ చదవండి : అలనాటి అందాలతార ఫోకస్ ఏపీపైనే.. గోదావరి జిల్లాల్లో కర్చీఫ్ వేస్తున్నారా?

  ముఖ్యంగా తమ సమావేశాల్లో వైసీపీ నేతలు వచ్చి.. వీరంగం చేస్తే.. పార్టీ కార్యకర్తలకు ధీటుగానే సమాధానం చెబుతారని.. కానీ అధికార పార్టీలో పోలీసులు ఉండడంతో.. వారు ఎలాంటి చర్యలకైనా సిద్ధపడే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అందుకే వైసీపీ ఎదురుదాడికి దిగితే ఏం చేయాలి అనేదానిపై ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ స‌మ‌ర్థ‌వంత‌మైన వ్యూహంతో ముందుకు వెళుతుందా? వైసీపీ దాన్ని అడ్డుకుంటుందా? అనేది త్వరలోనే తేలిపోనుంది..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, Vijayasai reddy

  తదుపరి వార్తలు