Home /News /andhra-pradesh /

AP POLITICS POLITICAL FIGHT BETWEEN TDP LEADERS ON YCP BUS YATRA IN ANANTAPURAM NGS

Busyatra Politics: వైసీపీ నేతల బస్సుయాత్రకు.. టీడీపీ కీలక నేత బస్సు.. మ్యాటర్ ఏంటంటే..?

టీడీపీలో బస్సు యాత్ర చిచ్చు

టీడీపీలో బస్సు యాత్ర చిచ్చు

Busyatra Politics: తెలుగు దేశం పార్టీకి ఆ జిల్లా చాలా కీలకమైంది..? వచ్చే ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే అక్కడ ఇద్దరు కీలక నేతల మధ్య ఫైటింగ్.. అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇలాంటి సమయంలో మరో వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వైసీపీ మంత్రుల బస్సు యాత్రకు టీడీపీకి చెందిన బస్సులు అద్దెకు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది.

ఇంకా చదవండి ...
  Busyatra Politics: ఆంధప్రదేశ్ (Andhra Pradesh)లో వైసీపీ (YCP) మంత్రుల బస్సు యాత్ర (Bus Yatra)టీడీపీ నేతల (TDP Leaders) మధ్య చిచ్చు రేపింది. వైసీపీ బస్సు యాత్రతో టీడీపీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా.. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.. ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhkar Reddy) కి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి (Palle Ragunath Reddy) మధ్య చాలా రోజులుగా విబేధాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉన్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు ఓపెన్ గానే విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మంత్రుల బస్సుయాత్ర సైతం జేసీ, పల్లెల మధ్య మరో మాటల యుద్ధానికి తెరలేపింది. ఇటీవల బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జిల్లాకు వచ్చారు. ఆ సమయంలో వేదికపై జేసీ దివాకర్‌రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ దృశ్యం చూసిన పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయాయి. ఇకపై ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని.. కలిసి పని చేస్తారని సంబరపడ్డారు. ఆ ఆనందం ఒక్క రోజు ముచ్చటే అయ్యింది. వారం తిరగకుండానే మళ్లీ పాత పగలు కొత్తగా బుసకొట్టాయి. అనంతపురం జిల్లాలో వైసీపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రం ఆ చిచ్చకు కారణమైంది. చివరి రోజు అట్టహాసంగా యాత్ర ముగింపు సభ నిర్వహించారు వైసీపీ నేతలు. ఆ సభ టీడీపీలో ఇరు వర్గాల మధ్య కొత్త చిచ్చు తెచ్చిపెట్టింది. ఎందుకంటే వైసీపీ సభకు జనాల్ని తరలించేందుకు పల్లె రఘునాథరెడ్డికి సంబంధించిన కాలేజీ బస్సులు ఇచ్చారట. ఆ అంశంపైనే ప్రశ్నలు సంధిస్తోంది జేసీ శిబిరం.

  వైసీపీ నేతలతో మాజీ మంత్రి పల్లెకు సంబంధాలు ఉన్నాయన్నది జేసీ వర్గం గత కొంతకాలంగా చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు వైసీపీ సభకు టీడీపీ నేత పల్లె కాలేజీకి చెందిన బస్సులు నడపడం దుమారానికి కారణమైంది. ఈ అంశాన్ని ఇప్పుడు జేసీ వర్గీయులు సోషల్‌ మీడియాలో ఏకిపారేస్తున్నారు. రాజకీయ కక్షతో దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతోందని.. ఇలాంటి సమయంలో పల్లె కాలేజీ బస్సులు వైసీపీ సభలకు జనాల్ని తరలిస్తున్నాయని జేసీ వర్గం మాటల తూటాలు పేలుస్తోంది. దీనిపై పల్లె వర్గం వెర్షన్ వేరేలా ఉంది.

  ఇదీ చదవండి : నాన్ వెజ్ ప్రియులకు షాక్.. చికెన్ ను మరిచిపోవాల్సిందే..? ఎందుకో తెలుసా..?

  అధికార పార్టీ సభలకు బస్సులు ఇవ్వకపోతే.. భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని కీలక సిబ్బందిని బెదిరించడంతోనే వాటిని సమకూర్చారని వివరణ ఇస్తున్నారు పల్లె వర్గీయులు. ఈ సమస్య చినికి చినికి గాలి వానగా మారుతుండటంతో పల్లె విద్యా సంస్థల వెహికల్స్‌ ఇంఛార్జ్‌ తమ ప్రమేయం లేకుండానే బస్సులను తీసుకెళ్లారని వివరణ ఇచ్చారు. అయినా జేసీ వర్గం శాంతించడం లేదు. పల్లెపై అంతెత్తున లేస్తూనే ఉంది. మొత్తానికి పార్టీ కేడర్‌లోనూ కొత్త చర్చ మొదలైందట. వైసీపీ మంత్రులు బస్సు యాత్రకు.. టీడీపీ నేత బస్సులు పంపించడం ఏంటి అని జేసీ అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ పరిణామాలపై తెలుగు దేశం పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే రెండు వర్గాల మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. సమస్యను త్వరగా పరిష్కరించకపోతే.. పార్టీకి నష్టం తప్పదు అంటున్నారు స్థానిక టీడీపీ కేడర్.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, AP Politics

  తదుపరి వార్తలు