హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu: చంద్రబాబు వ్యూహం మారిందా..? ఢిల్లీ టూర్ పై ఆసక్తికర చర్చ

Chandrababu: చంద్రబాబు వ్యూహం మారిందా..? ఢిల్లీ టూర్ పై ఆసక్తికర చర్చ

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

రాజ‌కీయాల్లో శాశ్వత శ‌త్రువులు ఉండ‌రు, ప్ర‌త్య‌ర్థులు మాత్ర‌మే ఉంటారు అనే సామెతను టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నిజం చేయబోతున్నారా..?

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  రాజ‌కీయాల్లో శాశ్వత శ‌త్రువులు ఉండ‌రు, ప్ర‌త్య‌ర్థులు మాత్ర‌మే ఉంటారు అనే సామెతను టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నిజం చేయబోతున్నారా..? తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని కూడా తమకు అనువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారా..? ప్రస్తుతం చంద్రబాబు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుతన అంచనా తప్పారు. కేవ‌లం 23 ఎమ్మెల్యే, మూడు పార్ల‌మెంట్ సీట్ల‌తోనే టీడీపీ స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇదంతా మోదీతో విరోధం పెట్టుకోవ‌డం వ‌ల్లే అని చంద్ర‌బాబు భావించారు. తాను 2019కు ఏడాదిన్న‌ర ముందు ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటికి రావటం సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కూ బీజేపీ, మోదీల‌పై చంద్ర‌బాబు చేయ‌ని విమ‌ర్శ లేదు.

  ప‌రిపాల‌న‌లో మోదీ స‌ర్కార్ అట్ట‌ర్ ప్లాప్ అయ్యిందంటూ దేశ‌మంతా చంద్ర‌బాబు క‌లియ‌తిరిగి విమ‌ర్శ‌లు చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీజేపీకి, మోదీ నాయ‌క‌త్వానికి ఓట్లు వేయొద్ద‌ని చంద్ర‌బాబు దేశ ప్ర‌జానీకానికి పిలుపునిచ్చారు. తన ఎత్తుగడ తప్పని భావించిన చంద్రబాబు. ఇక అప్ప‌టినుంచి మోదీ స‌ర్కార్‌పై నోరు తెరిచిన పాపాన పోలేదు. 2024 ఎన్నిక‌ల్లో తెలుగుదేశాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీతో పొత్తు కోసం చంద్ర‌బాబు ప్రయత్నిస్తున్నారు.

  ఇది చదవండి: ఆ సమస్య పరిష్కారం కోసం సీఎం జగన్ సంచలన నిర్ణయం.. అధికారులకు కీలక ఆదేశాలు


  ఏపీలో బీజేపీతో ఒరిగేది ఏమిలేదని తెలిసినా, కేంద్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏపీలో జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టొచ్చ‌నేది బాబు ఎత్తుగ‌డ‌. అయితే గ‌తంలో రెండుమూడు సంద‌ర్భాల్లో బాబు చేతిలో మోస‌పోయిన బీజేపీ, ఆయ‌న‌తో క‌లిసి అడుగులు వేయటానికి ఆ సిద్దంగా లేదు. చంద్ర‌బాబును ఏ మాత్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేదు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తీపి క‌బురు చంద్ర‌బాబుకు వ‌చ్చింది. 75 ఏళ్ల స్వతంత్ర మ‌హోత్స‌వాల సంద‌ర్భంగా 2023 వ‌ర‌కు ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింది.

  ఇది చదవండి: మూడేళ్లుగా అభివృద్ధి ఎక్కడ..? మంత్రిని నిలదీసిన జనం.. గడపగడపకులో వ్యతిరేకత..


  ఇందులో భాగంగా నిర్వ‌హించే స‌న్నాహ‌క స‌మావేశానికి రావాల్సిందిగా చంద్ర‌బాబుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానం పంప‌డాన్ని టీడీపీ తమకు అవకాశంగా మలచుకొవాలని భావిస్తోంది. ఈనెల 6న జరగనున్న సమావేశం ద్వారా బీజేపీకి దగ్గరై పొత్తుకు బాటలు వేసుకోవాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. హస్తిన పర్యటనలో చంద్రబాబు తన రాజకీయ చాణిక్యాన్ని ప్రదర్శించి పాతమిత్రులకు దగ్గరవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐతే సమావేశానికి ముందుగానీ, తర్వాత గానీ తనతో భేటీ అయ్యే అవకాశాన్ని మోదీ.. చంద్రబాబుకు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరి బాబు ఢిల్లీ టూర్ కేవలం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కి మాత్రమే పరిమితమవుతుందా..? లేక పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా..? అనేది వేచి చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Bjp-tdp, Chandrababu Naidu

  ఉత్తమ కథలు