Home /News /andhra-pradesh /

AP POLITICS POLITICAL DISCUSSION ON YCP MLA KOTAMREDDY SRIDHAR REDDY AS HE WARNS OWN PARTY LEADERS OVER POLITICAL DOMINATION IN NELLORE ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

YSRCP: అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే.. అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఈయన పేరు తెలియని నెల్లూరు జిల్లా (Nellore District) వాసులు ఉండరు. నిత్యం వార్తల్లోనూ ఆయన నిలుస్తూనే ఉంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలన్నా... వ్యంగ్యగా మాట్లాడాలన్నా.. ఆయనే తర్వాతే. నియోజకవర్గ ప్రజల సమస్యలను తన సమస్యగా భావించి పరిష్కరించే వ్యక్తిగానూ కోటంరెడ్డికి పేరుంది.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, News18, Tirupati

    కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఈయన పేరు తెలియని నెల్లూరు జిల్లా (Nellore District) వాసులు ఉండరు. నిత్యం వార్తల్లోనూ ఆయన నిలుస్తూనే ఉంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలన్నా.. వ్యంగ్యగా మాట్లాడాలన్నా.. ఆయనే తర్వాతే. నియోజకవర్గ ప్రజల సమస్యలను తన సమస్యగా భావించి పరిష్కరించే వ్యక్తిగానూ కోటంరెడ్డికి పేరుంది. మంత్రి పదవి రాలేదన్న బాధతో చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి.. వైసీపీ (YSRCP) నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అసలు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి..?

    క్షేత్రస్థాయిలో మరింత బలాన్ని చేకూర్చుకునేలా వైసీపీ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తుంది. వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా పావులు కదుపుతోంది. నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతానికి ఇప్పటినుంచే ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేసి నూతన నియోజకవర్గ పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నారు. శనివారం జరిగిన ప్లీనరీ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

    ఇది చదవండి: ఏపీలో కొనసాగుతున్న సినిమా టికెట్ల రగడ.. థియేటర్ ఓనర్ల అభ్యంతరాలివే..!


    అధికారం ఉంది కదా అని అధికార మదంతో వ్యవహరిస్తే ప్రజలు సరైన సమయంలో వాతలు పెడతారంటూ కోటంరెడ్డి పార్టీ నేతలను హెచ్చరించారు. నెల్లూరు మాగుంట లేఔట్ చెరుకుపల్లి కళ్యాణ మండపంలో జరిగిన నెల్లూరు రూరల్ వైసిపి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు కార్యకర్తలను కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూడాలని శత్రువులుగా మాత్రం చూడొద్దన్నారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గం ప్రతిపక్ష కార్యకర్తలను ఎట్టి పరిస్థితిలో వేధించవద్దన్నారు. అధికారంలో ఉన్న నేతలు ఎంత తగ్గితే అంత మంచిదని ఆయన తన ప్రసంగంలో కార్యకర్తలకు, నేతలకు సూచించారు. బాధ్యత కలిగిన వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరిని ప్రేమించాలని ప్రత్యర్థి పార్టీల వారిని రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూడాలని శత్రువులుగా ఏ మాత్రం చూడవద్దన్నారు. అధికార మదంతో వ్యవహరించే నాయకులకు ప్రజలు చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన చోట చెప్పాల్సిన విధంగా వాతలు పెడతారని ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు.

    ఇది చదవండి: చంద్రబాబుకు పోటీగా విశాల్..? కుప్పంలో గెలుపునకు జగన్ స్కెచ్..?


    కోటంరెడ్డి వ్యాఖ్యలను బట్టి వచ్చే ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయితే పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమా ఉన్న కొంచం జాగ్రత్తగా ఉండటం మంచిదని బావిచారేమో అనే వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Kotamreddy sridhar reddy, Nellore Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు