Home /News /andhra-pradesh /

AP POLITICS POLITICAL DISCUSSION ON CHANDRABABU MEETS PM NARENDRA MODI IN DELHI IN RECENT TOUR FULL DETAILS HERE PRN GNT

ChandraBabu: ఢిల్లీలో ఛాన్స్ వదులుకోని చంద్రబాబు.. ఆ సామెతను నిజం చేయబోతున్నారా..?

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

ఇటీవల కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ (Azadi ka Amrith Mahotsav) కార్యక్రమానికి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) కి ఆహ్వానం అందింది. ఆహ్వానం అందిందేతడవు చంద్రబాబు ఢిల్లీ పయనమై వెళ్ళారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India
    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    ఇటీవల కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ (Azadi ka Amrith Mahotsav) కార్యక్రమానికి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కి ఆహ్వానం అందింది. ఆహ్వానం అందిందేతడవు చంద్రబాబు ఢిల్లీ పయనమై వెళ్ళారు. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ జతకట్టి మోదీని ఓడించటానికి కాలికి బలపంకట్టుకుని మరీ తిరిగిన దేశమంతా పర్యటించిన చంద్రబాబు ను బీజేపీ అధికారంలోకి వచ్చింది తర్వాత కనీసం పలకరించటం కూడా మానేశారు. అప్పటి నుండి చంద్రబాబు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో సఖ్యతకోసం తహతహలాడుతూ వస్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో అడకుండానే మద్దతిచ్చి బీజేపీ పెద్దలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇప్పడుదే వర్కవుట్ అయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మిత్రపక్షాలను పెంచుకోవాలనే ఆలోచనలో మోదీ ప్రభుత్వం ఉందన్న చర్చ జరుగుతోంది.

    ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మోదీ తో చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. అంతేగాక ఎప్పుడు ఢిల్లీ వచ్చినా తనను కలవవచ్చంటూ మోదీ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారని టీడీపీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మీడియాలోనూ ఈ వార్త హల్ చల్ చేస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు పనిలో పనిగా కొందరు కేంద్రమంత్రులు ప్రభుత్వ పెద్దలతో పాటు కీలక అధికారులను కూడా కలిసి వచ్చారని వినికిడి.

    ఇది చదవండి: మోదీకి చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ ఇదే.. సజ్జల సంచలన కామెంట్స్..


    రాజకీయ అవసరాల దృష్ట్యా అప్పట్లో తమను విమర్శించినా చంద్రబాబు దార్శనికత పై కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఎటువంటి సందేహం లేనట్లే ఉంది. ఇటీవల ఓ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబు అనుభవం, దార్శనికతపై నమ్మకంతోనే తాము అప్పట్లో వేలకోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించామని చెప్పడమే బాబుపై భాజపా పెద్దల వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పటానికి ఉదాహరణగా టీడీపీ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి.

    ఇది చదవండి: పవన్ నాతో నడవాలి.. అలా చెప్తే మేమే పథకాలు ఆపేస్తాం..! ఏపీ మంత్రి హాట్ కామెంట్స్


    ఇదిలా ఉంటే ఢిల్లీ టూర్ లో చంద్రబాబు.. మోదీకి మరో ఆఫర్ ఇచ్చారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణలో తాము అండగా ఉంటామని.. ఏపీలో గెలుపుకు సహరించాలనే ప్రతిపాదనను ఉంచినట్లు జోరుగా ప్రచారం జరుతోంది. ఇదే విషయాన్ని వైసీపీ ముఖ్యనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా అన్నారు. మరి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి.. చంద్రబాబు చేసిన ప్రతిపాదన కలిసొస్తుందని టీడీపీ నేతలంటున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే.. పాలిటిక్స్ లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సామెత నిజమైనా అవ్వొచ్చంటున్నారు విశ్లేషకులు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Chandrababu Naidu

    తదుపరి వార్తలు