తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu)కి పోలీసులు షాకిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీసు స్టేషన్ లో చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. కాగా నిన్న చంద్రబాబు (Chandrababu Naidu)ను అనపర్తి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జలభద్రపురం నుండి అనపర్తి వరకు పాదయాత్రగా వెళ్లారు. అనంతరం అక్కడ మాట్లాడారు. అయితే చంద్రబాబు పోలీసులపై దురుసుగా మాట్లాడారని డిఎస్పీ ఫిర్యాదు చేశారు. దీనితో టీడీపీ అధినేత చంద్రబాబుపై, 8 మంది టీడీపీ నేతలపై, 1000 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది?
చంద్రబాబు రోడ్ షోను నిన్న తూర్పుగోదావరి జిల్లా బలబద్రపురంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు రోడ్ షోను అడ్డుకున్న పోలీసులు.. ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో పోలీసులపై చంద్రబాబు(Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ షో మధ్యలో వాహనం దిగిపోయారు. బలబద్రపురంలో పోలీసులు వాహనాలు అడ్డంపెట్టారు. అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం జగన్ (CM YS Jagan) ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని అన్నారు. పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేక ముందుకెళ్లమంటారా ? అని ప్రశ్నించారు.
ఇది రౌడీల రాజ్యమని ఆరోపించారు. ప్రజల కోసం తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని అన్నారు. ఎంతమందిపై కేసులు పెడతారో చూస్తామని ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించారు. మరోవైపు చంద్రబాబు సభపై పోలీసుల ఆంక్షలు విధించారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. రోడ్డుపై సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అనపర్తిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వేరే ప్రాంతంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించుకోవాలని డీఎస్పీ సూచించారు. రోడ్డుపై సభకు అనుమతి లేదని, టీడీపీ నేతలు సహకరించాలని కోరారు డీఎస్పీ. పోలీసుల ఆంక్షలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలో పోలీసులు తాజాగా చంద్రబాబుతో సహా నాయకులపై, టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP News, Chandrababu Naidu, TDP