టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టబోయే పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. చాలా రోజుల నుండి ఈ పాదయాత్రపై సస్పెన్స్ నెలకొనగా తాజాగా ప్రభుత్వం పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని నారా లోకేష్, టీడీపీ క్యాడర్ కు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ సూచించారు. పాదయాత్రలో ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదన్నారు. కాగా ఈనెల 27 నుంచి 'యువగళం' పేరుతో నారా లోకేష్ (Nara Lokesh) ఈ పాదయాత్ర చేపట్టనున్నారు.
ఇక ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4000 వేల కిలోమీటర్ల వరకు.. అంటే కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ (Nara Lokesh) యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగనుంది. యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకోడంలో భాగంగా యువగళం పేరుతో ప్రత్యేక జెండా కూడా రూపకల్పన చేశారు.
ఈ పాదయాత్రలో మొత్తం వంద నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అన్ని వర్గాల సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారి పరిష్కార మార్గాలను సూచించనున్నారు. ఈ పాదయాత్రపై తెలుగు దేశం భారీ ఆశలే పెట్టుకుంది.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని.. లోకేష్ (Nara Lokesh) కు రాజకీయ కెరీర్ కు ఉపయోగపడుతుందంటున్నారు. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, Nara Lokesh, TDP