Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
ఆంధ్ర-తెలంగాణ (Andhra -Telangana) విడిపోయేటప్పుడు లోటు బడ్జట్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు అప్పటి అధికార యూ.పి.ఏ ప్రభుత్వం (UPA Government) కొన్ని ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తామని హామీలను ఇచ్చింది. అందులో ప్రధానమైనవి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా వంటివి ముఖ్యమైనవి. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను, అప్పులను సైతం ఆంధ్ర తెలంగాణకు జనాభా ప్రాతిపధికన 52% ఏ.పి కి 48% తెలంగాణకి పంచడం జరిగింది. ఐతే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయింది అనే భావన అక్కడి ప్రజలలో నెలకొంది.
రాష్ట్ర విభజన నాటికంటే ఆ తరువాతి పరిణామాలు రాష్ట్ర ప్రజలను మరింత బాధిస్తున్నాయి. విభజన హామీలు తుంగలో తొక్కిన యు.పి.ఏ ని ప్రజలు ఇంటికి సాగనంపితే.. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి పరిస్థితిని మరింత జఠిలం చేసింది. ఎన్.డి.ఏ మిత్రపక్షంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అప్పట్లో హామీలు సాధించడంలో ఒకింత నిర్లక్ష్యం వహించింది.
అదీగాక పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పై ఉన్న హక్కులను వదులుకోవడమే గాక ఆస్తుల పంపకం విషయంలో పట్టు విడుపులు ప్రదర్మించింది. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజి అంటూ కొత్త నాటకానికి తెరలేపి హోదా అంశాన్ని అటకెక్కించింది. అప్పట్లో హోదా ముగిసిన అధ్యాయం అని ఎవరైనా ప్రత్యేక హోదా అంటే జైలుకు పంపించడానికి కూడా వెనుకాడ లేదు.
ఇదీ చదవండి : ముంచుకొస్తున్న మాండూస్ తుఫాన్.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
మళ్ళీ ఎన్నికల నాటికి ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుందనే భయంతో తమకు స్పెషల్ ప్యాకేజి సమ్మతం కాదని స్పెషల్ స్టేటస్ మాత్రమే కావాలంటూ ప్లేటు ఫిరాయించింది. అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. దీంతో ప్రజలు టీడీపీనీ సాగనంపి వైసీపీకీ పట్టం కట్టారు. తమకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చి గెలిపించందడి.. కేంద్రం మెడలు వంచి విభజన హామీలు సాధించుకు వస్తామని హామీ ఇచ్చిన జగన్.. మూడున్నరేళ్ళగా సాధించింది ఏమీ లేదనే విమర్శలు ఉన్నాయి.
ఇదీ చదవండి: ఏపీని భయపెడుతున్న మండూస్.. నష్ట తీవ్ర ఆ రేంజ్లో ఉంటుందా..?
జగన్ తనపై ఉన్న అక్రమ ఆస్థుల కేసులకు భయపడి విభజన అంశం విషయంలో కేంద్రాన్ని కనీస స్థాయిలో కూడా ప్రశ్నించడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాజమండ్రి మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ విభజన హామీలపై సుప్రీం కోర్టులో వేసిన కేసు ఇప్పుడు విచారణకు రావడం, కేసును వదిలేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడం హాట్ టాపిక్ అవుతోంది.
ఇదీ చదవండి : ఆ కాలేజ్లో ఫ్రీగా పని చేయాలా..? జీతం ఇవ్వకుండానే ఇచ్చినట్టు సంతకం పెట్టాలా..?
ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సదరు కేసును మూసివేయాలంటూ ధర్మాసనానికి విన్నవించడంతో.. కేసుని ప్రస్తుతానికి ప్రక్కన పెట్టమంటారా లేక పూర్తిగా సమాధి చేయమంటారా అని ప్రశ్నించి తదుపరి వాదనలు ఈ నెల 22వ తారీఖు వింటామని అప్పటికి కౌంటర్ దాఖలు చేయమని చెప్పారంటూ ధర్మాసనం ప్రకటించింది. దీంతో సీఎం జగన్ తీరుపై విమర్శలు మొదలయ్యాయి.. విభజన హామీలు అవమలు కాకపోయినా.. ప్రభుత్వం కాంప్రమైజ్ అయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఆ కాలేజ్లో ఫ్రీగా పని చేయాలా..? జీతం ఇవ్వకుండానే ఇచ్చినట్టు సంతకం పెట్టాలా..?
ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పోవటానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోము అంటూ సరికొత్త వాదనకు తెరలేపారు. జగన్ సోదరి షర్మిళ సైతం మీ రాష్ట్రం సంగతి మీరు చూసుకుంటే మంచిదని, అక్కడ ఏమీ చేయడం చేతగాక ఇక్కడ వేలమంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను మళ్ళీ ఆంధ్రలో కలపటానికి ప్రయత్నిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి : మత్తులో తూగుతున్న యువత.. ఈ జిల్లాలోనే అధికంగా అక్రమ మద్యం పట్టివేత..!
ఆంధ్రప్రదేశ్ ను తమిళనాడులో కలుపుతారా, హైదరాబాద్ కావాలి అని అడిగినట్లే చెన్నైని కూడా కావాలని అడుగుతారా అంటూ తెలంగాణ నేతలు ఎదురు దాడికి దిగారు. చరిత్రను వెనక్కి తీసుకు వెళ్ళడం సాధ్యం అయ్యే పని కాదని వైసీపీ తన అసమర్ధతను కప్పి పుచ్చుకొవడానికే ఇప్పుడు మళ్ళీ సమైఖ్యరాష్ట్రం అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
బలవంతంగా రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ తమకు తీరని అన్యాయం చేస్తే,ఇప్పుడు హామీలను నెరవేర్చకుండా బీజీపీ మరింతగా అన్యాయం చేస్తుందని ప్రజలు వాపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Guntur, Pm modi