హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ ట్వీట్ల దాడి..ధనిక సీఎం పాలనలో పేద ఏపీ అంటూ..

Pawan Kalyan: జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ ట్వీట్ల దాడి..ధనిక సీఎం పాలనలో పేద ఏపీ అంటూ..

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

ఏపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బుధవారం ట్వీట్ల దాడికి దిగారు. సీఎం జగన్ (Cm jagan), వైసీపీపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం పాలనలో ఉన్న పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఏపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బుధవారం ట్వీట్ల దాడికి దిగారు. సీఎం జగన్ (Cm jagan), వైసీపీపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం పాలనలో ఉన్న పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు.  ఆక్సిమొరాన్ అంటే విరుద్ధమైన రెండు పదాల కలయిక. మన సీఎం సంపాదన దేశంలోనే మిగతా సీఎంల కంటే ఎక్కువ సంపాదన అని పవన్ చెప్పుకొచ్చారు. అసలు దేశంలో జగన్ క్లాస్ వేరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భూమి నుండి ఇసుక వరకు..మధ్యం నుండి గనుల వరకు..అడవుల నుండి కొండల వరకు, కాగితం నుండి ఎర్రచందనం వరకు ఏపీ నుండి వచ్చే ప్రతీ పైసా కూడా ధనిక సీఎం చేతిలో ఉందన్నారు.

Ap Three Capitals Case: 3 రాజధానుల కేసు విచారణపై బిగ్ అప్డేట్..సుప్రీంకోర్టు విచారణ ఎప్పుడంటే?

వైసీపీ ప్రభుత్వం ఏపీకి పెట్టుబడుల స్వర్గాన్ని ఆంధ్రాకు తీసుకొచ్చినప్పుడు ఇక దావోస్ ఎవరికి కావాలి. ఇక మన ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి న్యూడిల్స్ సెంటర్, ఛాయ్ సెంటర్లు కూడా ప్రారంభిస్తున్నారు. ఇది వైసీపీ మాస్టర్ క్లాస్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు అరకులో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలోనే అత్యంత ధనిక సీఎం చారు మజుంధార్, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, కామ్రేడ్ పుచ్చపల్లి సుందరయ్య వంటి క్లాస్ వార్ గురించి మాట్లాడడం చోద్యం అంటూ ట్వీట్ చేశారు.

Ap-Ycp: కోటంరెడ్డిలాగే బాధపడుతున్న ఆ 35 మంది ఎవరు?

ఏపీలో వర్గాలకు తావులేదు. కానీ వైసిపి రాజ్యంలో ప్రజలను బానిసలుగా చేశారని పవన్ విమర్శించారు. ప్రజల శ్రమ, గౌరవం, జీవితాలు కొంతమందికి అమ్ముడుపోయాయని పవన్ మరో ట్వీట్ చేశారు. వైసీపీ వారిని ట్యాక్స్ పేయర్ గానే చూస్తుందని, ఇది నిజంగా క్లాస్ అంటూ పవన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

4) Who needs Davos when YCP can bring the galaxy of investments to Andhra; Our IT and Industries Minister has already inaugurated Noodles Centre and Chai Points, now only waiting for the IT Companies to be set up. Another CLASS Act!

— Pawan Kalyan (@PawanKalyan) February 1, 2023

కాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

First published:

Tags: Andhrapradesh, Ap, Ap cm jagan, Janasena, Pawan kalyan, Ycp

ఉత్తమ కథలు