హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan kalyan: ఊపిరి పీల్చాలో .. వద్దో కూడా చెప్పండి ..వైసీపీ పాలకులపై పవన్ కల్యాణ్ ఫైర్

Pawan kalyan: ఊపిరి పీల్చాలో .. వద్దో కూడా చెప్పండి ..వైసీపీ పాలకులపై పవన్ కల్యాణ్ ఫైర్

PAWAN TWEET

PAWAN TWEET

PAWAN KALYAN:ట్విట్టర్‌ వేదికగా తాను ఊపిరి పీల్చుకోవాలా లేక అది కూడా ఆపేయమంటారా అంటూ వైసీపీ ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. రాజకీయంగా ఎదుర్కొనలేక తన ప్రతి అడుగులకు అడ్డుపడుతున్నారంటూ వైసీపీ నేతలపై అహనాన్ని వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీలో జనసేనాని పవన్ కల్యాణ్ అడుగులకు వైసీపీ సర్కారు బ్రేకులు వేస్తోందా..? ఎన్నికలకు ఏడాది ముందే పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ప్రచార రథం తయారు చేయించుకుంటే వెహికల్ రంగు పేరుతో విమర్శలు చేయడానికి కారణం ఏమిటి..? గత ఏడాది నుంచి వైసీపీ(YCP) ప్రభుత్వం పవన్ కల్యాణ్ పట్ల, ఆయన సినిమాల పట్ల, రాజకీయ కార్యక్రమాలకు అడ్డుపడటంపై పవన్ కల్యాణ్‌ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్‌(Twitter)వేదికగా తాను ఊపిరి పీల్చుకోవాలా లేక అది కూడా ఆపేయమంటారా అంటూ వైసీపీ ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఎన్నికల ప్రచారం కోసం ఆలివ్ గ్రీన్‌ షర్ట్‌ని ట్విట్టర్‌లో షేర్ చేసిన పవన్ కల్యాణ్ కనీసం ఈ చొక్కా అయినా వేసుకోనిస్తారా అంటూ వైసీపీ పాలకుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సెటైర్లు వేశారు.

Kurnool: వైసీపీ డ్రామాలు ఆడుతోందా..? బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు

గాలి పీల్చుకోనిస్తారా లేదా.?

పాలకులు తప్పు చేస్తే జనసేన ప్రశ్నిస్తుందని..ప్రశ్నించేందుకే తాను పార్టీ పెట్టానంటూ ఆపార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గతంలోనే క్లియర్‌ కట్‌గా చెప్పారు. ఇందులో భాగంగానే ఏపీలోని వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ రాజకీయ ప్రసంగాలు, పర్యటనలు, యాత్రలు చేస్తూ వస్తున్నారు. వైసీపీ కూడా అంతే ధీటుగా పవన్‌ కల్యాణ్‌ తీరును ఎండగడతూ వస్తోంది. రాబోయే ఎన్నికల కోసం పవన్ కల్యాణ్ ఆలివ్ గ్రీన్ కలర్ ప్రచార రథాన్ని తయారు చేయించుకున్నారు. అది మిలటరీ వాహనాల రంగులో ఉండటంతో పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌కి ఈమాత్రం తెలియదా..అంటూ ఎద్దేవా చేయడంతో ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు జనసేనాని.

కనీసం షర్ట్ ఐనా వేసుకోనిస్తారా..?

ఏపీ రాజకీయాల్లో వైసీపీ వర్సెస్‌ జనసేనగా మారాయి. గత కొద్ది రోజులుగా పవన్‌ కల్యాణ్ ప్రచారాన్ని, పర్యటల్ని, యాత్రలను పర్మిషన్ లేదనే కారణంతో అడ్డుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో తన సినిమాల ప్రదర్శన నుంచి వైజాగ్‌లో తనను హోటల్‌ నుంచి బయటకురానివ్వకుండా చేశారంటూ ట్విట్టర్ ద్వారా తన కోపాన్ని వెళ్లగక్కారు. అలాగే మంగళగిరిలో తన కారుని బయటకు వెళ్లనివ్వలేదని.తనను నడవనివ్వలేదన్నారు పవన్‌ కల్యాణ్.

ఏపీలో పొలిటికల్ చిటపటలు..

చివరకు అలీవ్ గ్రీన్‌ కలర్‌లో ఎన్నికల ప్రచారాన్ని రథాన్ని చేయించుకుంటే దానిపై కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం ఇప్పుడు తనను ఊపిరైనా పీల్చుకోనిస్తారా లేక అది కూడా వద్దంటారా అంటూ వైసీపీ నేతలకు పరోక్షంగా చురకలంటించారు. అలాగే తన వాహనం రంగులో ఉన్న ఓ షర్ట్‌ని షేర్ చేసి ఈ చొక్కాను అయినా వేసుకోనిస్తారా వైసీపీ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.

First published:

Tags: AP Politics, Pawan kalyan, Ycp

ఉత్తమ కథలు