హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: మళ్లీ మంగళగిరికి పవన్ కళ్యాణ్..రేపు జనసేన పీఏసీ సమావేశం..ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో?

Pawan Kalyan: మళ్లీ మంగళగిరికి పవన్ కళ్యాణ్..రేపు జనసేన పీఏసీ సమావేశం..ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో?

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జనసేన నాయకులతో రేపు జరగబోయే పీఏసీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై చర్చించనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

మూడు రాజధానుల చుట్టే ఏపీ రాజకీయాలు (Ap Politics) తిరుగుతున్నాయి. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు పాదయాత్ర చేపట్టారు. మూడు  రాజధానులకే మా మద్దతు అని వైసీపీ చెబుతుంది. ఇటీవల వైసీపీ విశాఖ గర్జన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉత్తరాంధ్ర పర్యటనతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితుల్లో జనసేన నాయకులను అరెస్ట్ చేశారు. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జనసేన నాయకులతో రేపు జరగబోయే పీఏసీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. అలాగే వైజాగ్ లో అరెస్ట్ అయిన జనసేన నాయకుల కుటుంబసభ్యులను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలిసి మాట్లాడనున్నారు.

రాజకీయ శాఖగా ఏపీ దేవాదాయ శాఖ..! అంతలా ఏం జరుగుతోదంటే..!

రేపు జనసేన పీఏసీ (రాజకీయ వ్యవహారాల కమిటీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla Manohar) అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటన సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాలు, ప్రభుత్వ వైఖరిపై చర్చించనున్నారు. అలాగే జనసేన పార్టీ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇటీవల విజయవాడలో చంద్రబాబు (chandrbabu) పవన్ (Pawan Kalyan) ను కలిసి చర్చించారు. అందులో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అంతా కలిసి పోరాటం చేయాలన్నారు. ఈ అంశాలపై కూడా పీఏసీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

అలాగే రాష్ట్రంలో పొత్తులపై కూడా ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తుంది. బీజేపీతో కలిసి ముందుకెళ్లాలా లంక టీడీపీ , బీజేపీ రెండింటితో కలిసి ముందుకెళ్లాలా అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పీఏసీ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. పొత్తుల అంశంపై పార్టీ నేతల అభిప్రాయం తీసుకుంటే మంచిదని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భావిస్తున్నారట. ఈ క్రమంలోని సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.  ఇప్పటికే మంగళగిరి చేరుకున్న పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు జనసేన పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. విశాఖ ఘటనలో పలువురు జనసేన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కుటుంబాలను కూడా పవన్ కళ్యాణ్ కలవనున్నారు. మరి పీఏసీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాలంటే రేపటి సమావేశం ముగిసే వరకు ఆగాల్సిందే.

First published:

Tags: Janasena, Pawan kalyan

ఉత్తమ కథలు