Home /News /andhra-pradesh /

AP POLITICS PAWAN KALYAN TENSION FOR BALAKRISHNA SON IN LAW SRI BHARATH MP SEAT FROM VISAKHAPATNAM AK

AP Politics: అదే జరిగితే.. బాలకృష్ణ చిన్నల్లుడిని టెన్షన్ పెడుతున్న పవన్ కళ్యాణ్ ?

పవన్ కళ్యాణ్, శ్రీభరత్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్, శ్రీభరత్ (ఫైల్ ఫోటో)

Sri Bharath: విశాఖ ఎంపీ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో టీడీపీ విజయాలు నమోదు చేసినా.. ఎంపీగా మాత్రం శ్రీభరత్‌కు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదనే టాక్ ఉంది.

    రాజకీయాల్లో రాణించే విషయంలో బాలకృష్ణ బాగానే సక్సెస్ అయ్యారు. టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న సమయంలోనూ గెలిచిన అతికొద్ది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా నిలిచి.. తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం చంద్రబాబుతో పాటు బాలకృష్ణ(Nandamuri Balakrishna) కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో బాలకృష్ణతో పాటు ఆయన ఇద్దరు అల్లుళ్లు ఎన్నికల్లో పోటీ చేశారు. పెద్దల్లుడు లోకేశ్ మంగళగిరి నుంచి, చిన్నల్లుడు శ్రీభరత్(Sri Bharath) విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. అయితే ఇద్దరూ ఓడిపోయారు. లోకేశ్ విషయంలో బాలకృష్ణకు పెద్దగా టెన్షన్ లేదు. అయితే ఎటొచ్చిన ఆయన చిన్నల్లుడు శ్రీభరత్ విషయం ఏంటనే దానిపైనే చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో విశాఖ(Visakhapatnam) ఎంపీగా పోటీ చేసిన శ్రీభరత్.. వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు.

    విశాఖ ఎంపీ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో టీడీపీ విజయాలు నమోదు చేసినా.. ఎంపీగా మాత్రం శ్రీభరత్‌కు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదనే టాక్ ఉంది. ఇందుకు జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ కూడా ఓ కారణమనే వాదన ఉంది. ఒకవేళ జేడీ లక్ష్మీనారాయణ బరిలో లేకపోయి ఉంటే.. శ్రీభరత్ కచ్చితంగా గెలిచే అవకాశం ఉండేదని చాలామంది భావిస్తుంటారు. గతం సంగతి ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో మరోసారి శ్రీభరత్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తారా లేక విశాఖ పరిధిలోని ఏదైనా స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా ? అన్నది క్లారిటీ రావడం లేదని సమాచారం.



    నిజానికి శ్రీభరత్‌కు మళ్లీ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్టు చెబుతారు. అయితే జనసేనతో పొత్తు కుదిరితే.. అది సాధ్యపడకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. విశాఖ ఎంపీ సీటుతో పాటు విశాఖ ఎంపీ సీటు పరిధిలోని పలు స్థానాలను జనసేన పొత్తుల్లో భాగంగా తీసుకునే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. శ్రీభరత్‌కు మరోసారి విశాఖ ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ వస్తుందా ? అన్నది సందేహమే.

    Target Kodali Nani: టార్గెట్ మాజీ మంత్రి కొడాలి నాని.. ఆమె అక్కడి నుంచే బరిలో దిగుతారా..?

    Pawan Kalyan:పవన్ కళ్యాణ్ పొత్తు వారితోనే.. యంగ్ హీరో కామెంట్..పోస్టు వైరల్

    అయితే మిగతా స్థానాల సంగతి ఎలా ఉన్నా.. తన చిన్నల్లుడి విషయంలో మాత్రం బాలకృష్ణ ఏదోలాగా ఇతర పార్టీలను ఒప్పించి మళ్లీ విశాఖ నుంచి ఆయన పోటీ చేసేలా చేస్తారని పలువురు చర్చించుకుంటున్నారు. ఒకవేళ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం రాకపోతే.. శ్రీభరత్‌ను విశాఖ పరిధిలోని ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపే అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్న బాలకృష్ణ చిన్నల్లుడిని పవన్ కళ్యాణ్ టెన్షన్ పెడుతున్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Nandamuri balakrishna, Sri bharath, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు