Home /News /andhra-pradesh /

AP POLITICS PAWAN KALYAN SLAMS ON ANDHRA PRADESH GOVERNMENT ON LIQUOR POLICY NGS

Pawan Kalyan: నవ రత్నాల్లో ఓ రత్నం రాలిపోయే.. 100 కోట్లు నష్టం అంటూ వైసీపీ పై ఫైర్

Pawan Kalyan Twitter

Pawan Kalyan Twitter

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. మధ్యపాన నిషేదంపై వైసీపీ నేతల వ్యాఖ్యలను కార్టూన్ లో ప్రస్తావిస్తూ.. సెటైర్లు వేశారు. వంద కోట్ల నష్టం అంటూ ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు.

    Pawan Kalyan: జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మరోసారి వైసీపీ ప్రభుత్వం (YCP Government) పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన ట్విటర్ ఖాతా (Twitter Account) లో మద్యపాన నిషేధంపై ఇటీవల వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కర్టూన్ రూపంలో ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. గతవారం మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minster Gudivada Amarnath) మద్యం నిషేధంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా రాజకీయంగా కొనసాగుతూనే ఉంది. వైసీపీ మేనిఫెస్టో (YCP Menifesto) లో మద్య నిషేధం అనే పదమే లేదని, దశలవారీగాగా మద్యం నిషేధం చేస్తామని మాత్రమే హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

    పూర్తిస్థాయిలో మద్యపాన నిషేధం అని ఎక్కడా చెప్పలేదని, మందుబాబులకు షాక్ కొట్టేలా చేస్తామని మాత్రమే చెప్పామన్నారు. మీలో ఎవరికైనా డౌట్ ఉంటే రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కార్యాలయంకు వెళ్లినా తమ మేనిఫెస్టో ఉంటుందని, చూసుకోవచ్చని అన్నారు. అమర్నాథ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ పవన్ కల్యాణ్ ట్విటర్ లో విమర్శలు చేశారు. 

    ఇప్పుడు మంత్రి అమర్ నాథ్ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా దుమారం రేపుతున్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా జనసేన నేతలు ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో జగన్ చెప్పిన ఆడియో క్లిప్ లను జత చేసి.. నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    జనసేన అధినేత పవన్ సైతం ప్రభుత్వం తీరుపై సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందు మధ్య నిషేధం పై ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ కార్టూన్ రూపంలో పవన్ విమర్శలు చేశారు. వందల కోట్లు పోయాయని మేం ఏడుస్తుంటే మధ్యలో మద్య నిషేధం.. మధ్య నిషేధం అంటూ మీ గోలేందమ్మా’ అంటూ పవన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన కార్టూన్ ను షేర్ చేశారు.

    ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ యజమానులు సిండికేట్ కావడం వల్ల ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల నష్టం అంటూ పవన్ విమర్శించారు. కేవలం జనసేన మాత్రమే కాదు.. ఏపీలో ఇతర విపక్షాలు సైతం మంత్రి అమర్ నాథ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మొన్నటి వరకు మద్య నిషేధం అని చెప్పిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు.. మాట మారుస్తోంది అంటూ మండిపడుతున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Pawan kalyan

    తదుపరి వార్తలు