జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంచలన కామెంట్స్ చేశారు. జనసేన పార్టీకి స్థలం ఇచ్చారనే ఒకే ఒక్క కారణంతో ఇప్పటంలో ఇళ్లను కూల్చేశారని పవన్ వ్యాఖ్యానించారు. ఇప్పటం ప్రజలకు తాను అండగా ఉంటానని భయపడవద్దని భరోసానిచ్చారు. ఇప్పటం ప్రజల తెగింపు అమరావతి రైతులకు ఉండి ఉంటే రాజధాని కదిలేది కాదని స్పష్టం చేశారు. ఇప్పటం గ్రామస్థులు నన్ను సొంతబిడ్డలా ఆదరించి అండగా నిలబడ్డారు. వారికి కష్టం వేస్తే నేనున్నాను అని భరోసా కల్పించడానికి వచ్చానని పవన్ అన్నారు. హైదరాబాద్ లో భీమ్ రావ్ బస్తీ కోల్చేస్తే నేను బయటకు వచ్చి వారికోసం నిలబడ్డాను, అలాంటి సంఘటన మళ్ళీ ఇప్పటంలో చూసానని పవన్ పేర్కొన్నారు.
సజ్జల, వైసీపీపై పవన్ ఫైర్..
వైసిపి పార్టీనా టేర్రరిస్టు సంస్థనా. సజ్జల, వైసిపి నేతలది ఆధిపత్యపు ఆహంకారం. రాజకీయం మీరే చేయాలా మేము చేయకూడదా. నేను అన్నింటికీ సిద్దపడే రాజకీయాల్లోకి వచ్చాను. వైసిపి గడప కూల్చేదాక వదిలిపెట్టం. ఇళ్ల కూల్చివేత కక్షతోనే చేశారు. ఈ కూల్చివేతల కుట్ర వెనక సజ్జల పాత్ర ఉంది. సజ్జల ఒక డిఫ్యాక్టో సీఎం. వైసిపి నేతలకు మంచి సంస్కారం, మర్యాద లేదు. 2024 ఎన్నికల తర్వాత మేము కూడా నిబంధనల ప్రకారమే వైసిపి నేతల ఇళ్లను కూల్చేస్తాం. వైసీపీ ఫ్యూడలిస్టిక్ గోడలు బద్దలు కొడతాం అని పవన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
మాది రౌడీ సేన కాదు..విప్లవ సేన..
మాది రౌడీ సేన కాదు..విప్లవ సేన. ఎదురుతిరిగితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. మోదీని కలిపి ఎమ్ మాట్లాడితే సజ్జలకు ఎందుకు. నేనేమి ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్పను. మోదీని ఎప్పుడు కలిసిన దేశ భవిష్యత్తు, ప్రజల రక్షణ గురించే మాట్లాడుతా. ఒకవేళ వైసిపిని దెబ్బ కొట్టాలంటే మోదికి చెప్పకుండానే చేస్తాం. నేను ఇక్కడే పుట్టిన వాన్ని. ఇక్కడే తేల్చుకుంటా. నా యుద్ధం నేనే చేస్తా అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
2024లో జనసేనకు మద్దతుగా నిలబడండి..
2024 లో జరగబోయే ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా నిలబడండి. గుడ్డిగా నన్ను నమ్మకండి. ఇప్పటివరకు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, సహనం గురించి ఆలోచించండి. రాబోయే 2024, 2029 ఎన్నికలు చాలా కీలకం. కాగా ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు రూ.లక్ష చొప్పున చెక్కులను పవన్ అందించారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Janasena, Pawan kalyan, Powe star pawan kalyan