ఏపీ సీఎం జగన్ (Cm Jagan) పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కుల పిచ్చి ఉంది. సీఎం మా వాడని ఓటు వేస్తే ఎలా అని పవన్ ప్రశ్నించారు. అంతేకాదు జగన్ టీనేజ్ లో ఉన్నప్పుడు కడపలోని పులివెందులలో ఓ ఎస్సైని జైల్లో పెట్టి కొట్టిన ఘనత ఉంది. కానీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ జగన్ చేతుల్లో ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం మానవ హక్కులకు సంబంధించిన దాంట్లో ఉంటుందన్నారు. నేను సీఎం అయితే ఏంటి కాకుంటే ఏంటి? మీరు అనుకుంటే నేను సీఎం అవుతానని పవన్ అన్నారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా జెండా ఎగురవేసిన అనంతరం పవన్ (Pawan Kalyan) ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీని మరోసారి విడగొడతామంటే ఊరుకుంటామా..
రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఏమైపోతుంది. తెలంగాణ ప్రజల్లో ఉన్న చైతన్యం ఇక్కడ ఉంటే బాగుండేది. ఏపీని మరోసారి విడగొడతామంటే తోలు తీస్తాం. మీకు మరో రాష్ట్రం కావాలా. వేర్పాటు ధోరణితో ఉంటే నా అంతటి తీవ్రవాదిని చూడరు. రాష్ట్రాలు, ప్రజలను విడగొట్టింది ఇక చాలు ఆపేయండి అంటూ పవన్ హెచ్చరించారు. రాష్ట్రాన్ని విడగొడతామంటే మేము ఊరుకుంటామా. పిచ్చి నాయకులు, ముసలి నాయకుల మాటలు పట్టించుకోకండి. కోడి కత్తులు గీసుకుంటే ఏపీ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదంటారు. 74వ గణతంత్ర దినోత్సవ సందర్బంగా చెబుతున్నా రాష్ట్రాన్ని విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. మా నేల కాదా ఇది. మా దేశం కాదా. రాయలసీమ అభివృద్ధి అని అంటారు. ఇంతకు రాయలసీమ అభివృద్ధికి మీరు ఏం చేశారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ కోసం గుంటూరులో ప్రాణ త్యాగం చేశారు. మీ సొంత లాభం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి. ప్రజలు కూడా రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి అని పవన్ సూచించారు.
పవన్ కళ్యాణ్ ఇలా వ్యాఖ్యలు చేశారో లేదో వైసీపీ నాయకులూ కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై సజ్జల మండిపడ్డారు. నాపై కావాలనే విష ప్రచారం చేస్తున్నారు. నిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయి అని అంటున్నారు. మీ దగ్గర ఆధారాలున్నాయా అని సజ్జల పవన్ ను ప్రశ్నించారు. పవన్ రిమోట్ చంద్రబాబు చేతిలో ఉంది. ఆయన ఇచ్చిన స్క్రిప్టే పవన్ చదివారని ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, Ap cm jagan, AP News, Janasena, Pawan kalyan, Ycp