హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బిరుదు..వైరల్ గా మారిన ఆ కార్టూన్!

Pawan Kalyan: సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బిరుదు..వైరల్ గా మారిన ఆ కార్టూన్!

జగన్, పవన్ (ఫైల్ ఫోటో)

జగన్, పవన్ (ఫైల్ ఫోటో)

జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై చేసిన ఓ సెటైరిక్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తొమ్మిది మాసాల్లో రాష్ట్రం చేసిన అప్పులు లెక్క ఇది అంటూ పవన్ ఓ కార్టూన్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. ఈ కార్టూన్ లో సీఎం జగన్ కు అప్పు రత్న అనే అవార్డు వచ్చినట్లు..దీనితో ఆయనకు ఓ మెమొంటోను అధికారులు అందజేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై చేసిన ఓ సెటైరిక్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తొమ్మిది మాసాల్లో రాష్ట్రం చేసిన అప్పులు లెక్క ఇది అంటూ పవన్ ఓ కార్టూన్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. ఈ కార్టూన్ లో సీఎం జగన్ కు అప్పు రత్న అనే అవార్డు వచ్చినట్లు..దీనితో ఆయనకు ఓ మెమొంటోను అధికారులు అందజేస్తున్నారు. ఇక ఆ పక్కనే ఉన్న మరో అధికారి అది భారతరత్న లాంటి గొప్ప అవార్డు అని చెప్పడంతో ఇది కాస్త మరింత సెటైరిక్ గా మారింది. ఇక వైసీపీ సర్కార్ రికార్డ్..9 నెలల్లో రూ.55,555 కోట్ల అప్పులు అంటూ కార్టూన్ ద్వారా ఏపీ అప్పులను ప్రజలకు తెలియజేశారు పవన్ కళ్యాణ్.

అప్పులతో ఏపీ పేరును మారుస్తున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఇక మీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. రాష్ట్ర, ప్రజల ఆస్తులను కుక్కలకు వదిలేయాలి. కానీ వ్యక్తిగత ఆస్తులను భద్రంగా చూసుకుంటారని అన్నారు. అదే సీఎం స్పిరిట్ అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కాగా ఈ విధంగా పవన్ ఏపీ సర్కార్ పై విమర్శలు చేయడం కొత్తేమి కాదు. కొన్నిరోజుల క్రితం కూడా వ్యంగ్యంతో కూడిన కార్టూన్ ను పవన్ తన సొంత సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు.

ఇందులో ఎన్నికలు వస్తున్నాయి. మంత్రులు అందరూ కూడా అవినీతికి దూరంగా ఉండాలని జగన్ చెప్పినట్లు ఉంది. సీఎం గారు అవినీతి విరామ పథకం ప్రకటించారయ్య. లేకపోతే నీ కాంట్రాక్టు పని అయిపోయేదని చెబుతూ ఉండడం అప్పట్లో ఎంతగానో వైరల్ అయింది. ఇక దీనికి పవన్ తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చారు.

'వైసిపి వారు తాము చేస్తున్న అవినీతికి కరప్షన్ హాలిడే ప్రకటించడం ఎంతైనా ప్రశంసనీయం' అంటూ పవన్ ట్వీట్ చేశారు. 

First published:

Tags: Ap, Ap cm jagan, AP News, Pawan kalyan

ఉత్తమ కథలు