AP POLITICS PAWAN KALYAN IS IN CONFUSE ON ALLIANCE WITH TDP WHY HE IS IN PRESSURE NGS
Pawan: పొత్తుల విషయంలో పవన్ ఒత్తిడిలో ఉన్నారా.. ఆ లైన్ దాటలేకపోతున్నారా?
పవన్ కళ్యాణ్
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒత్తిడిలో ఉన్నారా.? వచ్చే ఎన్నికల్లో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారా..? టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా..? బీజేపీతో కలిసి వెళ్లాలా..? రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా..?
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికారం సాధించడం.. వైసీపీ (YCP)ని ఎలాగైనా గద్దె దించడమే లక్ష్యంగా జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అడుగులు వేస్తున్నారు. ఇక్కడే పవన్ కు ఓ చిక్కు పడి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. పవన్ ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోందని జనసైనికులు చెవులు కొరుక్కుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ (BJP) లైన్ ను పవన్ దాటాలా వద్దా అనే విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారని టాక్ ఉంది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించాలని గట్టి సంకల్పంతో ఉన్నారు పవన్. అది జరగాలి అంటే టీడీపీతో కలిసి వెళ్తేన సాధ్యమవుతుందన్నది పవన్ నమ్మకం.. మొదటి నుంచి ఆయన అదే మాట చెబుతూ వచ్చారు. వైసీపీని ఓడించాలి అంటే పొత్తులు అవసరం తప్పదని చెబుతూ వచ్చారు. అవసరమైతే బీజేపీని ఒప్పిస్తానని కూడా చెప్పారు.. బీజేపీ పెద్దలు రూట్ మ్యాప్ ఇచ్చాక దానిపై నిర్ణయం తీసుకుంటాను అన్నారు. ఇప్పుడు పొత్తుల విషయంలో ఎటూ తేల్చుకోలోని అయోమయంలో ఉన్నారని సమాచారం. ఆయన ప్రకటనలు చూస్తే కచ్చితంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది.
పవన్ ఒత్తిడికి బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వమే కారణమని తెలుస్తోంది. బీజేపీకి ప్రస్తుతం వైసీపీ నుంచి పూర్తి సహకారం వస్తోంది. తాజాగా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైసీపీ బహిరంగంగానే మద్దతు తెలిపింది. కేవలం ఈ విషయంలో మాత్రమే కాదు.. పలుమార్లు వైసీపీ బీజేపీ బహిరంగంగానే మద్దతు తెలుపుతూ వస్తోంది. ఇక అంతర్గత ఒప్పందాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ పెద్దలు మాత్రం తమకు వైసీపీ అధినేత జగన్ నమ్మదగ్గ మిత్రుడన్ని అభిప్రాయపడుతున్నారు. కానీ పవన్ మాత్రం వైసీపీని టార్గెట్ చేసుకునే ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో పవన్ పై బీజేపీ నుంచి ఒత్తిడి ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే బీజేపీ పెద్దలు పవన్ కు రూట్ మ్యాప్ ఇచచినట్టు ప్రచారం ఉంది. అది ఏంటంటే..? 2024 ఎన్నికల గురించి ఆలోచించవద్దని.. జగన్ తమకు సన్నిహితంగానే ఉన్నారంటూ.. రూట్ మ్యాప్ లో చెప్పినట్టు సమాచారం. ఒకవేళ 2024 ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా..? 2029 ఎన్నికలే తమ టార్గెట్ చేద్దామని బీజేపీ పెద్దలు పవన్ కు తెలిపినట్టు సమాచారం. అప్పటి వరకు పార్టీ బాధ్యతలు తాము చూసుకుంటామని.. అవసరమైతే ఆర్థికంగా అండగా ఉంటమని స్పష్టమైన హామీ ఇచ్చినట్టు సమాచారం. అలాగే టీడీపీ కలిసి వెళ్లొద్దని స్పష్టంగా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
దీంతో పవన్ ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లలేక సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతానికి రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీకి స్థిరమైన ఓటుబ్యాంకు లేదు. కానీ జనసేనకు ఉంది. కార్యకర్తల బలం ఉంది.. సామాజికవర్గం అండ ఉంది.. కష్టపడి పనిచేస్తే రాష్ట్రంలో ప్రబలమైన శక్తిగా రూపాంతరం చెందే అవకాశం కనపడుతోంది. వైసీపీకి మరో అవకాశం ఇస్తే.. జనసేన పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఇప్పటికే వైసీపీ నేతలు.. వ్యక్తిగతంగా పవన్ ను టార్గెట్ చేస్తున్నారు.. కార్యకర్తలను నేతలను బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఎలాగైనా వైసీపీని ఓడించాలనే లక్ష్యంతోనే ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో వెళ్లొద్దని అన్ని విధాలా అండగా నిలుస్తామని స్పష్టమైన హామీ ఇస్తోంది. దీంతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నది పవన్ నతేల్చుకోలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.