Home /News /andhra-pradesh /

AP POLITICS PAWAN KALYAN GAVE BRAEK TO MOVIE FROM OCTOBER HE WANT TO FULL FOCUS ON POLITICS NGS

Pawan Kalyan: సినిమాలకు పవన్ గుడ్ బై.. జనసేనాని వ్యూహం అదేనా..?

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

Pawan Kalyan: మెగా అభిమానులకు షాకింగ్ న్యూస్.. పవన్ ఇక సినిమాలకు గుడ్ పై చెప్పనున్నారా..? పూర్తిగా కాకున్నా సుదీర్ఘ విరామం ఇవ్వాలని నిర్ణయించారా..? ఇకపై పూర్తి టైం పాలిటిక్స్ పై ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే దసరా నుంచి పర్యటనలకు సిద్ధమయ్యారని ప్రచారం ఉంది.

ఇంకా చదవండి ...
    Pawan Kalyan: మెగా అభిమానులకు ఇది షాకింగ్ న్యూసే (Shcoking News for Mega Fans).. వకీల్ సాబ్ (Vakeelsaab), భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాలతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) సినిమాలకు గుడ్ పై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారా..? పూర్తి కాకున్నా.. లాంగ్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారా.. దర్శక నిర్మాతలకు ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే..? పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతానికి వరుస సినిమాలను లైన్ లో పెట్టారు కానీ ఆ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయి అనే విషయం మీద ఎవరు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అయితే ఆ సినిమాలన్నీ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. వచ్చే దసరా లోపు తన పార్టు వరకు షూటింగ్ పూర్తి చేయాలని..పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమైనా పరవాలేదని నిర్మాత, దర్శకులకు చెప్పినట్టు టాక్.. ఎందుకంటే ఇకపై ఆయన పూర్తి సమయం రాజకీయాలకే వెచ్చించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అటు వెళితే మళ్లీ సినిమాలు చేయడం అంత సులువు కాదు.. ఈ దసరా నుంచి మళ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు షూటింగ్ లకు బైబై చెబుతారనే ప్రచారం జరుగుతోంది.

    పవన్ కళ్యాణ్ స్టార్డం కారణంగా కలెక్షన్లు మాత్రం భారీ బడ్జెట్ సినిమాకు వచ్చినట్టు వస్తున్నాయని అంచనాలున్నాయి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత అతి తక్కువ కాలంలో సముద్రఖని దర్శకత్వంలో ఒక తమిళ సినిమా రీమేక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అది పూర్తయిన వెంటనే భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభించి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ మూడు సినిమాలను త్వరగా పూర్తి చేయాలని తొందర పెడుతున్నారని టాక్.



    ముఖ్యంగా భవదీయుడు భగత్ సింగ్ తర్వాత పూర్తిగా ఆయన బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎన్నికల మీద ఫోకస్ పెట్టడం కోసం బ్రేక్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని పవన్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

    ఇదీ చదవండి : సాగర తీరంలో సాగర కన్యలు...సెల్పీలతో టూరిస్టుల సందడి.. ప్రత్యేకత ఏంటంటే?

    ఇందులో భాగంగా ప్రధాన పార్టీలకు పోటీగా ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ పర్యటనలు చేపట్టనున్నారు. తమకు సెంటిమెంట్ గా భావించే తిరుపతి నుంచి పవన్ టూర్ ప్రారంభం కానుంది. విజయదశమి రోజు పవన్ పర్యటకు ముహూర్తం ఖరారు చేశారు. దసరా రోజు జనసేనాని పర్యటన మొదలు పెట్టనున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉండడంతో.. అక్కడ నుంచి పర్యటన మొదలపెడతారని జనసైనికులు అంటున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan

    తదుపరి వార్తలు