హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan : పవర్ స్టార్ బర్త్‌ డే జోష్‌లో ఫ్యాన్స్ .. ఎవడ్రా మనల్ని ఆపేదంటూ పవన్‌ కల్యాణ్ పేరుతో సాంగ్ రిలీజ్

Pawan Kalyan : పవర్ స్టార్ బర్త్‌ డే జోష్‌లో ఫ్యాన్స్ .. ఎవడ్రా మనల్ని ఆపేదంటూ పవన్‌ కల్యాణ్ పేరుతో సాంగ్ రిలీజ్

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

Pawan birthday song: పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. శుక్రవారం జనసేనాని బర్త్ డే కావడంతో ముందురోజే ఎవడ్రా మనల్ని ఆపేది అంటూ ఓ సాంగ్‌ని విడుదల చేశారు. ఇప్పుడు ఆ పాటే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా, రాజకీయాల్లో జనసేనానిగా అశేష ప్రజాభిమానాన్ని చురగొన్న వ్యక్తి పవన్ కల్యాణ్(Pawan Kalyan). ఇండస్ట్రీలో ఆయన నటించిన సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినా, రాజకీయాల్లో రెండు చోట్ల ఓడిపోయినా జనంలో ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటున్నారు పవర్‌స్టార్ ఫ్యాన్స్. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌పై సోషల్ మీడియా(Social media)లో ఆయనపై చూపించే అభిమానం, కురిపించే ప్రేమానురాగాలు చూస్తుంటే రియల్లీ పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌లో ఏదో పవర్ ఉంది ..ఏదో ఒక రోజు పొలిటికల్ పవర్‌ దక్కుతుంది అనే సంకేతాలు వస్తున్నాయి. సెప్టెంబర్(September)2వ తేది అంటే శుక్రవారం(Friday)పవన్ కల్యాణ్ పుట్టిన రోజు(Birthday)సందర్భంగా అభిమానులు రూపొందించిన ఓ పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్(Viral) అవుతోంది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల(Plastic Flexi)ను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకోవడం వెనుక పవన్‌ కల్యాణ్‌ని ఉద్దేశించే అని అభిమానులు, జనసైనికులు ఫీలవుతున్నారు. అందుకు ధీటుగానే ఈ పాటను సృష్టించారా అన్నట్లుగా ఉంది.

వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్.. ఆ సత్తా ఆయనకే సొంతం! సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్పవర్‌ఫుల్ గిఫ్ట్ ..

సినిమాల్లో , రాజకీయల్లో తన కంటే ముందుగానే పరిచయమై, పదవులు చేపట్టిన మెగా బ్రదర్ చిరంజీవి సోదరుడిగానే కాకుండా తనకంటు స్పెషల్ ఇమేజ్‌ని, సొంత బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ . చిరంజీవితో సరి సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్, పేరును సంపాధించుకున్న హీరో పుట్టిన శుక్రవారం కావడంతో అభిమానులు ముందుగానే సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు తగినట్లుగా పవన్ కల్యాణ్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరు అభిమానులు 24గంటలకు ముందే ఆయన లక్షణాన్ని, ఓ వేదికపై చెప్పిన మాటను ఆడియో ట్రాక్‌గా తీసుకొని పాటను రూపొందించారు. "మనల్ని ఎవడ్రా ఆపేది" అనే పేరుతో గురువారం బర్త్‌ డే స్పెషల్ సాంగ్‌ని యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.

బర్త్ డేకి ముందే సెలబ్రేషన్స్..

సినిమాలు, రాజకీయం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్న పవన్‌ కల్యాణ్‌కి ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం నుంచి కొంత ఎదురుగాలి వీస్తోంది. వకీల్‌సాబ్ సినిమా రిలీజ్ నుంచి భీమ్లానాయక్ టికెట్ ధరల వరకు ఏదో విధంగా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నా వాటిని లెక్క చేయకుండా ముందుకువెళ్తున్నారు పవన్ కల్యాణ్. ఈక్రమంలోనే ఏపీలో పవన్ కల్యాణ్ చేపట్టిన ఓ రోడ్‌షోలో నా సినిమాల్ని ఆపుతారా ఎవడ్రా మనల్ని ఆపేది అని కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ లైన్‌తోనే పవన్ కల్యాణ్ పాదయాత్ర, రోడ్‌ షో, పబ్లిక్ మీటింగ్‌లకు సంబంధించిన క్రౌడ్ విజువల్స్‌ మిక్స్ చేసి ఈ సాంగ్‌ను రూపొందించారు.

ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్ ..

పవన్ కల్యాణ్‌ బర్త్‌ డే ముందే ఈ సాంగ్ రిలీజవడంతో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. స్టార్ హీరో ఇమేజ్‌కి తగ్గట్లుగానే లైక్‌లు కొడుతూ షేర్ చేస్తున్నారు అభిమానులు. గురువారమే ఫ్యాన్స్ హంగామా ఈ రేంజ్‌లో ఉంటే బర్త్‌ డే రోజు ఏ రేంజ్‌లో ఉంటుందో ఫ్యాన్స్ సంతోషం, సంబరాలు, వేడుకలు అని నెటిజన్లు కామెంట్స్ షేర్ చేస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan, Tollywood actor

ఉత్తమ కథలు