హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: పవన్ ఇమేజ్ ను జగన్ పెంచుతున్నారా..? చంద్రబాబును పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?

AP Politics: పవన్ ఇమేజ్ ను జగన్ పెంచుతున్నారా..? చంద్రబాబును పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?

 చంద్రబాబు, జగన్, పవన్.. (ఫైల్)

చంద్రబాబు, జగన్, పవన్.. (ఫైల్)

AP Politics: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పవన్ ఇమేజ్ ను జగనే పెంచుతున్నారా..? వైసీపీ నేతల తీరుతో జనసేన గ్రాఫ్ పెరుగుతోందా..? వైసీపీ నేతలే పవన్ కు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారా..? మరి చంద్రబాబుని పక్కనపెట్టి పవన్ పై ఎందుకంత ఫోకస్..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు  ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సాధారణంగా ఎక్కడైనా రాజకీయాల్లో ఒక పార్టీ.. ప్రత్యర్థి పార్టీ క్రేజ్ ను తగ్గించే ప్రయత్నం చేస్తుంది.. ఆ పార్టీకి ఉన్న ఉనికిని దూరం చేసే వ్యూహాలు రచిస్తుంది.. గతంలో కేవలం గెలుపు పైనే ఎక్కువగా పార్టీలు ఫోకస్ చేసేవి. ఇప్పుడు పార్టీలు స్ట్రాటజీలు మార్చాయి. పక్క పార్టీలను తొక్కేసి.. తాము పైకి వచ్చే వ్యూహాలను రచిస్తున్నాయి. గత మూడు నాలుగు ఎన్నికల నుంచి అన్ని పార్టీల సిద్ధంతం ఇదే. పక్క పార్టీని తొక్కేయాలని వేసిన స్కెచ్ లు కొన్నిసార్లు బూమరాంగ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.  ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోందా అనే ప్రచారం ఉంది.. అసలు మ్యాటర్ ఏంటి అంటే..?

గత ఎన్నికలతో పోల్చుకుంటే రాజకీయ పరంగా జనసేన (Janasena) అధినేత పవన్  కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ పెరిగింది అన్నది రాజకీయ విశ్లేషకుల లెక్క.. అయితే ఆయన క్రేజ్ పెరిగింది అనడం కన్నా.. ఆయన ఇమేజ్ ను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి పెంచుతున్నారా అనే ప్రచారం కూడా ఉంది. తాజా పరిణామాలే అందుకు కారణం అంటున్నారు.

తాజాగా విశాఖపట్నంలో జరిగిన పరిణామాలు సాధారణంగానే పవన్ ఇమేజ్ ను కొంచెం పెంచాయి. పవన్ పర్యటనను అడ్డుకోవడం..  ఆయన ర్యాలీ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవం.. జనసేన నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టడం.. పవన్ ను హోటల్ నుంచి బయటకు రానీవకుండా చేయడంతో.. ఆయనసై సింపతీ పెరిగింది ఇదంతా వైసీపీ చేస్తున్న రాజకీయమనే చర్చ జనాల్లోకి బాగా వెళ్లింది అనే ప్రచారం ఉంది.

ఇదీ చదవండి : మట్టి పాత్రలో ఇడ్లీలు ఎపుడైనా తిన్నారా.. ఇవి తింటే డాక్టర్ అవసరమే లేదంటారు..?

ఆ తరువాత జరిగిన పరిణామాల్లో స్వయంగా చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ కలవడం.. ఇద్దరూ బీజేపీపై పవన్ అసహనం వ్యక్తం చేయడంలాంటి అంశాలు.. పవన్ కు పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. తాజాగా ఇప్పటం ఇష్యూతో మరింత హైలైట్ అయ్యారని రాజకీయ వర్గాల సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ మంత్రులు కానీ, నేతలు కానీ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం స్వయంగా పవన్ కళ్యాణ్ నే టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండడంతో ఇప్పుడు అందరి ఫోకస్ పవన్ పైనే పడుతోంది.

ఇదీ చదవండి: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ఆలయం మూసివేత.. ఎప్పటి వరకు అంటే..?

ఇప్పటంలో ఇళ్ల  కూల్చివేత్తలపై పవన్ సీరియస్ అయ్యారు. ఆయన ఎఫెక్ట్ తో మంగళగిరిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూడా తొలిగించాల్సి వచ్చింది. ఇళ్ల కూల్చివేత్తపై పవన్ ఆధారలతో సహా అక్కడ పర్యటించి.. బాధితులతో మాట్లాడారు. కానీ వైసీపీ మంత్రులు మాత్రం పదే పదే పవన్ టార్గెట్ చేస్తూ.. అసలు ఇళ్లు కూల్చివేతలు జరగలేదని చెప్పడం.. పవన్ కు మైలేజ్ గా మారింది.  గతంలో వైసీపీ నేతలు కేవలం చంద్రబాబు నాయుడ్నే ఇంతాలా టార్గెట్ చేసి.. విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు కన్నా.. పవన్ ఎక్కువగా టార్గెట్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి పేరుతో జాతీయ బ్యాంకుల్లో ఉన్న నగదు ఎంతంటే..? శ్వేత పత్రం విడుదల

అయితే అందుకు కారణం లేకపోలేదు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ విడివిడిగా పోటీ చేస్తే.. తమకు తిరుగు ఉండదు అన్నది వైసీపీ లెక్క అనే ప్రచారం ఉంది. ఇప్పుడు రెండు పార్టీలు కలిస్తే.. సుమారు 35కు పైగా సీట్లపై ఎంతో కొంత ప్రభావం ఉంటుందనే.. నివేదికలు జగన్ కు అందినట్టు టాక్.. అందుకే ఈ రెండు పార్టీలు కలవనీయకుండా చేయాలంటే.. పవన్ ను రెచ్చగొట్టడమే వైసీపీ స్ట్రాటజీ అంటున్నారు. చంద్రబాబు నాయుడ్ని ఎంత రెచ్చగొట్టినా  ఆయన పొత్తుల విషయంలో వెనక్కు తగ్గకపోవచ్చు.. అదే పవన్ రెచ్చగొడితే...? ఆవేశంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు అన్నది వైసీపీ స్ట్రాటజీ అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Chandrababu Naidu, Janasena, Pawan kalyan

ఉత్తమ కథలు