హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TDP: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో టీడీపీ నేతల్లో మొదలైన టెన్షన్.. అదే జరిగితే..

TDP: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో టీడీపీ నేతల్లో మొదలైన టెన్షన్.. అదే జరిగితే..

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

AP Politics: జనసేనతో పొత్తు కావాలని కోరుకుంటున్న మెజార్టీ టీడీపీ నేతలు.. ఆ పార్టీకి కేటాయించే సీట్ల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని చర్చించుకుంటున్నారు.

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో వేడి పెరిగింది. అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని.. పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) తన వ్యాఖ్యల దగ్గర చెప్పకనే చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానంటూ.. పరోక్షంగా టీడీపీతో పొత్తు ఉంటుందనే సంకేతాలను పవన్ కళ్యాణ్ ఇచ్చారు. జనసేనతో పొత్తు పెట్టుకుని మళ్లీ అధికారం సొంతం చేసుకోవాలని భావిస్తున్న టీడీపీకి (Tdp) ఇది ఒకరకంగా సంతోషం కలిగించే వార్తే అయినా.. ఆ పార్టీకి చెందిన నేతల్లో మాత్రం పవన్ కళ్యాణ్ కామెంట్స్ పెడుతున్నాయనే చర్చ జరుగుతోంది. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారబోతున్నాయనే విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది.

  అయితే ఈసారి పరిణామాలు టీడీపీకి అంత అనుకూలంగా ఉండకపోవచ్చనే చర్చ మొదలైంది. ఒకవేళ ఈసారి టీడీపీ, బీజేపీ, (Bjp) జనసేన మధ్య పొత్తు ఉంటే.. అది గతంలో మాదిరిగా ఉండదని పలువురు చర్చించుకుంటున్నారు. మూడు పార్టీలు కచ్చితంగా సమానస్థాయిలో సీట్ల పంపకం గురించి పట్టుబడతాయని.. ఏపీలో కచ్చితంగా అధికారం కావాలని ఎదురుచూస్తున్న టీడీపీ.. ఈ విషయంలో ఎంతో కొంత వెనక్కి తగ్గక పరిస్థితి రావొచ్చనే వాదన వినిపిస్తోంది. అదే జరిగితే.. జనసేన, బీజేపీతో పోల్చితే బలంగా ఉన్న టీడీపీకి చెందిన అనేకమంది నేతలు తమ స్థానాలు పొత్తుల్లో భాగంగా ఆ రెండు పార్టీలకు వదులుకోవాల్సి వస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

  అయితే ఎన్నికల్లో పొత్తుల నాటి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే ఊహించడం కష్టం. కానీ ఈసారి మాత్రం పొత్తులు గనక కుదిరితే.. టీడీపీ ఊహించని దానికంటే ఎక్కువ సీట్లు మిత్రపక్షాలకు ఇవ్వకతప్పని పరిస్థితి ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. అనేక స్థానాల్లో బలంగా ఉన్న టీడీపీ నేతలు తమ సీట్లపై ఆశలు వదలుకోక తప్పని పరిస్థితి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

  AP Politics: బీజేపీ, జనసేన కూటమిలోకి టీడీపీ.. నిర్ణయం తీసుకునేది పవన్ కళ్యాణా లేక బీజేపీనా ?

  Pawan Kalyan: టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ మాటకు అర్థం అదేనా ?

  జనసేనతో పొత్తు కావాలని కోరుకుంటున్న మెజార్టీ టీడీపీ నేతలు.. ఆ పార్టీకి కేటాయించే సీట్ల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని చర్చించుకుంటున్నారు. బలం లేని జనసేన, బీజేపీకి ఎక్కువ సీట్లు కేటాయిస్తే.. అది మళ్లీ మొదటికే మోసం వచ్చేలా చేస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. టీడీపీ నేతల్లో కొత్త కలవరానికి కారణమవుతున్నాయనే చర్చ జోరందుకుంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Pawan kalyan, TDP

  ఉత్తమ కథలు