హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: బీజేపీ, జనసేన కూటమిలోకి టీడీపీ.. నిర్ణయం తీసుకునేది పవన్ కళ్యాణా లేక బీజేపీనా ?

AP Politics: బీజేపీ, జనసేన కూటమిలోకి టీడీపీ.. నిర్ణయం తీసుకునేది పవన్ కళ్యాణా లేక బీజేపీనా ?

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

Andhra Pradesh: వైసీపీపై పారాటం చేసే విషయంలో బీజేపీ నాయకత్వం తనకు రోడ్ మ్యాప్ ఇస్తుందని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఆ రోడ్ మ్యాప్‌లోనే పొత్తుల విషయంలో క్లారిటీ ఉంటుందా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

  జనసేన ఆవిర్భావ సభలో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేస్తారని రాజకీయవర్గాలు భావించాయి. అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ పొత్తుపై కామెంట్ చేశారు. వైసీపీపై పోరాటానికి బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పిందని.. దాని కోసమే ఎదురుచూస్తున్నానని చెప్పారు. పొత్తులపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలిపోకుండా చూస్తానని చెప్పారు. సభలో అధికార వైసీపీపై(Ysrcp) అనేక విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై కూడా పలు హామీలు ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు జనసేన, టీడీపీ(Tdp) మధ్య పొత్తు ఉంటుందా ? లేదా ? అన్న దానిపైనే అందరిలోనూ చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొంత స్పష్టత ఇస్తున్నట్టు ఉండగా.. కొంతవరకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా కూడా ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.

  వైసీపీపై పారాటం చేసే విషయంలో బీజేపీ నాయకత్వం తనకు రోడ్ మ్యాప్ ఇస్తుందని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఆ రోడ్ మ్యాప్‌లోనే పొత్తుల విషయంలో క్లారిటీ ఉంటుందా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ ఈ విషయంలో బీజేపీదే తుది నిర్ణయమైతే.. వైసీపీపై రాజకీయ పోరాటం చేసే విషయంలో జనసేనతో పాటు టీడీపీ కూడా బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ ఆధారంగానే ముందుకు సాగాల్సి ఉంటుంది.

  ఈ విషయంలో బీజేపీదే తుది నిర్ణయమైతే.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ ముందుగానే ప్రకటిస్తారా ? అన్నది కూడా చర్చనీయాంశమే. ఎందుకంటే.. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటులో సింహభాగం టీడీపీదే. దీన్ని అందరూ అంగీకరించాల్సిందే. మరి అలాంటి ఓటు బ్యాంకును దూరం చేసుకోబోమని పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

  Pawan Manifesto: జనసేన ఎన్నికల మేనిఫెస్టో ఇదే..! వారి ఖాతాల్లో రూ.10 లక్షలు.. పవన్ షణ్ముఖ వ్యూహం..

  Pawan Speech: 2024లో అదే మన టార్గెట్..! వైసీపీది వింత ప్రతిజ్ఞ.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

  అయితే ఇక్కడ చాలామందికి అర్థంకాని విషయం ఏమిటంటే.. బీజేపీ, జనసేన కూటమిలో టీడీపీ చేరే విషయంలో తుది నిర్ణయం తీసుకోబోయేది బీజేపీనా లేక జనసేననా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బీజేపీని సంప్రదించకుండానే పవన్ కళ్యాణ్ కీలకమైన ఈ సభలో ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారా ? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ఇతర వ్యాఖ్యల కంటే.. పొత్తులకు సంబంధించిన వ్యాఖ్యలే హాట్ టాపిక్‌గా మారాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Janasena, Pawan kalyan

  ఉత్తమ కథలు