హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan-Bjp: పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్, బీజేపీది ఒకటే మాట.. కాకపోతే..

Pawan Kalyan-Bjp: పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్, బీజేపీది ఒకటే మాట.. కాకపోతే..

పవన్ కళ్యాణ్, నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్, నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

AP Politics: ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో టీడీపీతో పొత్తు గురించి పవన్ కళ్యాణ్ బహిరంగంగానే మాట్లాడారు. పరోక్షంగా ఆ పార్టీతో పొత్తుకు అవకాశాలు బలంగా ఉన్నాయనే సంకేతాలను జనసేన కార్యకర్తలకు ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ, జనసేన కలిసే ఉంటాయా ? లేక విడిపోతాయా ? అన్నది ఎవరికి అంతుచిక్కని విషయంగా మారింది. నేడు కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఇప్పటికీ తాము బీజేపీతో కలిసి ఉన్నామని చెప్పారు. మరోవైపు తాము జనసేనతో(Janasena) కలిసే ఉన్నామని.. ఈ విషయంలో ఊహాగానాలు పట్టించుకోవద్దని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు(GVL Narasimha Rao) అన్నారు. బీజేపీ, జనసేన రెండు ఇంకా కలిసే ఉన్నాయని అటు పవన్ కళ్యాణ్.. ఇటు ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నా.. ఆ ఇద్దరూ కలిసి ముందుకు సాగుతున్నట్టు మాత్రం ఎవరికీ అనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ముందుకు సాగేందుకు మొగ్గు చూపుతుంటే.. టీడీపీతో పొత్తుకు తాము సిద్ధంగా లేమని బీజేపీ పదే పదే తెగేసి చెబుతోంది.

దీంతో ఎన్నికల నాటికి పరిస్థితి ఏ విధంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు ఎవరి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్నది మాత్రం ఎవరికీ అర్థంకావడం లేదు. పవన్ కళ్యాణ్ స్పష్టంగా రాజకీయ అడుగులు, వ్యూహాలు మార్చుకుంటున్నారు. టీడీపీకి దగ్గరవుతున్నారు. ఈ విషయం రాజకీయ అవగాహన ఉన్న వాళ్లందరికీ అర్థమవుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయాన్ని దాచుకోవడం లేదు.

ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో టీడీపీతో పొత్తు గురించి బహిరంగంగానే మాట్లాడారు. పరోక్షంగా ఆ పార్టీతో పొత్తుకు అవకాశాలు బలంగా ఉన్నాయనే సంకేతాలను జనసేన కార్యకర్తలకు ఇచ్చారు. కానీ ఈ విషయంలో బీజేపీ వైఖరి మాత్రం భిన్నంగా ఉంది. పవన్ కళ్యాణ్ అంత వేగంగా తన రాజకీయ వ్యూహాలను మార్చుకుంటుంటే.. బీజేపీ మాత్రం ఇందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ ఇంకా తమతోనే ఉన్నారని చెప్పుకుంటోంది.

సీఎం జగన్‌కు బైరెడ్డి ఛాలెంజ్..! వైసీపీ రియాక్షన్ ఏంటో..!

Ap: కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మార్పుపై పవన్ రియాక్షన్ ఇదే..

ఆ పార్టీ ఈ విధంగా వ్యవహరించడం వెనుక ఏదైనా ప్రత్యేకమైన వ్యూహం ఉందా ? లేక పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు విషయంలో మనసు మార్చుకుంటారని ఆ పార్టీ భావిస్తోందా ? అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. మరోవైపు మరో దారి లేకపోవడం వల్లే బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి పొత్తుల విషయంలో జనసేన, బీజేపీ ఆడుతున్న దాగుడుమూతలు ఆట ఎప్పుడు ముగుస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: Andhra Pradesh, Bjp, Pawan kalyan

ఉత్తమ కథలు