ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేనాని విమర్శల దాడి ఆగడం లేదు. నిత్యం సోషల్ మీడియా వేదిక అనేక రకాల ట్వీట్లు పెడుతూ... జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు పవన్ కల్యాణ్. తాజాగా రాయలసీమ వెనుకుబాటుకు కారణాలు చూపుతూ 1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన ‘కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం’ అన్న పుస్తకం గురించి పవన్ ప్రస్తావించారు. ‘ఈ పుస్తకంలో, అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి.రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది.’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. అంతే కాదు... ఈ పుస్తకంలో 75వ పేజీలో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంటుందని పవన్ మరో ట్వీట్ చేశారు.
సీఎం జగన్ పాలన, నిర్ణయాల్ని ఎండగడుతూ.. పవన్ రోజుకో ట్వీట్ దాడి చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదిక ఆయన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా జగన్ ఆరు నెలల పాలనపై కూడా పవన్ సంచలన ట్వీట్ చేశారు. గడిచిన ఆరునెలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు పవన్ కల్యాణ్. కేవలం విధ్వంసం, దుందుడుకుతనం, కక్షసాధింపుతనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నం మాత్రమే అంటూ ట్వీట్ చేశారు. అనంతరం ఆ ఆరు పదాలకు ఒక్కో ట్వీట్ చేస్తూ వివరణ కూడా ఇచ్చారు.
1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన ఈ పుస్తకంలో,అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి.రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది. pic.twitter.com/2pNalKgUvt
— Pawan Kalyan (@PawanKalyan) November 25, 2019
అలాగే ఈ పుస్తకంలో 75వ పేజీలో
శ్రీ జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంటుంది.
— Pawan Kalyan (@PawanKalyan) November 25, 2019
know sainiks what u r waiting for, 74th and 75th pages from this book. pic.twitter.com/saXSK9BSlX
— 🇮🇳 (@IamJanaSainik) November 25, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Janasena, Janasena party, Pawan kalyan, Ysrcp