హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Paruchuri Gopalakrishna : పవన్ కల్యాణ్‌ అన్నగారితో సమానం .. పవర్‌ స్టార్‌ని ఆ పదవిలో చూడాలని ఉంది : పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopalakrishna : పవన్ కల్యాణ్‌ అన్నగారితో సమానం .. పవర్‌ స్టార్‌ని ఆ పదవిలో చూడాలని ఉంది : పరుచూరి గోపాలకృష్ణ

NTR, PAWAN PARUCHURI

NTR, PAWAN PARUCHURI

Paruchuri Gopalakrishna: హీరో, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి స్టార్ రైటర్, నటుడు పరుచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్‌ స్టార్‌ ఆలోచన, ఆశయం అచ్చం అన్నగారిలాగానే ఉన్నాయని చేసిన కామెంట్స్ పొలిటికల్‌ సర్కిల్‌, ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

స్టార్ రైటర్, నటుడు పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopalakrishn)సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan)ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్‌గా, ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ని చూస్తుంటే తనకు గతంలో సీనియర్ ఎన్టీఆర్‌ (NTR)రాజకీయాల్లోకి అడుపెట్టిన రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. అంతే కాదు రాజకీయాల్లో ఎవరు కలిసివచ్చినా రాకపోయినా ... ముందుకు పోయేవాడే వీరుడు పవన్‌ కల్యాణ్‌లో ఆ లక్షణాలు తనకు మెండుగా కనిపిస్తున్నాయన్నారు గోపాలకృష్ణ. సమాజాన్ని తన ఆలోచనలతో మార్చాలనే పవన్ కల్యాణ్ ఆశయం గొప్పదని ప్రసంశించారు. పవన్ కల్యాణ్‌ వాయిస్‌ చట్టసభల్లో వినాలన్నదే తన కోరిక అని మనసులో మాట బయటపెట్టారు స్టార్ రైటర్. పరుచూరి పలుకులు అనే తన వ్యక్తిగత యూట్యూబ్‌ ఛానల్‌(YouTube channel)లో పవన్ కల్యాణ్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తర్వాత పవన్‌ కల్యాణ్ రాజకీయ జీవితంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

Pawan-Jr NTR: ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం.. ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్-పవన్.. స్కెచ్ మామూలుగా లేదుగా?రాజకీయంగా ఎదిగే శక్తి ..

దక్షిణాదిలో ఎంతో మంది సినీ తారలు రాజకీయాల్లో రాణించారు. మరికొందరు రాజకీయాల్లోకి వెళ్లాలన్న తమ కోరిక తీరగానే మళ్లీ వెనక్కి వచ్చిన వాళ్లు ఉన్నారు. కాని నటరత్న నందమూరి తారకరామారావు మాత్రమే సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన, ఆశయంతో రాజకీయాల్లోకి వెళ్లి ఎనలేని పేరుతో పాటు ప్రజాభిమానాన్ని చురగొన్నారు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ చేస్తోంది కూడా అదేనన్నారు స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ. రాజకీయాల్లో ఒక్క ప్రయత్నంతోనే గెలవాలని, ముఖ్యమంత్రి కావాలనే తపన పవన్‌ కల్యాణ్‌కి కాదని ...ప్రజలకు మేలు జరిగే వరకూ ప్రజాక్షేత్రంలో పోరాడాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. అందుకే గెలుపు, ఓటములను పక్కన పెట్టి ఆయన ప్రజల్లో తిరుగుతున్నారని గోపాలకృష్ణ అన్నారు. రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజమని గతంలో ఇందిరాగాంధీని గెలిపించి ప్రధానిని చేసిన పార్లెమెంట్‌ నియోజకవర్గం ప్రజలే ఆమెను ఓఢించలేదా అని గుర్తు చేశారు. అలాగే ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రిని చేసిన అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలే ఆయన్ని ఓడించిన విషయాన్ని ఉదాహరణగా చెప్పుకొచ్చారు పరుచూరి బ్రదర్.

గొప్ప గొప్ప వాళ్లే ఓడిపోయారు..

నటుడు పవన్ కల్యాణ్ ఆలోచన కూడా అన్నగారు ఎన్టీఆర్‌లాగానే ఉంటుందని .. ప్రజావాక్కును చట్టసభల్లో వినిపించాలనే కసి కనిపిస్తోందన్నారు.సమాజాన్ని బాగుచేయాలన్న పవన్ కల్యాణ్ ఆలోచన కూడా చాలా గొప్పదన్నారు. పవన్ కల్యాణ్‌ ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో ఆయన వాయిస్‌ వినాలనుకునే వాళ్లలో తాను ప్రధాన వరుసలో ఉంటానన్నారు గోపాలకృష్ణ. ఖచ్చితంగా ఆ లక్ష్యం, ప్రజల కోరిక తీరాలని కోరుకుంటున్నానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తప్పని సరిగా ఆయన ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టి ప్రశ్నించే హక్కును పొందాలని కోరుతున్నానని చెప్పారు.

Karthi|Surya : హీరోగా 25ఏళ్లు పూర్తి చేసుకున్న సూర్యకి కార్తీ విషెస్ ..వైరల్ అవుతున్న ఎమోషనల్ ట్వీట్


ఓ సూపర్ హిట్‌ కొడితే ..

పరుచూరి పలుకులు అనే యూట్యూబ్ ఛానల్‌ ద్వారా సినిమాలు, వర్తమాన రాజకీయాలు, సెలబ్రిటీ అంతరంగానికి సంబంధించిన విషయాలపై తన వ్యక్తిగ అభిప్రాయాల్ని అందరితో పంచుకునే పరుచూరి గోపాలకృష్ణ పవన్ కల్యాణ్‌ గురించి కూడా ఆసక్తిరకమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు. ప్రపంచంలో మనకు తెలియని చాలా విషయాలు పవన్ కల్యాణ్‌కి తెలుసన్నారు గోపాలకృష్ణ. గతంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకునే ముందు బొబ్బిలి పులి, జస్టిస్‌ చౌదరి, ఈనాడు వంటి సినిమాలు ఎంతో హైప్ చేశాయని .. రాజకీయంగా ప్రజల్ని చైతన్య పరచడానికి ఉపయోగపడ్డాయని గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ కూడా ఎన్నికలకు మరికొంత సమయం ఉంది కాబట్టి ఎన్టీఆర్‌ చేసినట్లుగా ప్రజల్లో తన స్టామినాను నిరూపించుకునేందుకు సూపర్ హిట్ సినిమా ఒకటి తీస్తే రాజకీయంగా బాగా కలిసివస్తుందన్నారు. పరుచూరి గోపాలకృష్ణ పలుకులను జనసేనాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Published by:Siva Nanduri
First published:

Tags: Paruchuri gopalakrishna, Pawan kalyan, Sr ntr, Tollywood actor

ఉత్తమ కథలు