హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ ప్రభుత్వంపై సర్పంచుల తిరుగుబాటు..! పొలిటికల్‌గా ఎవరికి ఎఫెక్ట్..?

ఏపీ ప్రభుత్వంపై సర్పంచుల తిరుగుబాటు..! పొలిటికల్‌గా ఎవరికి ఎఫెక్ట్..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: పంచాయతీల్లో నిధులు లేవని అందుకే పనులు చేపట్టలేకపోతున్నామని సర్పంచ్ లు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం మాత్రం గ్రామ సచివాలయ వ్యవస్థను చూసుకొని ఒకవిధంగా సర్పంచ్ లను పక్కనపెట్టేసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Andhra Pradesh, India

  Anna Raghu, Sr. Correspondent, News18, Amaravati

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎప్పటి నుంచో హాట్ టాపిక్ గా ఉన్న అంశం గ్రామ పంచాయతీల నిధులు. గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడం, రోడ్లు డ్రెయినేజీలు, తాగునీటి సరఫరా వంటి సమస్యలు ఎదరువుతున్నా సకాలంలో పరిష్కరించకపోవడంతో ఈ అంశం నిధులవైపు మళ్లింది. పంచాయతీల్లో నిధులు లేవని అందుకే పనులు చేపట్టలేకపోతున్నామని సర్పంచ్ లు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం మాత్రం గ్రామ సచివాలయ వ్యవస్థను చూసుకొని ఒకవిధంగా సర్పంచ్ లను పక్కనపెట్టేసింది. దీంతో గ్రామ పంచాయితీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం ద్వారా విడుల చేసిన నిధులు ప్రభుత్వం లాగేసుకుంటుందంటూ ఆరోపిస్తూ ఏ.పి లోని పలు సర్పంచుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

  ఇప్పటికే అధికారులకు వినతిపత్రాలు, విజ్ఞాపనలతో నెట్టుకుంటూ వచ్చిన సర్పంచ్ లు ఇప్పుడు నేరుగా ఉద్యమానికి సిద్ధమయ్యారు. తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయితి రాజ్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యం,గ్రామ పంచాయితీలే దేశానికి పట్టుకొమ్మలు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే పాలకులు ఆచరణలో మాత్రం పంచాయితీ రాజ్ వ్యవస్థ మనుగడనే ప్రశ్నార్ధకం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ లు ఆరోపిస్తున్నారు. గ్రామాలలో పారిశుధ్యం,త్రాగు నీరు,రోడ్లు మరమ్మత్తుల వంటి అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్ళించడంపై సర్పంచ్ లు మండిపడుతున్నారు.

  ఇది చదవండి: ఏపీపై బీజేపీ అధిష్టానం ఫోకస్.. త్వరలో కొత్త అధ్యక్షుడు..? ఆయనొస్తే వైసీపీకి కష్టమేనా..?

  సర్పంచ్ అనే పేరు తప్ప పంచాయితీ ఖజానాలో చిల్లిగవ్వ ఉంచడం లేదని, పైగా పన్నుల రూపంలో పంచాయితీ ఖాతాలో జమవుతున్న నిధులను కూడా దారిమళ్ళిస్తున్నారని సర్పంచులు వాపోతున్నారు. ఇంతకాలం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఎంతో ఓపికగా ఎదురు చూసినా ప్రభుత్వం నుండి స్పందన లేదని,గ్రామాలలో సమస్యలు తిష్టవేసుకు కూర్చున్నాయని ఇప్పటికైనా తమ నిధులు తమకు కేటాయించక పోతే ప్రజలలో తిరిగే పరిస్థితి ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్.. సీఎం జగన్ వ్యూహం వర్కవుట్ అవుతుందా..?

  పార్టీ సింబల్ తో పోటీ చేయకపోయినా పార్టీ సానుభూతిపరులే సర్పంచ్ లుగా ఎన్నిక అవుతారనేది అందరికీ తెలిసిన విషయమే. వైసీపీ కూడా రాష్ట్రంలో దాదాపు 90శాతం పంచాయతీలు తమ పార్టీనే గెలుచుకున్నట్లు ప్రచారం చేస్తోంది. అటువంటి సర్పంచ్ లు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవ్వడమంటే ఒకరకంగా అధికార పార్టీకి గట్టి దెబ్బే అని చెప్పుకోవాలి. సర్పంచ్ అంచే ఆయా గ్రామాలలో మంచి పట్టుకలిగి ఉంటారు. ఏ పార్టీ ఐనా సరే ఇటువంటి సెకండ్ క్యాడర్ లీడర్లను నిర్లక్ష్యం చేస్తే ఆ తరువాత భారీమూల్యం చెల్లించుకున్న ఉదాహరణలు కోకొల్లలు. ఇప్పటికే సీపీఎస్ రద్దు అంశంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహానికి గురైన ప్రభుత్వం ఇప్పుడు సర్పంచ్ లను కూడా దూరం చేసుకుంటే రానున్న ఎన్నికలలో కష్టలు ఎదుర్కోక తప్పదనేది రాజకీయ విశ్లేషకుల మాట.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics

  ఉత్తమ కథలు