హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Rk Roja: అందరి టార్గెట్ మంత్రి రోజానే.. బహిరంగంగానే ఫైట్ స్టార్ట్ చేసిన ప్రత్యర్థి వర్గం

Rk Roja: అందరి టార్గెట్ మంత్రి రోజానే.. బహిరంగంగానే ఫైట్ స్టార్ట్ చేసిన ప్రత్యర్థి వర్గం

నగరిలో అందరి టార్గెట్ రోజానే..

నగరిలో అందరి టార్గెట్ రోజానే..

Minster Roja: రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు ఉండే క్రేజ్ వేరు.. పార్టీలోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయాల్లోనే ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు.. అలాంటి ఆమెకు సొంత నియోజకవర్గంలోనే కష్టాలు తప్పడం లేదు. హ్యాట్రిక్ కొట్టాలి అనుకునే ఆమెకు సొంత పార్టీ నేతలే సవాల్ విసురుతున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nagari, India

  Minster Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని.. అధికార వైసీపీ (YCP) లో అత్యంత గుర్తింపు తెచ్చుకున్న నేతల్లో మంత్రి రోజా (Minster Roja) అందులోనూ ఆమె సొంత నియోజకవర్గం నగిరి (Nagari ) లో రోజా కు ఉంటే క్రేజ్ వేరు. సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఉన్నా.. రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. అయితే రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఆమె.. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో మాత్రం ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ప్రతిపక్ష నేతలపై తనదైన స్టైల్లో.. జబర్దస్థ్ పంచ్ లు వేస్తూ.. విపక్ష నేతలపై తన స్టైల్ లో విమర్శలు జల్లు కురుపిస్తూ ఉండే రోజాకు.. ఇప్పుడు సొంత పార్టీ నేతలే నిద్ర లేకుండా చేస్తున్నారా...?

  రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గినా.. మొదటి నుండి నగిరి నియోజకవర్గం అంతా సమస్యలే ఎదురవుతున్నాయి. సొంత పార్టి నేతలే రోజాకు తలనొప్పిగా మారడంతో నగిరి నియోజకవర్గం ఏపిలోనే రాజకీయ రగడకు కేర్ ఆఫ్ అడ్రసుగా మారుతోంది. ఇన్నాళ్ళు ఎమ్మెల్యేగా సేవలందించిన రోజాకు ఏపి కేబినెట్ లో స్ధానం దక్కడంతో మంత్రిగా తనదైన శైలిలో దుసుకెళ్తున్నారు.

  మంత్రి రోజాకు దీటుగా ఆమె ప్రత్యర్ధి వర్గం సైతం ఏమాత్రం తగ్గకుండా తనదైన స్టైల్ లో రోజాపై విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టి కేడర్ లో మొదలైన వివాదం రోజు రోజుకు ముదిరి ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకునే స్ధాయికి చేరుకుంది.. మరో వైపు నగిరి నియోజకవర్గంలో జరిగే పార్టి కార్యక్రమం అయినా రోజా తన అనుచరగణంతో నిర్వహిస్తే, రోజా ప్రత్యర్థి వర్గం పార్టి కార్యక్రమాలను మరో చోట నిర్వహిస్తూ ప్రజల దృష్టిని నగిరి వైపు చూసేలా చేస్తున్నారు.. దీంతో నగిరిలో ఎప్పుడూ ఏం జరుగుతుందో అని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్ధితి నెలకొంటోంది.

  ఇదీ చదవండి:  టీటీడీకీ షాక్.. సేవ కల్పించనందుకు.. నష్టపరిహారంగా భక్తుడికి 50 లక్షలు చెల్లించాలన్న కోర్టు

  2019 ఎన్నికల నాటి నుంచి రోజా వ్యతిరేక వర్గం తమతమ వాదనలతో అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. తాజాగా దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) వర్ధంతి నాడే.. మంత్రి రోజా వ్యతిరేక వర్గం తీరు మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోజా అక్కడే ఘనంగా వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ప్రవాస భారతీయులతో ఘనంగా జరుపుకున్నారు.

  ఇదీ చదవండి: బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తారు.. ముఖ్యమైన ఘ‌ట్టాలు ఏంటి.. ఎప్పుడు..? వాటి ప్రయోజనాలు ఇవే

  అయితే నగరి లో మాత్రం.... రోజా వర్గం... ప్రత్యర్థి వర్గాలు వేర్వేరుగా వర్ధంతి వేడుకలు నిర్వహించాయి. నగరిలో కుమారస్వామి రెడ్డి నగరిలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా.. మరోవైపు పుత్తూరులో కేజే శాంతి కుమారి, కేజే కుమార్ దంపతులు, చక్రపాణి రెడ్డి వర్గం వేడుకలు నిర్వహించారు. అదే సమయంలో రోజాపై అక్కసు వెళ్లకక్కారు.. కేజే శాంతి.. పార్టీకి విధేయులుగా ఉన్న వారిని సీఎం జగన్ గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే మంత్రి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మూడు నెలలుగా నగరి నియోజకవర్గంలో అసమ్మతి ఉన్న.. సీఎం జగన్ కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేసారు.

  ఇదీ చదవండి: : మీ అమ్మాయికి మంచి అమెరికా సంబంధం వచ్చిందని మురిసిపోతున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

  టీడీపీ నుంచి వలస వచ్చిన వారిని మంత్రి రోజా హక్కును చేర్చుకొని.. వారికే పెద్దపీట వేస్తున్నారని విమర్శలు చేసారు. టీడీపీలో సకల సుఖాలు అనుభవించి.. వైసీపీ పార్టీలో ఉన్న వారిని ఇబ్బంది పెడితే.. మళ్లీ వారే పార్టీ మరి స్వపక్ష నేతలను ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. మనసులో ఎన్నో బాధలు ఉన్నా..  అన్ని సీఎం జగన్ కోసం అణచి పెట్టుకొని ఉన్నామని.. వచ్చే ఎన్నికల్లో తడాకా చూపిస్తామని కేజే శాంతి కుమారి పరోక్షంగా రోజాకు సవాల్ విసిరారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Minister Roja, Nagari MLA Roja, Ycp

  ఉత్తమ కథలు