ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో లోన్ యాప్ (Online Loan Apps) ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అవసరంలో ఉన్నవారికి ఆన్ లైన్లోనే అప్పులిస్తున్న యాప్ నిర్వాహకులు సమయానికి డబ్బులు చెల్లించకపోయే సరికి వారిని వేధిస్తున్నాయి. అంతేకాదు ఫోన్లు చేసి దూషించడం, అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. లోన్ యాప్ ల వేధింపులు తట్టుకోలేక బాధితులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఐతే ఇప్పుడు లోన్ యాప్ ల వేధింపులు ప్రజాప్రతినిథుల వరకూ వచ్చాయి. తాజాగా ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minsiter Kakani Gowardhan Reddy), మాజీ మంత్రి, నెల్లూరు (Nellore) సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ (MLA Anil Kumar) కు కూడా లోన్స్ యాప్ బెడద తప్పలేదు.
శుక్రవారం ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు ఫోన్ చేసిన లోన్ యాప్స్ నిర్వహకులు.. మీ బావమరిది లోన్ తీసుకున్నాడని వెంటనే క్లియర్ చేయాలంటూ యాప్ కాల్ సెంటర్ ఉద్యోగి నిలదీసింది. పాతపాటి అశోక్ కుమార్ అనే వ్యక్తి మీ పేరుపై లోన్ తీసుకున్నట్లు వెల్లడించింది. నేను మాజీ మంత్రిని, ఎమ్మెల్యేని అని చెప్పినా లోన్ యాప్ కాల్ సెంటర్ వ్యక్తులు వెనక్కి తగ్గలేదు. దీంతో కాస్త అసహనానికి లోనైన మంత్రి అనిల్.. చెప్పుతో కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. అనిల్ వార్నింగ్ ఇచ్చినా అవతలి అమ్మాయి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇద్దరూ కలిసి లోన్ తీసుకొని ఇప్పుడు డ్రామాలు ఆడతారా అంటూ నిలదీసింది. దీంతో కంగుతినడం అనిల్ వంతయింది.
ఇది చదవండి: నేను కాసినోకి వెళ్తా.. పేకాట ఆడతా..! ఆ అవసరం లేదు.. ఏపీ మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్..
ఇదిలా ఉంటే మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికీ లోన్ యాప్స్ బెడద తప్పలేదు. అశోక్ కుమార్ అనే వ్యక్తి లోన్ తీసుకొని కాంటాక్ట్ నెంబర్ మంత్రిది ఇవ్వడంతో యాప్ నిర్వాహకులు మంత్రికి ఫోన్ చేశారు. తనకు లోన్ యాప్ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చిన మాట వాస్తవమేనని మంత్రి వెల్లడించారు. తన ఫిర్యాదుతో పోలీసులు నలుగుర్ని అరెస్ట్ చేస్తే వారిని విడిపించేందుకు పది మంది లాయర్లు వచ్చారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
లోన్ యాప్ ముఠా ఫోన్ చేసిన సమయంలో తన పీఏ ఫోన్ తీశారని, వారిని ట్రాప్ చేసేందుకు రూ.25వేలు కూడా ఇచ్చామన్నారు కాకాణి. పోలీసులకు లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు ఎవరికైనా ఫోన్ చేసి బెదిరించినా, ఇబ్బంది పెట్టినా తనకు కానీ, పోలీసులకు కానీ ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. ఏపీలో ముఠా ఆగడాలు చెల్లుబాటు కాకపోవడంతో చెనై నుంచి ఆపరేట్ చేస్తున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, Loan apps, Nellore