హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Bandla vs Vijayasai: ముదురుతున్న ట్వీట్‌వార్..ఆ ఎంపీని అంత మాట అనేసిన బండ్లగణేష్

Bandla vs Vijayasai: ముదురుతున్న ట్వీట్‌వార్..ఆ ఎంపీని అంత మాట అనేసిన బండ్లగణేష్

Photo Credit:Twitter

Photo Credit:Twitter

Hyderabad:నిర్మాత బండ్ల గణేష్, ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్వీట్‌వార్‌ కాస్తా లైవ్‌లోకి వచ్చింది. తనను కించపరుస్తూ ట్వీట్‌ చేసిన విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్‌ అందే రేంజ్‌లో బదులిస్తున్నారు. ఓ న్యూచ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ఘాటు వ్యాఖ్యలు చేశారు బండ్లగణేష్.

ఇంకా చదవండి ...

బండ్ల గణేష్ (Bandla Ganesh)అంటే అతనొక ఫుల్‌టైమ్ సినిమా మనిషి. పార్ట్ టైమ్ పొలిటిషియన్ అనే పేరుంది. విజయసాయిరెడ్డి(Vijayasaireddy)వైసీపీ ఎంపీ, వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితులు అని అందరికి తెలుసు. కాని 30ఏళ్లకుపైగా తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న బండ్లగణేష్‌కి.. ఏపీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈ మధ్యే రాజుకున్న ట్వీట్‌(Tweet) వార్‌ అంతకంతకు పెరుగుతోంది. ఇప్పుడు అది పీక్స్‌కి చేరుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే బండ్లగణేష్‌ అనే వ్యక్తి అటు వైఎస్‌ఆర్‌, వైసీపీని, జగన్‌ని పొగుడుతూనే విజయసాయిరెడ్డిపై ఫైర్ అవుతున్నారు. ఘాటుగా విమర్శిస్తున్నారు. చిన్న స్థాయి వ్యక్తులను పెద్దగా పట్టించుకోని విజయసాయిరెడ్డి కేవలం బండ్లగణేష్‌ విషయంలో ట్విట్టర్(Twitter) వేదికగా చులనక చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ట్వీట్‌కి రీ ట్వీట్‌లు చేసుకుంటు ..నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి డైలాగ్‌ వార్ వెళ్లింది. కొన్ని గంటల క్రితం కూడా బండ్ల గణేష్‌ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఓ టీవి ఛానల్‌ లైవ్‌ ఇంటర్వూChannel Live Interviewలో ఘాటు విమర్శలు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌(ys jagan)కి ఏరోజుకైనా వెన్నుపోటు పొడుస్తారని..అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి జగన్‌గారు అంటూ కామెంట్స్‌ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతే కాదు..జగన్‌కి ఎవరు సన్నిహితంగా దగ్గరవుతున్న వారి మధ్య దూరం చేయడం, స్కెచ్‌లు వేయడం, తిట్టించడం, కేసులు పెట్టించడం విజయసాయిరెడ్డి చేసే పని నాకు అలాంటివి తెలియదంటూ టీవీ ఇంటర్వూలో మరోసారి టార్గెట్ చేసి మాట్లాడారు.

ట్వీట్‌ నుంచి లైవ్‌లోకి..

వైసీపీలో అందరూ మంచివాళ్లే కాని ఒక్క విజయసాయిరెడ్డి తప్ప అనే పదాన్ని పదే పదే బండ్ల గణేష్‌ ఉపయోగిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు,రాజకీయ విభేదాలు ఉంటే డైరెక్ట్‌గా చూసుకోవాలి కాని ఆడవాళ్లను తిట్టించడం, ట్విట్టర్‌లో ఉపయోగించని భాషతో నీచంగా మాట్లాడటం ఆయన సంస్కారం ఎలాంటిదో తెలియజేస్తోందన్నారు. ఇలాంటి స్కెచ్‌లు వేయడం, కేసులు పెట్టించడం, పాపిష్ట పనులు చేసిన వ్యక్తి ఏదో ఒకరోజు అదే రకంగా శిక్ష అనుభవిస్తారని శాపనార్ధాలు పెట్టారు బండ్ల గణేష్. విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యవహారం ఏదో ఒక రోజు జగన్‌కి తెలిసి దూరం పెట్టే రోజు వస్తుందని అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోమని టీవీ ఇంటర్వూలో చెప్పారు బండ్లగణేష్. వైసీపీలో వైఎస్‌ జగన్‌ పక్కన ఉన్నారు కాబట్టి విజయసాయిరెడ్డికి గౌరవం ఉంది తప్ప లేదంటే ఆయన్ని ఎవరూ గౌరవించరని ఘాటు విమర్శలు చేస్తూ వరుస ట్వీట్‌లు చేశారు బండ్లగణేష్.

నేను చిన్నోన్ని నీ స్థాయి నాది కాదు.. నాది చిన్న స్థాయి. నేను మామూలు వాణ్ణి, నీవు పెద్దోడివి, రాష్ట్రం మొత్తం నీ గురించి గొప్పగా చెప్పుకుంటుంది. గొప్ప వ్యక్తివి, చరిత్ర సృష్టించావ్……………..

— BANDLA GANESH. (@ganeshbandla) April 16, 2022

ముదురుతున్న ట్వీట్‌ వార్..

బండ్ల గణేష్‌ నువ్వు యాక్టర్ సచిన్‌ జోషిని మోసం చేశావంటూ మరో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. అది నువ్వు మర్చిపోయినట్లుగా నటిస్తున్నా..అతను చేసిన దేహశుద్ది నీకు జీవితాంతం గుర్తుంటుందిలే అని కౌంటర్ ఇచ్చారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్, పూరిని మోసం చేస్తే వదిలేశారు. అందరూ వాళ్లలా మంచివాళ్లు ఉండరంటూ సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి.


గణేష్‌ రూటే సెవరేటు..

బండ్ల గణేష్, విజయసాయిరెడ్డి మధ్య కుల ప్రస్తావనతో మొదలైన విమర్శల పర్వం ఇప్పుడు ట్విట్టర్‌లో రచ్చ రచ్చ అవుతోంది. మొత్తంగా చూసుకుంటే గత ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌లో చేరిన బండ్లగణేష్ టీఆర్‌ఎస్‌ని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌ విజయం సాధించడంతో పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారు. షఢన్‌గా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీ రోల్ పోషించే విజయసాయిరెడ్డితో వాగ్వాదానికి దిగడం చూస్తుంటే బండ్ల గణేష్‌ కన్ను ఏపీ పొలిటిక్స్‌పై పడిందా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ..తన దైవం, దేవుడు అని చెప్పుకునే పవన్ కల్యాణ్‌ పార్టీలో బెర్త్ కన్ఫామ్ చేసుకునేందుకే ఈ రేంజ్‌లో వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డిని ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్నారనే టాక్‌ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. బండ్ల గణేష్‌ మనసులో ఏముంది. విజయసాయిరెడ్డితో ఆయనకు జరుగుతున్న ట్విట్టర్‌ వార్ ఎప్పుడు పుల్‌స్టాప్ పడుతుందనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

First published:

Tags: Bandla Ganesh, Twitter, Vijayasai reddy

ఉత్తమ కథలు