హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kuppam: కుప్పంలో మళ్లీ టెన్షన్ టెన్షన్.. అన్న క్యాంటిన్ ధ్వంసం.. లోకేష్ పర్యటనతో ఉద్రిక్తత

Kuppam: కుప్పంలో మళ్లీ టెన్షన్ టెన్షన్.. అన్న క్యాంటిన్ ధ్వంసం.. లోకేష్ పర్యటనతో ఉద్రిక్తత

కుప్పంలో టెన్షన్ టెన్షన్

కుప్పంలో టెన్షన్ టెన్షన్

Kuppam: మొన్న చంద్రబాబు నాయుడు.. నేడు తనయుడు లోకేష్ కుప్పం పర్యటను ఉద్రిక్తంగా మారుతోంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన విధ్వంసం ఇంకా మరిచిపోలేదు.. ఇప్పుడు మరోసారి కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్న క్యాంటీన్ కూల్చివేతతో వివాదం మళ్లీ సెగలు రేపుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kuppam, India

  Kuppam: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అన్న క్యాంటీన్ (Anna Canteen) ల రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు.. పేదవాడి కడుపు నింపేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. అధికార వైసీపీ (YCP) మాత్రం విధ్వంసానికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తన్నారు టీడీపీ నేతలు (TDP leaders). తాజాగా కుప్పం (Kuppam) లో అన్నా క్యాంటిన్ ను మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాత్రి పదకొండు గంటల సమయంలో అన్నా క్యాంటీన్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పర్యటన చిత్తూరు జిల్లా (Chitoor District) లో ఉంది. ఆయన పర్యటనకు వస్తున్న సందర్భంలో అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడంతో కుప్పంలో మరోసారి టెన్షన్ నెలకొంది. పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లపై దారుణానికి ఒడిగడతా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి అన్న క్యాంటీన్లపై వైసీపీ దాడి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy) రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనం అని  లోకేష్ మండిపడ్డారు. కుప్పం ఆర్టీసీ బస్టాండు జంక్షన్ దగ్గర 56 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ పై వైసీపీ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.


  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 201 అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని లోకేష్ మండిపడ్డారు. ఇప్పుడు పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కుంటున్నా ఘనత వైసీపీ సొంతం అంటూ లోకేష్ మండిపడ్డారు. అర్ధరాత్రి కుప్పంలోని అన్న క్యాంటీన్ పై దాడి చేసిన వైసీపీ రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ (Nara Lokesh) డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా! రక్తపాతం తప్ప అన్నదానం విలువ తెలియని జగన్ రెడ్డికి... మనం అన్నదానంతో సమాధానం చెబుదాం. ఊరూవాడా వీలైనంత మందికి మీ శక్తి కొలది అన్నదానం చేయండి. తెలుగు దేశం పార్టీ నేతలు పిలుపు ఇస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. అన్న క్యాంటీన్ల కూల్చివేత అంశాన్ని.. వచ్చే ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మార్చుకోవాలని తెలుగు దేశం పార్టీ భావిస్తోంది.  ఇదీ చదవండి : కొబ్బరికాయతో అదృష్టం మార్చుకోవచ్చా? ఇలా చేయండి..! ఏపీలో భారీగా పెరిగిన రేట్లు..


  మొన్న చంద్రబాబు పర్యటనను సైతం వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇవాళ లోకేష్ పర్యటనలో కూడా ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో భారీగా కార్యకర్తలు.. నేతలు మోహరిస్తున్నారు. అటు గత అనుభవాల నేపథ్యంలో.. పోలీసులు సైతం భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా.. అడుగడుగునా నిఘా పెట్టారు. కానీ ఇటు వైసీపీ నేతలు కానీ, అటు టీడీపీ నేతలు కానీ వెనక్కు తగ్గడం లేదు.. ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో లోకేష్ పర్యటనలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kuppam, Nara Lokesh, TDP