JC Prabhakar Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల గురించి తెలిసిన వారికి.. జేసీ బ్రదర్స్ (JC Brothers) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తాడిపత్రి (Tadipatri) మున్సిపల్ చైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి (JC Diwarkar Reddy) కొంచె యాక్టివ్ గా లేనప్పటికీ.. జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhar Reddy) మాత్రం నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా కోర్టు కేసులతో జేసీ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక వాటి నుంచి బెయిల్ వచ్చిన తరువాత కూడా హడావుడి చేస్తూ కనిపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఉన్న కేసులు మరెవరిపైనా లేవనే చెప్పాలి. అయినా ఆయన ఎక్కడా వెనక్కు తగ్గలేదు.. ఢీ అంటే ఢీ అంటూ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆ సందర్భంగా ఆయన వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటూ వస్తోంది. తాజాగా మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు.
ఈ సారి ఏకం ఆగ్రహంతో ఊగిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సారి కోపన్నంతా ఏకంగా కలెక్టర్ పై చూపించారు. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన ఆయన ఆగ్రహావేశాలతో ఊగిపోతూ.. డాక్యుమెంట్లను బెంచిపై పడేసి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.
జేసీ ప్రభాకర్ రెడ్డికి కోపం తెప్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ సారి కోపన్నంతా ఏకంగా కలెక్టర్‌పై చూపించారు. ఆగ్రహావేశాలతో ఊగిపోతూ అక్కడ ఉన్న డాక్యుమెంట్లను బెంచిపై పడేసి ఓ రేంజ్లో కలెక్టర్ పై ఫైర్ అయ్యారు. సజ్జలదిన్నె గ్రామంలోని కోట్ల రూపాయల భూమిని కొందరు కాజేస్తున్నారంటూ.. సోమవారం స్పందన కార్యక్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని కలిశారు.
ఇదీ చదవండి : కార్తీక మాసంలో అమ్మవారి వైభవం.. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ విశిష్టత ఏంటంటే?
కానీ ఆయన ఊహించిన విధంగా స్పందన లేకపోవడంతో.. అధికారుల తీరును నిరసిస్తూ మండిపడ్డారు. వెంట తెచ్చిన డాక్యుమెంట్లను చూపిస్తూ చిటపటలాడారు. ఈ విషయంలో అధికారుల తీరును నిరసిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తెచ్చిన డాక్యుమెంట్లను అధికారులకు చూపిస్తూ ఆగ్రహంతో వాటిని చించేశారు. అసలు సమస్య ఏంటి అంటే..? సజ్జలదిన్నె గ్రామంలోని భూములకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వాటిని కొంతమంది కాజేస్తున్నారన్నది జేసీ ప్రభాకర్ వాదన. ఈ విషయంలో అధికారులు న్యాయం చేయాలని కోరితే.. ఎందుకు పట్టించుకోరని జేసీ ప్రశ్నించారు. ఎవరో ఎమ్మెల్యే సొంత ప్రాపర్టీ అంటే అధికారులు ఎందుకు స్పందంచరని జేసీ ప్రభాకర్ రెడ్డి నిలదీశారు.
ఇదీ చదవండి: పవన్ ఇమేజ్ ను జగన్ పెంచుతున్నారా..? చంద్రబాబును పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
జేసీ ఆగ్రహంతో మాట్లాడుతుంటే.. కలెక్టర్ సిబ్బంది అడ్డుకోబోయారు. వారిని తోసేస్తూనే వాగ్వాదానికి దిగారు. దీంతో కలెక్టర్ ఆయన్ను అక్కడ నుంచి వెళ్లమని సూచించారు. ఒక మాజీ ఎమ్మెల్యేను నేను చెప్పేది ఏ మాత్రం వినకుండా నన్నే వెళ్లిపొమ్మంటారా అంటూ ఆగ్రహించారు. ఫిర్యాదులపై స్పందించనప్పుడు.. ఈ స్పందన కార్యక్రమాలకు ఎందుకు అంటూ వాగ్వాదానికి దిగారు. అలాగే కలెక్టర్ అయినంత మాత్రానా ఎవరికి ఎక్కువ అని ప్రశ్నించారు. తాను ఆ పదవికి గౌరవం ఇస్తానని వ్యక్తులకు కాదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.