CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) మరోసారి హస్తిన బాట పడుతున్నారు. అయితే ఈ సారి ఆయన ఢిల్లీ పర్యటన.. ఏపీ రాజకీయాల్లో (AP Politics) ఉత్కంఠ పెంచుతోంది. ఎందుకంటే మార్చి 16వ తేదీని ప్రధాని మోదీ (Prime Minister Modi) తో సీఎం జగన్ భేటీ అయ్యారు. అంటే రెండు వారాల వ్యవధిలోనే ఆయన మరోసారి ప్రధానిని కలవనున్నారు. దీంతో ఏదో జరుగుతోంది అనే సంకేతాలు వెళ్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో రాజకీయ పరిణామాలు కూడా వేడి వేడిగా మారాయి. ఇదే సమయంలో అవినాష్ రెడ్డి కేసు సైతం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలపైనా ప్రధానితో భేటీ జరిగే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు భారీగా ప్రలోభాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యే మద్దాల గిరి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ మోదీని కలుస్తుండడం రాజకీయంగా సంచలనాలు ఏమన్నాయా ఉంటాయా అనే ప్రచారం జరుగుతోంది.
బుధవారం ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఇప్పటికే అపాయింట్ మెంట్ ఖరారు అయ్యింది. సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయిన సీఎం.. ఆ వెంటనే ఢిల్లీ పర్యటనకు వెళుతుండటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రాజకీయంగా నెలకొంది. అది కూడా రెండు వారాల వ్యవధిలోనే వెళ్తుండడం చర్చకు కారణమవుతోంది. ముఖ్యంగా రాజకీయ అంశాలే వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు.. ఎమ్మెల్సీ ఫలితాల్లో ఊహించని షాక్.. ఎమ్మెల్యేలపై ప్రలోభ పర్వం.. ఈ అంశాలపైనే చర్చ జరగనుంది అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కావడంతో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని ఆశావహులు ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో ఒకరిద్దరి మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తారనే ప్రచారం కూడా ఉంది. మరో వైపు మంత్రుల్లో ఎవరికి పదవి దక్కుతుందో, ఎవరి పదవి ఊడుతుందోననే టెన్షన్‌తో సతమతమవుతున్నారు.
ఇదీ చదవండి ఫేక్ లా సర్టిఫికేట్ల ఆరోపణలపై స్పీకర్ తమ్మినేని క్లారిటీ..? ఆయన ఏమన్నారంటే..?
గత కేబినెట్ విస్తరణలో కమ్మ, క్షత్రియ, వైశ్య, బ్రహ్మణ సామాజిక వర్గాలకు ఏపీ క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని రెండు, మూడు స్థానాల్లో మార్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇది ఎన్నికల ఏడాది కాబట్టి సామాజిక సమీకరణాల ఆధారంగానే మార్పులు చేర్పులు ఉంటాయి అంటున్నారు. కచ్చితంగా ముగ్గురు మంత్రులు అవుట్ అవుతారని.. తాజా మాజీల్లో ఒకరిద్దరి మళ్లీ కేబినెట్ లో చేర్చుకునే అవకాశం ఉందనే ప్రచారం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Delhi, Pm modi