Home /News /andhra-pradesh /

AP POLITICS ONCE AGAIN BREAK TO ANDHRA PRADESH NEW DISTRICT HIGCOURT GAVE NOTICE TO AP GOVERNMENT NGS

AP New District: సీఎం జగన్ కు మరో షాక్.. కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్.. హైకోర్టు ఏం చెప్పిందంటే..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP New District: కొత్త జిల్లాల ఏర్పాటుకు శరవేగంగా కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టేలానే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. అయితే ఆ ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. తాజాగా కోర్టు ఆదేశాలతో ఈ వ్యవహారానికి బ్రేక్ లు పడినట్టే.

ఇంకా చదవండి ...
  AP High Court on New Districts: పరిపాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పే ఏపీ ప్రభుత్వం (AP Government).. ఆ దిశగా అడుగులు వేస్తోంది. మూడు రాజధానుల విషయంలో ఓ వైపు పట్టుదలగానే ఉన్న ప్రభుత్వం.. ఆ నిర్ణయం ఆలస్యమైనా.. ఈ లోపూ కొత్త జిల్లాల (AP New District) ఏర్పాటును పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే అభ్యంతరాలు, సహాలకు గడువు కూడా ముగియడంతో.. కొత్త జిల్లాలపై తుది కసరత్తుకూడా మొదలైంది. అయితే తాజాగా కొత్త జిల్లాల పెంపు వ్యవహారంపై.. ఏపీ హైకోర్టు (AP High court)లో విచారణ జరిగింది. ఈ ఏడాది జనవరి 25న ఇచ్చిన ముసాయిదా ప్రకటన రద్దు చేయాలంటూ.. పిల్‌ దాఖలైంది. ఈ నోటిఫికేషన్‌ రద్దు చేయాలంటూ.. గుంటూరు జిల్లా (Gunturu District) అప్పాపురం గ్రామానికి చెందిన దొంతినేని విజయ్‌ కుమార్‌, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి.సిద్ధార్థ, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన జాగర్లమూడి రామారావు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ముసాయిదా జీవోల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తుది ప్రకటన వెలువడని దృష్ట్యా.. మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.

  తాజాగా కోర్టు ఉత్తర్వులు కారణంగా కొత్త జిల్లాలకు కాస్త బ్రేక్ పడినట్టే.. అంటే మరో 8 వారాల వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు.. అలా కాదని ముందుకు వెళ్తే.. న్యాయపరమైన ఇబ్బందులు తప్పక ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఉగాది వేళ కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఉన్న ఏపీ ప్రభుత్వానికి ఈ ఆదేశాలు బ్రేకులు వేశాయనే చెప్పాలి. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జాబితా ప్రకారం.. కొన్ని ప్రాంతాలపై పెద్ద‌గా అభ్యంత‌రాలు లేక‌పోయినా కొన్నింట మాత్రం స్ప‌ష్ట‌మైన వైఖ‌రి కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా రాజ‌కీయ ఉనికిని ప్ర‌శ్నార్థ‌కం చేసే విధంగా కొన్ని చోట్ల విభ‌జ‌న ఉంద‌ని ఎన్నో సార్లు మొత్తుకుంటున్న వైసీపీ నాయ‌కులకు జ‌గ‌న్ నుంచి మౌన‌మే స‌మాధానం అవుతోంది.

  ఇదీ చదవండి : సీఎం జగన్ పై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు.. పార్టీ దిశగా వేగంగా అడుగులు

  తాజాగా కోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్ వెనుకడుగు వేస్తారో లేదో చూడాలి. కొత్త జిల్లాల ఏర్పాటు అన్న‌ది 371డీ ప్రకారం విరుద్ధం అని తేల్చేస్తోంది కోర్టు. కేవలం కోర్టు మాత్రమే కాదు.. జిల్లాల ఏర్పాటు అన్న‌ది అశాస్త్రీయ సంబంధ చ‌ర్య అని బీజేపీ కూడా కొన్ని చోట్ల వ్యతిరేక గళం వినిపిస్తోంది. జ‌నాభా లెక్క‌లు తేల‌కుండా స‌రిహద్దులు మార్చ‌డం అన్న‌ది కుద‌ర‌ని ప‌ని అని కేంద్రం ముందునుంచే చెబుతూ వస్తోంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు అన్న‌ది రాష్ట్రం అంత‌ర్గ‌త వ్య‌వ‌హారంగానే చూస్తుంది త‌ప్ప వాటితో మాకేం ప‌ని అన్నట్టు వ్యవహరిస్తోంది.

  ఇదీ చదవండి : అంగన్ వాడీ టీచర్ పై మహిళా ఎస్ఐ జులుం.. నడుంపై చేయి వేసి మాట్లాడిందని ఫైర్

  ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. తాజాగా లో హై కోర్టులో పిల్ దాఖ‌ల‌యింది. కొత్త ఏడాది ఆరంభంలో జ‌న‌వ‌రి 25 ఇచ్చిన ముసాయిదా నోటిఫికేష‌న్ చట్ట‌విరుద్ధం అయిందంటూ ఓ ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌ల‌యింది.దీనిని వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని కోరుతున్నారు పిటిష‌న‌ర్లు. మరి 8 వారాల తరువాత కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది చూడాలి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP High Court, AP new districts

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు