2024 ఎన్నికలు తన చివరి ఎన్నికలన్న చంద్రబాబు వ్యాఖ్యలకు దేవతలు తధాస్తు అంటరాని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు మళ్లి అధికారంలోకి వస్తే కరువు కాటకాలు తప్పవన్నారు. మనం మంచి కోరుకుంటే మంచి, చెడు కోరుకుంటే చెడు జరుగుతుందన్నారు. చంద్రబాబుకు చివరి ఎన్నికలు అని అన్నాడా అని బొత్స మీడియాను ప్రశ్నించారు. ఒకవేళ ఆ వ్యాఖ్యలు చేస్తే అదే నిజం అవుతుందని అన్నారు. మనం ఏదైనా మాట్లాడితే పైన తధాస్తు దేవతలు దీవిస్తారని పెద్దలు చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.
అధికారంలో వున్నప్పుడు ఓ రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా చంద్రబాబు వ్యవహరించేవాడని ఆయన విమర్శించారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు కాటకాలు వస్తాయని అన్నారు. అలాగే ఏపీ సీఎం జగన్ పై వస్తున్న విమర్శలను మంత్రి ముందు ప్రస్తావించారు. చంద్రబాబును హిట్లర్ తో పాటు ఈస్టిండియా కంపెనీతో పోల్చారని విమర్శించారు. ఏపీకి చంద్రబాబు సీఎం కాకూడదన్నారు. చంద్రబాబుకు జాలి, దయ లేదు. చంద్రబాబు భార్యను ఎవరు అవమానించారో చెప్పాలన్నారు. అసెంబ్లీలో రికార్డెడ్ ఎవరైనా తప్పుగా మాట్లాడారో చూపించాలన్నారు. ఇలా అవమానిస్తే ఎవరూ హర్షించలేరని బొత్స వ్యాఖ్యానించారు.
కాగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై కూడా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఇటీవల పవన్ జగనన్న ఇళ్లపై చేసిన విమర్శలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. సినిమా నటుడు అని జనాలు చూడడానికి వస్తే వాళ్ల ముందు ఆవేశంగా మాట్లాడితే సరిపోతుందా అని ప్రశ్నించారు. నీ మీద ప్రధానికి ఫిర్యాదు చేయడానికి నీవేమైనా పుడింగివా అంటూ పవన్ (Pawan Kalyan) పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వు చెప్పేదంతా నమ్మడానికి నీవేమైనా యుగ పురుషుడివా అని ఆయన ఎద్దేవా చేశారు. తేల్చేస్తా..తేల్చేస్తా అంటున్నవ్ కదా ఏం తేలుస్తావని పవన్ (Pawan Kalyan) ను ఆయన ప్రశ్నించారు. పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో వైఎస్సార్ నడిచారని, ఇప్పుడు అదే లక్ష్యంతో సీఎం జగన్ పని చేస్తున్నారని అన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలనుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టేందుకే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శలు గుప్పించారు. మరి గత 5 ఏళ్లలో చంద్రబాబు ఎన్ని ఇళ్లు కట్టించారో ఎప్పుడైనా పవన్ ప్రశ్నించాడా అని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Botsa satyanarayana, Chandrababu Naidu