AP POLITICS OFFICIALS TOOK ACTION SERIOUS ACTION ON VILLAGE VOLUNTEERS AND WARD SECRETARIES IN ANNAMAYYA DITRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
AP Volunteers: చెప్పినా వినకుంటే అంతే మరి.. ఏకంగా 23 మంది వాలంటీర్లపై వేటు.. కారణం ఇదే..!
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ (Village Volunteers) ప్రారంభం కావడంతోనే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పాయని అందరూ భావించారు. అందుకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఒకటవ తేదీ తెల్లవారు జాము నుంచే పింఛన్ పంపిణీతో పాటు పలు సంక్షేమ పథకాలకు వాలంటీర్ల ద్వారానే ఇంటింటికీ చేరవేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ (Village Volunteers) ప్రారంభం కావడంతోనే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పాయని అందరూ భావించారు. అందుకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఒకటవ తేదీ తెల్లవారు జాము నుంచే పింఛన్ పంపిణీతో పాటు పలు సంక్షేమ పథకాలకు వాలంటీర్ల ద్వారానే ఇంటింటికీ చేరవేస్తోంది. దీంతో చిన్న సర్టిఫికెట్ నుంచి ఇతర ప్రభుత్వ పథకాల అమలుకు లబ్ధిదారులు ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అందేలా ఈ వ్యవస్థ సరళంగా ప్రజలకు అందుబాటులో ఉంది. ఐతే ప్రభుత్వం ఒకటి అనుకుంటే గ్రామ వాలంటీర్ల మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల వాలంటీర్లు వ్యవహార శైలి ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చి పెడుతోంది. హద్దులి మీరు ప్రవర్తిస్తూ... లబ్ధిదారుల అకౌంట్లలో నగదు నొక్కేయడం.., పింఛన్ డబ్బులు వేరొకరికి బదిలీ చేయడం వంటి ఉదంతాలు రోజు చూస్తూనే ఉన్నాం.
కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా పరిధిలోని మొలకలచెరువు మండల పరిధిలోని విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు మొదట విధుల్లో చాలాబాగా పనిచేసినట్లు కలరింగ్ ఇచ్చేవాళ్ళు. అడిగేవారు లేరని తాము ఆడిందే ఆట.., పాడిందే పాటగా కొనసాగుతూ వచ్చింది. అయితే వీరిపై నెమ్మదిగా ఎంపిడిఓ కార్యాలయానికి ఫిర్యాదులు రావడం ప్రారంభమయ్యాయి. రోజురోజుకు సమస్యలు పరిస్కారం కాకపోవడమే కాదు... మరిన్ని ఫిర్యాదుల వస్తూనే ఉన్నాయి.
దీనిపై మొలకలచెరువు ఎంపీడివో రమేష్ బాబు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు నిర్వర్తిస్తున్న విధులపై నిఘా ఉంచారు. గ్రామాలు తిరిగి ప్రభుత్వం పథకాల అమలుపై నేరుగా ప్రజలతో భేటీ అయిన ఏంపీడీవో రమేష్ గ్రామ స్ధాయిలో వాలంటీర్ల పనితీరుపై ఆరా తీశారు. వాలంటీర్లు బయోమెట్రిక్ హాజరు వేయక పోవడం, వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శుల పని తీరులో ఎటువంటి మార్పు కనిపించలేదు. అయితే ఇదే విషయంను ఏంపీడివో రమేష్ సమావేశంమై వార్నింగ్ కూడా ఇచ్చారు.కానీ వారి పని తీరులో ఎటువంటి మార్పులు రాలేదు. దీంతో ఆగ్రహంకు గురైన రమేష్ బాబు వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శుల వార్నింగ్ సైతం ఇచ్చాడు.
అయితే పైఅధికారి మాటలను ఏమాత్రం పట్టించుకోక పోవడంతో మండలం పరిధిలోని 23 మంది వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ, ఏడుగురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. మొలకలచెరువు మండలంలోని బురకాయలకోట, గూడుపల్లె, కదిరినాధునికోట, కాలువపల్లె, మద్దినాయునిపల్లె, ములకలచెరువు, సోంపల్లె, చౌడసముద్రం, గ్రామాలకు చెందిన వాలంటీర్లకు సస్పెండ్ చేయడమే కాకుండా వారికి ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోన్స్, బయోమెట్రిక్ స్కానర్లను స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మిగిలిన వారికి కూడా ఇదే తరహాలో కఠిన చర్యలు తీసుకుంటానని మొలకలచెరువు ఏంపీడివో రమేష్ బాబు హెచ్చరించారు.. ఏదీ ఏమైనప్పటికీ ఎంపీడీవో తీసుకున్న చర్యలకు మిగిలిన సిబ్బంది గుండెల్లో భయం మొదలైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.