ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ (ZPTC, MPTC Elections Counting) కొనసాగుతోంది. ఎన్నికలు జరిగిన ఏడు నెలల తర్వాత కౌంటింగ్ జరుగుతుండటంతో ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలకు ముందే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) 126 జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) ఎన్నికలను బహిష్కరించగా.. జనసేన (Janasena Party), బీజేపీ (BJP) కొన్నిచోట్ల పోటీ చేశారు. ఐతే ఏడు నెలలుగా స్ట్రాంగ్ రూములకు తాళాలు వేసి ఉంచటంతో కొన్నిచోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలుపట్టాయి. మరికొన్నిచోట్ల బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు చేరడంతో బ్యాలెట్ పేపర్లు తడిసిపోయాయి. దీంతో ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఐతే అధికారులు మాత్రం పాడైపోయిన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల వరాలు ఎన్నికల కమిషన్ కు పంపుతామని.. దీనిపై ఎస్ఈసీదే తుదినిర్ణయమని చెబుతున్నారు.
కడప జిల్లా ముద్దనూరు మండలం కోర్రపాడు ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన నాలుగు బ్యాలెట్ బాక్సుల్లో ఒక బ్యాలెట్ బాక్స్ లో వర్షపునీరు చేరడంతో బ్యాలెట్ పేపర్లు తడిసిపోయాయి. అందులో 600 ఓట్ల వరకు ఉన్నాయి. తడిసిన బ్యాలెట్ పేపర్లను అధికారులు ఎండలో ఆరబెడుతున్నారు. మరోవైపు మిగిలిన మూడు బ్యాలెట్ బాక్సులు లెక్కించాలని.. వీటిలో ఎవరికైనా 600 కంటే ఎక్కువ ఆధిక్యం వస్తే నాలుగో బ్యాలెట్ బాక్సును లెక్కించాల్సిన అవసరం లేదని.. వారినే గెలిచినట్లు ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఇటు గుంటూరు జిల్లా తెనాలి NVR ఇంజనీరింగ్ కాలేజ్ కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సుల్లోకి నీరు చేరిదిం. కొల్లూరు మండలం ఈపూరు గ్రామానికి చెందిన బ్యాలెట్ బాక్సులు తడిసినట్లు సిబ్బంది గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులు సమాచారమిచ్చారు. మరోవైపు ఏజెంట్లు మాత్రం రీపోలింగ్ కు డిమాండ్ చేస్తున్నారు. తాడికొండ మండలం రావెల, బేజాతపురంలోనూ.., శ్రీకాకుళం జిల్లా షలాంత్రిలో బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టడం వల్ల దెబ్బతిన్నాయి. దీంతో సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియజేశారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా బ్యాలెట్ పత్రాలు దెబ్బతినడంపై ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది స్పందించారు. లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందన్న ఆయన.. 515 జెడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్ జరుగుతోందన్నారు. పలు కారణాలతో 6 చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని.. రెండుచోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు, మిగిలిన4 చోట్ల తడిచినట్లు వెల్లచిండారు. గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్నిచోట్ల బ్యాలెట్ పేపర్లలో నీళ్లు చేరడం, చెదలు పట్టడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు.
బ్యాలెట్ పేపర్ల వాలిడేషన్‌పై కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులదే నిర్ణయమని జీ.కే ద్వివేదీ స్పష్టం చేసశారు. వీటిపై సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పంపుతామని.. రీపోల్ అవసరమనుకుంటే ఎస్ఈసీ తుది నిర్ణయమని తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు త్వరలోనే వస్తాయని... జడ్పీటీసీ ఫలితాలు మాత్రం ఆలస్యమయ్యే అవకాశముందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.