టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ తరపున ఎక్కువగా టార్గెట్ చేసే వారిలో ముందుంటారు మాజీమంత్రి కొడాలి నాని(Kodali Nani). వైసీపీ సైతం చంద్రబాబును విమర్శించే విషయంలో కొడాలి నానిని ఎక్కువగా రంగంలోకి దించుతుందనే టాక్ ఉంది. మంత్రిగా ఉన్నా, లేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu), ఆయన కుమారుడు లోకేశ్‌ను తనదైశ శైలిలో విమర్శించే విషయంలో కొడాలి నాని ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వస్తూనే ఉంటారు. అందుకే కొడాలి నానిని గుడివాడలో(Gudivada) ఓడించేందుకు టీడీపీ చాలా ఏళ్ల నుంచి విశ్వప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికలకు ముందు కొడాలి నానిపై దేవినేని అవినాష్‌ను రంగంలోకి దింపింది టీడీపీ. కానీ వరుసగా నాలుగోసారి కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలవడాన్ని ఏ మాత్రం అడ్డుకోలేకపోయింది.
ఆ తరువాత కొడాలి నాని మంత్రి కావడం.. టీడీపీని మరింత తీవ్రంగా విమర్శించడంతో టీడీపీకి కొడాలి నానిపై మరింత ఆగ్రహం పెరిగింది. దీంతో కొడాలి నానిని గుడివాడలో ఓడించేందుకు గట్టి అభ్యర్థిని అన్వేషించడంపై ఫోకస్ చేసింది. కొంతమంది పేర్లను టీడీపీ నాయకత్వం ఈ మేరకు పరిశీలిస్తున్నట్టు ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. తాజాగా గుడివాడ టీడీపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ వెనిగళ్ల రామును బరిలోకి దింపేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని.. ఇందుకు పార్టీ అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
వెనిగళ్ల రాము ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడం.. గుడివాడలోని సామాజిక సమీకరణాలు కూడా ఆయన విజయానికి కలిసి వస్తాయనే నమ్మకంతో టీడీపీ ఉన్నట్టు సమాచారం. అందుకే రాము విషయంలో టీడీపీ సుముఖంగా ఉందని.. అన్నీ అనుకున్నట్టు జరిగితే కొన్ని నెలల్లోనే ఆయన గుడివాడలో ల్యాండ్ అవుతారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాముకు అనుకూలంగా ఆయన కుటుంబం గుడివాడలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు, లోకేశ్‌ను ఎక్కువగా టార్గెట్ చేసే వైసీపీ నేతలను వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడించాలని టీడీపీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
2024 ఎన్నికలే చివరివి..చంద్రబాబు వ్యాఖ్యలపై దేవతలు తధాస్తు అంటారన్న మంత్రి బొత్స
Casino case: క్యాసినో కేసులో మరో సంచలనం..100 మందికి ED నోటీసులు..ఏపీ రాజకీయ నాయకులకు కూడా..
ఈ లిస్టులో కొడాలి నాని ముందున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గుడివాడలో కొడాలి నానికి ముందు టీడీపీ తరపున పోటీ చేస్తూ వస్తున్న రావి కుటుంబానికి మరోసారి టికెట్ ఇచ్చే అంశాన్ని కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. కానీ కొడాలి నానిని ఢీ కొట్టాలంటే అన్ని రకాలుగా బలమైన అభ్యర్థి కావాలని భావించిన టీడీపీ ఇందుకోసం కొన్నేళ్ల నుంచి అన్వేషిస్తోందని.. ఈ క్రమంలోనే వెనిగళ్ల రాము పేరును కూడా పరిశీలించిందని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kodali Nani