AP POLITICS NO CABINET BERTHS THESE FOR BRAHMIN VYSAYA KSHATRIYA KAMMA WHAT IS THE JAGAN STRATEGY NGS
AP Cabinet: అగ్రవర్ణాలను సీఎం జగన్ దూరం పెట్టారా..? అసలు వైసీపీ లెక్కేంటి..?
ప్రతీకాత్మకచిత్రం
AP Cabinet: ఏ సీఎం అయినా అన్ని వర్గాలను దగ్గర చేసుకోవాలి అనుకుంటారు.. వారు ఎన్నికల్లో తమ పార్టీకి అనుకూలంగా వేయరని తెలిసినా.. దగ్గర చేసుకునే ప్రయత్నం చేయాలి.. కానీ తాజాగా ఏపీ సీఎం జగన్ రెండో కేబినెట్ కూర్పు చూస్తే.. అగ్రవర్నాలను ఆయన దూరం చేసుకుంటున్నారా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అగ్రవర్నాలు అంటే కేవలం రెడ్డా అంటూ కొందరు నిలదీస్తున్నారు. మరి వైసీపీ లెక్క ఏంటి..?
AP Cabinet: కమ్మ(Kamma) , క్షత్రియ (Khsatriya), ఆర్యవైశ్య (Aryana Vysya), బ్రాహ్మణ (Brahimn) ఈ నాలుగు అగ్రవర్నాలుగా చెబుతుంటారు. అయితే ఈ నాలుగు వర్గాల్లో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరి ఓట్లను ఎవరూ దూరం చేసుకోవాలి అనుకోరు. ఇతర కులాలతో పోలీస్తే ఓట్లు తక్కువగానే ఉన్నా.. వీరిని దూరం చేసుకోవాలని ఎవరూ ప్రయత్నం చేయరు. గత ఎన్నికల్లో ఆ కులం తమకు అనుకూలంగా లేదని తెలిసినా.. ఎదో ఒకలా ఆ వర్గానికి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తారు. కానీ తాజాగా జగన్ కేబినెట్ (Jagan Cabinet) కూర్పును పరిశీలిస్తే చాలామంది షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ నాలుగు కులాలకు చెందిన ఒక్కరు కూడా కేబినెట్ లో లేరు.. ఇప్పటి వరకు ఏర్పడని ఏ కేమినెట్ లోనూ ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. కనీసం ఒకటి రెండు పదవులు అయినా ఇచ్చే వారు. కానీ ఈ సారి అలా జరగలేదు. అయితే తరువాత డ్యామేజ్ కంట్రోల్ అన్నట్టు మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి ఏపీ డవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి చైర్మేన్ గా చేస్తామని, డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరబద్రస్వామి (Kolagatla veerabadr కి అవకాశం ఇస్తున్నామని, ప్రసాద రాజుకు చీఫ్ విప్ గా అవకాశం కల్పిస్తున్నామని, ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా మల్లాది విష్ణుకు అవకాశం ఇస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల వివరణ ఇచ్చారు..
కేబినెట్ లో ఆ నాలుగు అగ్రవర్నాలకు చెందిన వారిలో ఒక్కరి కూడా కేబినెట్ బెర్త్ ఇవ్వకపోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సీఎం జగన్ కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నారా..? అగ్రవర్ణాలు అంటే కేవలం రెడ్డిలేనా..? అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఎందుకంటే.. జగన్ కొత్త కేబినెట్ కూర్పులో అగ్రవర్ణాల నుంచి నలుగురు రెడ్డి సామాజికవర్గం వారున్నారు. అదే సమయంలో అగ్రవర్ణాలకు చెందిన నాలుగు కులాలనుంచి అసలు ప్రాతినిధ్యమే లేదు. మూడు కులాలకు చెందిన వారు గత కేబినెట్లో ఉన్నారు గానీ.. ఈ దఫా ఆ మాత్రం కూడా వారికి ప్రాతినిధ్యం దక్కలేదు.
ఒక కులానికి గతంలో గానీ, ఈ దఫా గానీ ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. ఒకటి రెండు ఇతర అగ్రకులాలకు ప్రాతినిధ్యం ఉన్నా.. ప్రధానమైన నాలుగు కులాలకు చోటు లేకపోవడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. కమ్మ వర్గం నుంచి గతంలో కొడాలి నాని ఉండేవారు. కానీ ఆయనకు మంత్రిగా రెండో ఛాన్స్ ఇవ్వలేదు. అయితే పాత కేబినెట్ లో ఉన్నవారికి 11 మందిని కొనసాగించడంతో కొడాలికి తప్పక ప్లేస్ ఉంటుందని అంతా భావించారు. కానీ సీఎం జగన్ మాత్రం షాక్ ఇచ్చారు. ఇక వైశ్య వర్గం నుంచి గత కేబినెట్లో ఉన్న వెలంపల్లి శ్రీనివాసరావు స్థానంలో అదే కులం నుంచి కోలగట్ల వీరభద్ర స్వామికి అవకాశం తప్పకుండా దక్కుతుందని అందరూ చాలాకాలంగా భావించారు. కానీ అనూహ్యంగా ఆయనను డిప్యూటీ స్పీకరు చేసి.. అసలు కేబినెట్ లో ఆ కులానికి చోటు లేకుండా చేశారు. క్షత్రియ సామాజికవర్గం నుంచి గత కేబినెట్లో ఉన్న శ్రీరంగనాథ రాజు స్థానం కూడా ఆ కులం నుంచి భర్తీ కాలేదు. బ్రాహ్మణులకు అప్పుడూ ఇప్పుడూ కూడా చోటు లేదు.
నిజానికి కాపు వర్గం నుంచి నలుగురు మంత్రులున్నారు. తూర్పుకాపు, శెట్టి బలిజ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఉంది. అయితే తాము బీసీలుగానే ఉండాలని భావిస్తున్న కాపులను పక్కన పెడితే.. కొత్త కేబినెట్లో అగ్రవర్ణాల ప్రాధాన్యం బాగా తగ్గినట్టే. నలుగురు రెడ్లు, ఒక్క వెలమ మాత్రం అగ్ర వర్నాలు వారిగా కనిపిస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలు ఎలా ఉన్నా..? కాపు, బీసీ, ఎస్సీ వర్గాల్లో అమితమైన కీర్తిని గడించడాన్ని జగన్ ఈ మంత్రివర్గ కూర్పు ద్వారా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి పక్కన పెట్టిన అగ్రవర్ణాల నుంచి పార్టీలో కొనసాగుతున్న నాయకుల్లో పెద్దగా అసంతృప్తి ఉండదని.. వారిని వేరే రకంగా సంతృప్తి పెట్టొచ్చని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చినట్టు పొలిటికల్ టాక్.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.