హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

RRR: ఏపీ పోలీసులకు మరో షాక్.. కస్టడీలో ఎంపీ రఘురామపై చిత్రహింసల ఆరోపణలపై నోటీసులు

RRR: ఏపీ పోలీసులకు మరో షాక్.. కస్టడీలో ఎంపీ రఘురామపై చిత్రహింసల ఆరోపణలపై నోటీసులు

ఏపీ పోలీసులకు మరో షాక్

ఏపీ పోలీసులకు మరో షాక్

ఏపీ రఘురామ అరెస్ట్.. కస్టడీలో చిత్ర హింసల ఆరోపణల వ్యవహారంపై ఇంకా ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎయిమ్స్ వైద్యుల చెప్పిన మాటలు బట్టి చూస్తే ఈ కేసులు ఎన్నో అనుమాలు కలుగుతున్నాయి. తాజాగా ఏపీ పోలీసుల తీరుపై NHRC సీరియస్ అయ్యింది.

ఇంకా చదవండి ...

వైసీపీ రెబల్ ఎంపీకి ఏమైంది..? ఏపీ సీఐడీ పోలీసుల కస్టడీలో ఉన్న రోజు ఏం జరిగింది. ఈ ప్రశ్నలు ఇంకా వెంటాడుతున్నాయి. మొదట సీఐడీ కోర్టు, తరువాత హైకోర్టు, ఆ తరువాత సుప్రీం కోర్టుల్లో విచారణ జరిగినా.. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. తాజాగా ఏపీ సీఐడీ కార్యాలయం మాత్రం మరోసారి ఆయన దెబ్బలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఆర్మీ వైద్యాధికారులు ఇచ్చిన రిపోర్టులో ఏపీ పోలీసులు కొట్టినట్టు ఎక్కడా లేదని పేర్కొంది. దీంతో మరోసారి సీఐడీ వివరణపై దుమారం రేగుతోంది.

ఎంపీ రఘురమాకృష్ణరాజుకు గాయాలు ఉన్నాయని ఆర్మీ వైద్యాధికారుల నివేదికలో ఉంది. సుప్రీం కోర్టు కూడా ఆ విషయన్ని నమ్మి ఆయనకు బెయిల్ ఇచ్చింది. తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు అయితే అసలు రఘురామకు చాలా పెద్ద దెబ్బలు ఉన్నాయని.. రెండు వారాల వరకు కాలు కింద పెట్టకూడదంటూ హెచ్చరించారు. మరి ఇన్ని దెబ్బలెలా అయ్యాయి అన్నది సమాధానం లేని ప్రశ్న.. మొదట ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న సమయంలో కాలిపై ఇంత పెద్దగాయలు ఉన్నట్టు ఎవరూ చెప్పలేదు. కానీ కస్టడీ సమయంలో మరి ఆ గాయాలు ఎలా అయ్యాయి అన్నదానికి పోలీసులే విచారించి నిజాలు తెలిసేలా చేయాలి.. ఎంపీ రఘురామ మాత్రం కస్టడీ పేరుతో తనను చిత్ర హింసలకు గురి చేశారని ఆరోపిస్తున్నారు...

అయితే ఈ అరెస్ట్.. చిత్ర హింసల విషయంలో ఏపీ పోలీసులకు వరుస షాక్ లపై షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ తరుపున గట్టిగా వాదనలు వినిపించినా నిలబడలేదు. రఘురామపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేటంత తీవ్రమైనవి కావని, పిటిషనర్‌ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పోలీసులు షాక్ ఇచ్చినట్టైంది తీర్పు...

ఇదీచదవండి: ఆనందయ్య ఆచూకీ కోసం ఆందోళన.. వెంటనే తమకు చూపించాలని గ్రామస్థుల డిమాండ్

తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ అరెస్ట్‌ తీరుపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్ అయ్యింది. ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కస్టడీలో రఘురామపై పోలీసుల దాడికి సంబంధించి.. అంతర్గత విచారణ చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 7లోగా నివేదిక ఇవ్వాలని డీజీని ఆదేశించింది. రఘురామ అరెస్ట్‌ తీరుపై ఎన్‌హెచ్‌ఆర్సీకి కుమారుడు భరత్‌ ఫిర్యాదు చేయడంతో.. నోటీసులు జారీ చేసింది..

ఇదీచదవండి: ఆనందయ్య మందుపై టాలీవుడ్ అభిప్రాయం ఇదే... బాలయ్య కీలక వ్యాఖ్యలు

రఘురామ కుటుంబ సభ్యుల ఫిర్యాదు.. మరోవైపు ఆయనకు గాయాలు ఉన్నాయంటూ ఆర్మీ వైద్యాధికారులు ఇచ్చిన మెడికల్ రిపోర్టుతో పోలీసులు కాస్త చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఎయిమ్స్ వైద్యులు సూచనలు చూస్తుంటే.. ఈ కేసులో ఏపీ పోలీసులతో పాటు.. హైకోర్టు సూచనల మేరకు మొదట ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్ట్ ఇచ్చిన వైద్యాధికారులకు కూడా చిక్కులు తప్పవని రఘురామ తరపు న్యాయవాదులు చెబుతున్నారు..

First published:

Tags: Andhra Pradesh, AP DGP, AP News, MP raghurama krishnam raju, NHRC, Raghu Rama Krishnam Raju

ఉత్తమ కథలు