హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: వైసీపీ సరికొత్త వ్యూహం.. వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ

AP Politics: వైసీపీ సరికొత్త వ్యూహం.. వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: త్వరలోనే వికేంద్రీకరణ కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు కాబోతోందని.. వారికి తమ పార్టీ నేతలు టచ్‌లో ఉన్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విధానానికి వ్యతిరేకంగా అమరావతికి(Amaravati) రాష్ట్రవ్యాప్త మద్దతు కోరేందుకు ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టిన రైతులు.. మరికొన్ని ప్రాంతాల్లో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు టీడీపీ గట్టి మద్దతు ఇస్తుండగా.. బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు కూడా అమరావతి రైతులకు సంఘీభావం తెలిపాయి. వారికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఏపీ ప్రభుత్వం(AP Government) తీసుకొస్తున్న పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ జేఏసీకి తాము మద్దతు ఇస్తామని వైసీపీ ముఖ్యనేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) అన్నారు.

  త్వరలోనే వికేంద్రీకరణ కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు కాబోతోందని.. వారికి తమ పార్టీ నేతలు టచ్‌లో ఉన్నారని అన్నారు. వారికి ఏ విధంగా సాయం చేయాలనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ జేఏసీకి తాము మద్దతు ఇస్తామని.. ఆ జేఏసీ తమతో పాటు ఇతర పార్టీల మద్దతు కూడా కోరుతుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

  అయితే అమరావతి రైతుల పాదయాత్రకు వైసీపీ ఇవ్వబోయే కౌంటర్ ఈ నాన్ పొలిటికల్ జేఏసీ అని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని టీడీపీ చెబుతుంటే.. పరిపాలన వికేంద్రీకరణే తమ విధానమని.. ఈ నినాదంతోనే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళతామని వైసీపీ పదే పదే చెబుతోంది.

  Kanipakam: కాణిపాకంలో అభిషేకం టికెట్ ధర రూ. 7000కు పెంపు.. ఏపీ ప్రభుత్వం సీరియస్

  YSRCP-BRS: బీఆర్ఎస్‌పై వైసీపీ అదే రకమైన ఆలోచనతో ఉందా ? వైసీపీ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు

  అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి జరగాలన్నదే తమ విధానమని.. అమరావతి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని వైసీపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నినాదాన్ని పార్టీ పరంగానే కాకుండా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా అమరావతి రైతుల పాదయాత్రకు కౌంటర్ ఇచ్చినట్టు అవుతుందని భావిస్తోంది. మొత్తానికి ఏపీలో వికేంద్రీకరణ కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పడితే.. ఆ తరువాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ysrcp

  ఉత్తమ కథలు